నోట్లరద్దుతో కల్లోలం-సుప్రీం కోర్టు

కేంద్రం నోట్ల రద్దు వల్ల దేశంలో ఏర్పడిన కొరతతో అల్లర్లు జరిగే ప్రమాదం పొంచి వుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. పరిస్థితి చాలా తీవ్రంగా వుంది. 86 శాతంగా వున్న నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వంద రూపాయల సరఫరా చేయలేకపోయింది. ప్రజల్లో అశాంతి పెరుగుతున్నది. అది అల్లర్లకు దారితీయొచ్చు అని ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ఠాగూర్‌ వ్యాఖ్యానించారు.
100 నోట్లు రద్దు చేయలేదుకదా వాటినెందుకు తగినంతగా సరఫరా చేయలేకపోయారు?ప్రజలు క్యూలలో నిలబడి కష్టనష్టాల నెదుర్కొంటున్నారు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై వివిధ రాష్ట్రాల హైకోర్టులలో దాఖలైన కేసులను విచారణకు తీసుకోకుండా నిలిపేయాలని అటార్నీజనరల్‌ ముఖుల్‌ రోహ్తగి చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ప్రజలు ఇంత సమస్యలో వుంటే మేమెలా కోర్టుల తలుపులు మూయగలం అని ప్రశ్నించింది. అయినా ఆ కేసుల బదలాయింపు పిటిషన్‌ వేస్తే పరిశీలిస్తామని చెప్పింది.
నోట్ల రద్దు బ్యాంకుల క్యూలతో ఇప్పటికే దేశంలో 47 మంది మరణించారని కపిల్‌ సిబాల్‌ తన వాదనలో చెప్పారు. దీనిపై రోహ్తగి అడ్డుపడగా నా కష్టార్జితానికి నోటు రూపంలో రక్షణ కల్పిస్తానని చెప్పిన ప్రభుత్వం అందుకు షరతులు పెట్టడం లేదని చెప్పడం ఎలా సమ్మతం అని ఆయనప్రశ్నించారు.రోహ్తగి ఏవో ఉపశమన చర్యలు తీసుకున్నట్టు చెప్పగా కోర్టు సంతృప్తి చెందలేదు. అనిల్‌ ఆర్‌దావేకూడా విచారణ జరుపుతున్న ఈ కేసు తదుపరి 25వ తేదీకి వాయిదా వేశారు.

One thought on “నోట్లరద్దుతో కల్లోలం-సుప్రీం కోర్టు

  • November 18, 2016 at 5:39 pm
    Permalink

    notlanu raddu chesaru kaani, avineetini control cheyaleka potunnaru, idoka avakasamga teesukuni chalamandi dalarula avatharam yetharu, indulo konni banks employees kooda vunnarata. nootiki padi saatham teesukuni notlanu marustunnarani antunnaru. november 8th prakatana vaste, november 9th nundi adi kotha upadiga marchuko galige varunnappudu, mari yevaru pastga react ayyutaro, kagalaro alochana cheste baguntundi. ippudu kotha vupadiki yevaru badyulu anekante, prajalanu kotha problem nundi rakshana kalipiste baguntundi.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *