రాజధాని నిధులు మళ్లించి మళ్లీ కొత్తగా సేకరణా?

babu-new-latest-756-29-1464512470

నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం 32,500 కోట్ల రూపాయల సేకరణకు తొమ్మిది మార్గాలను అన్వేషించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశంలో చెప్పారు. వచ్చే పదేళ్లలో మొత్తం 43 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఇందులో అధిక భాగం వచ్చే మూడేళ్లలో వ్యయం చేయాలని ఆయన వివరణ. బాగానే వుంది గాని ఇప్పటికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల మాటేమిటి? హైకోర్టు అసెంబ్లీ భవనం వంటి వాటికోసం కేంద్రం ఇచ్చిన 800 కోట్ల పైచిలుకు నిధులను ఇతర పనులను మళ్లించిన ప్రభుత్వం ఇంకా వాటిని ఎక్కడ కట్టాలనేది కూడా తేల్చలేదు. మరి కొత్తగా సేకరించే నిధుల గురించి చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం? ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థలు, ఆస్పత్రులు వంటివి రప్పించాలని ఆదేశాలివ్వడం కూడా ఘనంగానే వుంది. కాని పరిశ్రమలు ఫైవ్‌స్టార్‌ హౌటళ్లు వస్తేనే రాజధానికి పేరొస్తుందని చంద్రబాబు చెప్పడం మరీ విచిత్రంగా వుంది. ఫైవ్‌స్టార్‌ హౌటళ్లంటే సరే వ్యాపారంకోసం కొంత వరకూ రావచ్చు. పరిశ్రమలు ఒక రాజకీయ రాజధానికి ఆఘమేఘాల మీద ఎందుకు వస్తాయి?ఎందుకు రావాలి? రాజధాని అంటే పారిశ్రామిక వాడవంటిదా? హైదరాబాదులోనూ పాలనా ప్రాంతానికి పరిశ్రమలకూ చాలా దూరం వున్నమాట నిజం. కాబట్టి వూరికే వూరించడం కోసం అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కూడా అతిశయోక్తులు చెప్పడం ఆశ్చర్యకరం. కేంద్రం నిధులకు లెక్కలు పంపడం తప్ప పనులే కాని పరిస్థితిలో ఈ విధంగా వేల కోట్ల గురించి వూహలు పరిగెత్తించడం ప్రచారంలో పెట్టడం రేపు బెడిసికొట్టే ప్రమాదముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *