నోట్లరద్దుపై పేదల గగ్గోలు – పెరిగిన విమర్శలు

నల్లడబ్బును నకిలీ డబ్బును అరికట్టడానికంటూ హఠాత్తుగా 500.1000 నోట్లను రద్దు చేసిన ప్రధాని మోడీ నిర్ణయం దేశమంతటా సామాన్యులతో హాహాకారాలు చేయిస్తున్నది. దీన్ని చూచాయగా నిన్ననే చెప్పుకున్నాం గాని ఈ రోజు అందరి అనుభవంలోకి వచ్చింది. ఆఖరుకు బ్యాంకు రీజనల్‌ మేనేజర్ల వంటి వారు కూడా ఏం చేయాలో ఏం జరుగుతున్నదో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఉదాహరణకు తామ ఇవ్వాల్సిన రుణాలు అత్యవసరమైన వారికి ఇచ్చేయాలా వద్దా,తమకు వంద నోట్లు ఎన్ని వస్తాయి వంటి వివరాలపై వారికే స్పష్టత లేదు.బ్యాంకులకు మరోరోజు సెలవిస్తారనే సమాచారం కూడా వుందట.
ఇక మామూలు మనుషులైతే ఈ రోజు వున్న నోట్లు తీసుకునేవారు లేక, అవసరాలకు వేరే నోట్లు లేక నరక యాతన పడ్డారు. పెట్రోలు బంకులు, మందుల షాపులు టోల్‌గేట్టు తీసుకుంటాయని చెప్పినా అక్కడా గడ్డుగానే వుంది. పైగా 500 తీసుకున్నాక చిల్లర ఇవ్వడానికి వారు సిద్ధపడటం లేదు. పట్టణాలు నగరాలే ఇలా వుంటే పల్లెపట్టుల సంగతి చెప్పనవసరం లేదు. ఈ నిర్ణయంతో నల్లడబ్బు చెల్లకుండా పోతే ఫర్వాలేదు గాని కష్టపడి తెచ్చుకున్న రెండు మూడు నోట్టు పనికి రాకపోతే ఎలా అని పేదలు వాపోతున్నారు.
సిపిఎం ఈ రోజు చేసిన ప్రకటనలో నోట్లరద్దు హడావుడికి ప్రచారానికి తప్ప ప్రయోజనం లేదనిస్పష్టం చేసింది. విదేశాల్లో నల్లడబ్బు తేలేకపోవడం, బడాబాబుల లక్షల కోట్ల రుణాల ఎగవేతను అరికట్టలేకపోవడం వంటి వైఫల్యాలనుంచి దృష్టి మళ్లించేందుకే ఈ తతంగం తpetrol-mపెట్టినట్టు విమర్శించింది.పాత నోట్లు ఇచ్చిన వారికి మళ్లీ కొత్తవి ఇచ్చేస్తుంటే ఇక అరికట్టడం ఎక్కడ అని ప్రశ్నించింది. 2000 నోట్లు అవసరమా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ప్రశ్నించారు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఈ నిర్ణయం వల్ల నల్లధనం తగ్గడమనే ప్రసక్తి వుండదని తేల్చిచెప్పారు. దొంగనోట్ల సమస్య చాలా చిన్నదని ఆయన వివరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు.
పేదలకు కొంత వెసులు బాటు ఇచ్చి ధనస్వాములపట్ల మరింత కఠినంగా వుండాల్సిందని పలువురు సూచించారు.ఇంత మొత్తానికి లోపు వుంటే సులువుగానూ ఇంతకంటే ఎక్కువగా వుంటే నిరాకరించేట్టుగానూ నిబంధనలు పెట్టి వుండాల్సిందని వారు తెలిపారు. నిజానికి కొత్తనోట్లు వేయడమనే పనికే ప్రభుత్వం ఇంత హంగామా చేసిందని కొందరు ఆర్థిక వేత్తలు అపహాస్యం చేశారు.
మొదటిసారి దీనిపైమాట్లాడిన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మార్పిడి కోసం డిపాజిట్‌ చేసే నిధులు 50000 పైన వుంటే పన్ను కట్టకతప్పదన్నారు. తాము పన్ను మినహాయింపు కల్పించలేదని గుర్తు చేశారు. అయితే సామాన్యులు కుటుంబాల పొదుపు మొత్తాలకు లేదా అవసరాలకు ఏ ఇబ్బంది రాబోదని హామీ ఇచ్చారు.ఈ నిర్ణయంపై గత శుక్రవారమే అరుణ్‌జైట్లీ ఆర్‌బిఐ అధికారుల అభిప్రాయం అడిగారట. వంద నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు గతంలోనే సర్క్యులర్‌ పంపారట.

ఇంతా చేసి ఈ రెండు రకాల నోట్లలో వున్న మొత్తం 13 లక్షల కోట్టుగా లెక్క వేశారు. ఇది మొత్తం నల్లడబ్బులో ఏ మూలకు చాలదు. అది కూడా అంతా బయిటకు వస్తేనే.నిజానికి బడా బాబులు ఇలాటి సందర్భాల్లో బినామిల ద్వారా మార్చుకోవడం సర్వసాధారణం. ఇక ఇంటర్‌నెట్‌ లావాదేవీలకు సమస్యే లేదు. కాబట్టి దీంతోనే ఏదో విప్లవాత్మక మార్పులువచ్చేస్తాయని ధరలు పడిపోతాయని ఏదేదో చెప్పడం హాస్యాస్పదం.

2 thoughts on “నోట్లరద్దుపై పేదల గగ్గోలు – పెరిగిన విమర్శలు

  • November 9, 2016 at 10:41 pm
    Permalink

    MEERU CHEPPEDANIKI CHANNELS DWARA YEDO ANDARIKI MELU JARAGABOTUNNATLU PRASARAM AVUTTUNNA DANIKI TEDA KANIPISTU VUNDI, YEDI YEMAINA SAAMANYUDIKI JARIGE MELU YEMI LEDU. OKA COMMUNIST PARTY LEADER CHEPPINATLU, PEDDA VARANTHA MUNDUGANE ANNI CHAKKABETTUKUNI, SIGGUVIDICHI SRIRANGA NEETULU CHEPPU TUNNARU KONADARU ABHINAVA HARICHANDRULU. VEERU PRAJALLOKI, MUKYANGA PRAYANALALO VUNNA VARI DAGGARIKI, VELLI CHEPPITE, VARI SANMANAALU PONDA VACHCHU KADA?

    Reply
  • November 12, 2016 at 10:15 am
    Permalink

    మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తూ ఉండగా,అనూహ్య రీతిలో మోదీ కొట్టిన దెబ్బకు విపక్ష పార్టీలు, కొందరు నేతలకు దిమ్మతిరిగిపోయింది.అందరూ ఆశించిన ‘అచ్చే దిన్’ సాకారమవుతోంది. andhra bhoomi editor gariki ila ardhamaindi. prajala badalu prajalave.

    Reply

Leave a Reply to prasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *