ఓ వెంకయ్య.. పొగడమాకయ్యా!

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పొగడ్తల ధాటి తెలుగు వాళ్లకు బాగా తెలుసు. మరీ ముఖ్యంగా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన పనిగట్టుకుని పొగిడి తన వంతు పొగడ్తలు రాబట్టుకుంటున్నారు. తెలంగాణ వస్తే కెసిఆర్‌ ప్రభుత్వాన్ని కూడా యథాశక్తి కీర్తిస్తుంటారు గాని పోలిక వుండదు. ఆయనే ఢిల్లీ వెళితే ప్రధాని మోడీని మోసేస్తారు. ఎంత అంటే వూహించలేనంత. ఒకసారి మోడీ దైవదూత అన్నారు. తర్వాత ఒకడుగు ముందుకేసి ఏకంగా దేవుడన్నా తప్పులేదని పొగిడేశారు.అప్పుడు నేను ఆక్షేపించాను. రాజకీయాలలోనూ ప్రభుత్వ వ్యవహారాలలోనూ మర్యాదకోసం మంచి మాటలు చెప్పడం మామూలేగాని మరీ అతిగా పొగడ్డం అవతలివారిని ఆనందపెట్టే ప్రయత్నమవుతుంది. ఇప్పుడు నోట్లరద్దుపై విమర్శలతో ప్రభుత్వం ఆత్మసమర్థనలో వుంటే వెంకయ్య మాత్రం పొగడ్తల జోరు పెంచారు. ఈ చర్యతో మోడీ ప్రపంచ నాయకుడై పోయారట. కమల్‌ హాసన్‌ టైటిల్‌ లోకనాయకుడు తీసుకుని మరీ పొగిడారు వెంకయ్య. భారత దేశంలోనే చాలామంది వ్యతిరేకిస్తున్న ఈ చర్య మోడీని లోకనాయకుణ్ని చేస్తుందా?చైనా పత్రిక కాస్త ప్రశంస కాస్త విమర్శ కలిపిరాస్తే దాన్ని తనే ప్రచారం చేసి పెట్టారు. ఇప్పుడు చైనా పత్రికే ఈ చర్యను అపహాస్యం చేస్తూ రాసింది.బిల్‌గేట్స్‌ను దీనిపై అభిప్రాయం అడిగితే దాటేశారు. ఇంతవరకూ పొగిడిన నేతలెవరో తెలియదు. కాని వెంకయ్య నాయుడు మాత్రం తను పొగడ్డమే గాక అందరూ పొగిడారని చెప్పి మురిపిస్తున్నారు.
గతంలో అద్వానీ శిబిరానికి చెందిన వెంకయ్య ఆయనను అభినవ సర్దార్‌ అంటుండే వారు. ఈ మధ్యనే ఆ టైటిల్‌ మోడీకి మార్చేశారు. వాజ్‌పేయి హయాంలో ఆయనను వికాస్‌ పురుష్‌ అనీ అద్వానీని లోV్‌ా పురుష్‌ అని (ఇదే సర్దార్‌ టైటిల్‌) పొగిడితే అటల్జీ అలిగి వెళ్లిపోయారు. మళ్లీ మూడు రోజులకు తనే ఫోన్‌ చేసి సర్దుబాటు చేశారు. అఖిల భారత అద్యక్షులుగా చేశామనీ, అగ్రనేతలమనీ అనుకునే వారు అంత అతిగా పొగడ్డం అవసరమా అద్యక్షా?ఈయన ఎంత శ్రమ పడినా కరోడాలాటి మోడీజీ కరుగుతాడా పాడా?

One thought on “ఓ వెంకయ్య.. పొగడమాకయ్యా!

  • November 18, 2016 at 10:47 am
    Permalink

    వాజ్‌పేయి హయాంలో ఆయనను వికాస్‌ పురుష్‌ అనీ అద్వానీని లోV్‌ా పురుష్‌ అని (ఇదే సర్దార్‌ టైటిల్‌) పొగిడితే అటల్జీ అలిగి వెళ్లిపోయారు. ఒకసారి మోడీ దైవదూత అన్నారు. తర్వాత ఒకడుగు ముందుకేసి ఏకంగా దేవుడన్నా తప్పులేదని పొగిడేశారు.
    వెన్నులేని వీరులు వెంకయ్యవర్యులు, ఆంధ్రప్రదేశ్ దుస్దుిత్తులకు, అసలైన కారకులలో తానూ ఓకరైన, అస్సలుచెలించని స్ధితప్రజ్ఞతతనది. Villaki next time untundhi….2019,Comment:- baga chepparu, vennuleni vaariki magathanam kooda vundadani vydhya sastramlo vundani naanudi, magathanam leni vaari pravarthana alaane vuntundi kada?

    Reply

Leave a Reply to prasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *