గోముఖ వ్యూహాల బండారం

_e53dde40-2cb3-11e6-85eb-521f5a9851b5చారువాలా అంటూ బయిలుదేరి ఓట్లు సంపాదించిన నరేంద్రమోడీ గారువాలాగా మారి పోయారని నేను చాలా సమావేశాల్లోనూ చర్చల్లోనూ అంటుంటాను. ఇది బిజెపి సంఘ పరివార్‌ రాజకీయ స్వభావానికి నిదర్శనమని చెప్పనవసరం లేదు. వాస్తవానికి అయోధ్య రామమందిరం సమస్య బిజెపి పెరుగుదలకు మూలమని అందరికీ తెలుసు.కాని 1966లో గోరక్షణ సమస్యపై విశ్వహిందూ పరిషత్‌ ఢిల్లీలో జరిపిన ప్రదర్శన ఉద్రిక్తమై ప్రదాని నివాసంపై దాడిలాగా మారడం పెద్దలకు మాత్రమే తెలిసిన విషయం. అప్పుడూ ఇప్పుడూ కూడా ఇంతగా గోనామం జపించే వారు వాస్తవంలో వాటిని ఏ మేరకు కాపాడుతున్నారనేది పరిశీలించాల్సిన విషయం.
ఇక్కడున్న రెండు చిత్రాలు గోరాజకీయాల రెండు ముఖాలను చెబుతాయి. రెండూ బిజెపి పాలనకు సంబంధించినవే. మొదటి చిత్రంలో ఆవులను వధిస్తున్నారంటూ కొందరు గ్రామీణులపై గోరక్షణ దళం సభ్యులు అమానుషంగా దాడి చేసి హింసిస్తున్న దృశ్యం చూడొచ్చు. ఈ దళం ఫిర్యాదుపై ప్రతాప్‌ఘర్‌ పోలీసు అధికారిని కూడా ముఖ్యమంత్రి బదిలీ చేశారు.
రెండవ చిత్రం ప్రసిద్ది చెందిన ఆరావళి పర్వత శ్రేణిలోని కొచార్‌ అనే గ్రామానికి సంబంధించినవి. ఇది సవాయి మాధవ్‌పూర్‌ జిల్లాలో వుంటుంది. చుట్టుపక్కల 25 గ్రామాల నుంచి ఆవులను తీసుకొచ్చి ఇక్కడ చావుకు వదిలేసి వెళుతుంటారు. 30 కిమీ పొడుగునా వున్న ఈ భాగంలో 25 నీటి వనరులు ఎండిపోయాయి. పల్లె ప్రజలు అనివార్యంగా ఆవులను వదిలివెళ్లిపోతారు. నీరు గడ్డి లేక అవి కొన్నాళ్లకు చచ్చిపోతాయి. అక్కడి స్కావెంజరు వృత్తిదార్లు , వాటిని ఆహారంగా తీసుకుపోతారు. రాబందులు కూడా వారితో పోటీ పడుతుంటాయి. ఇది జీవితం తాలూకూ కఠోర విషాద వాస్తవం.
ఇటీవలి కాలంలో గో రాజకీయాలు పెరిగిన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు ఈ ఆవులను రక్షించేందుకు ఏమైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే కాంగ్రెస్‌ దీన్ని రాజకీయం చేస్తున్నదని గోసేవ మంత్రి ఓతరం దేవాసీ థ్వజమెత్తారు. తామెప్పుడూ ఆవుల సrajasthan-vigilante-caption-provided-quality-moonmoon-received_93b13ed4-293c-11e6-a44e-cf92da887fb1మస్యను రాజకీయంగా చూడలేదు గాని బిజెపి బూటకత్వాన్ని వెల్లడించేందుకు మాట్లాడుతున్నామని ప్రతిపక్ష నేత సచిన్‌ పైలెట్‌ సమాధానమిచ్చారు. ఇది ఇలా వుండగా ఆవుల బాధ చూడలేకపోతున్నామని నీటి వనరులన్నీ ఎండిపోవడం పచ్చగడ్డి అంటూ కనిపించకుండా పోవడం వాటికి మృత్యుఘంటికగా మారిందిన స్థానికుడైన రాంకేష్‌ గుజ్జార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కొచార్‌ గ్రామంలో కనీసం 450 ఆవులు దీనంగా ప్రాణాలు వదులుతున్నాయి. వాటిని మృత్యుముఖంలో వదిలేసిన గోరక్షణ దళ సభ్యులు అమాయకులైన నిరుపేద మైనార్టి కుటుంబ సభ్యులను మాత్రం కొట్టిచంపినంత పని చేయడం ఆవులపై ప్రేమా లేక అమానుష రాజకీయమా?
దాద్రిలో మళ్లీ దారుణ క్రీడ
ఇది ఇలా వుంటే ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రి(బిసదా)లో గత ఏడాది సెప్టెంబరు 28న గోమాంసం కలిగివున్నారనే నెపంతో అఖ్లక్‌ఖాన్‌ అనే పేద ముస్లింను కొట్టిచంపారు. అతని కుమారుణ్ని దారుణంగా కొట్టారు. ఈ కేసు దేశాన్ని ఉడికించింది. బిజెపి నాయకుడు సంజరు రానా కుమారుడు విశాల్‌రానా కూడా అరెస్టయిన వారిలో వున్నారు. దీనిపై తర్వాత చాలా వివాదం నడిచింది. గోవధ కోసం మానవ వధ ఏం న్యాయమన్న చర్చ బాగా ముందుకు వచ్చింది. మళ్లీ ఇటీవల మధుర ప్రయోగశాలలో అక్కడ దొరికింది గోమాంసమేనని నివేదిక నిచ్చినట్టు ఒక కథనం ప్రచారంలోకి వచ్చింది. దీనికి మూలమేమిటో తెలియద07th_DADRI_IMG_2884313f ని ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ స్వయంగా ఆశ్చర్యం ప్రకటించారు. ఆ నమూనా తీసుకున్నది అఖ్లక్‌ఖాన్‌ ఇంట్లో కాదని అతన్ని కొట్టి చంపినచోట అని స్థానిక పోలీసులు మెమోరాండం ఇచ్చారు. అయితేనేం ఈ కథనం ఆధారంగా ఆవు మాంసం కలిగివున్న ఆ కుటుంబాన్ని శిక్షించాలంటూ బిజెపి మళ్లీ రాజకీయ రభస మొదలుపెట్టింది. ఎన్నికల కోణంలో ఇలాటి వివాదాలు పెంచుతున్నారని హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *