జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు -ఏచూరి పై ఆక్రోశం
ఈ రోజుల్లో మీడియా లాగే సోషల్ మీడియా కూడా టిడిపి వైసీపీల మధ్య విభజితమై అనుకూల వ్యతిరేక కథనాలలో మునిగితేలుతున్నది. ఈ క్రమంలో అనేక అనవసర ప్రశంసలూ అనుచిత ఆరోపణలూ పొంగిపొర్లుతుంటాయి. ఆ రెండు పార్టీల మధ్యనే అయితే అదో రకం. తమతో ఏ కాస్త విభేదించినా లేక నచ్చకపోయినా ఎవరిపైనైనా ఎంత మాటైనా అనేస్తున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై అలాగే తెలుగు గ్లోబల్.కామ్ ఒక విపరీతమైన ఆరోపణ ప్రముఖంగా ప్రచురించింది.ఈ ప్రకటన బిసి జాతీయ సంక్షేమ సంఘం అద్యక్షుడు కరుణాకరరెడ్డి చేసింది ఆయన చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మారి హైదరాబాదులోని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు ఇచ్చారట. ఏచూరి వ్యక్తిత్వం స్థాయి తెలిసిన వారెవరైనా ఈ మాటలకు నవ్వకుండా వుండలేరు. పైగా దీనికి కులం రంగు పులిమిందా కథనం. నాగార్జున రెడ్డి తన సోదరుడైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్(రాయచోటి) పవన్‌కుమార్ రెడ్డిపై వచ్చిన ఆరోపణను మాఫీ చేసుకోవడం కోసం ఎస్.రామకృష్ణ అనే దళిత న్యాయాధికారి(రాయచోటి) కులం పేరుతో దూషించికొట్టి అవమానించారని, లేనిపోని నేరం మోపి శిక్షణా చర్య తీసుకున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఎ.రామాంజులు అనే వ్యక్తి హత్యకు గురైనకేసులో మరణ వాంగ్మూలం మేరకు చర్యలు తీసుకోకుండా రామకృష్ణకు 2012 నవంబరులో హుకుం జారీ చేసిన నాగార్జున రెడ్డి ఆయన మాట వినకపోవడంతో ఇలా ప్రవర్తించారని దళిత సంఘాలు ఆందోళన చేశాయి. ఇదే గాక ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివుండటం,విచారించే కేసుకు సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేయడం వంటి ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి.
ఇన్ని అభియోగాలున్న నాగార్జునరెడ్డిని అభిశంసించాలంటూ సీతారాం ఏచూరి, సిపిఐ నేతడి.రాజా, జెడియు అద్యక్షుడు శరద్‌యాదవ్, కాంగ్రెస్ నేత దిగ్విజరు సింగ్‌లతో సహా 61 మంది ఎంపిలు రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు అందజేశారు. ఆయన దానిపై ప్రాథమికంగా పరిశీలన జరిపి చర్యలు చేపట్టారు.రాజ్యాంగం 217,124 అధికరణాల కింత జస్టిస్‌నాగార్జునపై చర్య తీసుకోవాలని వారు కోరారు. ఈ కేసులో నాగార్జున రెడ్డి తరపున వాదించవచ్చు లేదా సమాచారం వుంటే సమర్పించవచ్చు.అంతేగాని ఇన్ని పార్టీల అగ్రనేతలు కలసికట్టుగా ఇచ్చిన నోటీసును చంద్రబాబు చేతిలో పావులుగా మారారంటూ నిందించడం హాస్యాస్పదం. అనుచితం కూడా. గతంలోనూ జస్టిస్‌వి.రామస్వామి, సౌమిత్రసేన్ వంటి న్యాయమూర్తులపై అభిశంసన ప్రక్రియలు కొంతవరకూ సాగాయి. దళితులపై దౌర్యన్యం మాత్రమే గాక న్యాయాధికారినే బెదిరించి దాడి చేసిన ఈ ఘటనపైనా తప్పక విచారణ జరగాల్సిందే. నోటీసులోని అంశాలపై త్రిసభ్య కమిటీని నియమించి విచారణ జరిపిస్తామని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారి ప్రకటించారు. నాగార్జున రెడ్డి అక్కడేమైనా వాదించుకోవచ్చు. సమర్థుకులు ఆ తుదినివేదిక వరకూ ఆగితే మంచిది,..
ఈ ప్రకటన బిసి జాతీయ సంక్షేమ సంఘం అద్యక్షుడు కరుణాకరరెడ్డి చేసింది నివేదించామే తప్ప తమ స్వంత కథనం కాదని తెలుగు గ్లోబల్ వివరణ ఇచ్చింది. అది ఆయన ప్రకటనగానే వున్నా దానికి ఇచ్చిన ఫీచరింగ్, మరీ ముఖ్యంగా హెడ్డింగ్;పోటోలు వగైరాల రీత్యా ఈ పోస్టు రాశాను. వారికి అక్కడ సమాధానం ఇచ్చి ఇక్కడ ఈ వివరణ జత చేస్తున్నాను

