బిజెపి ఎంపి నోట మరీ ఇంత నీచభాషా?
ు భారత పాక్ సమస్యలో
ప్రతిపక్షాలపై బిజెపి నేతలు తీవ్రంగా దాడి చేస్తున్నారు. ఇప్పుడు బిజెపి ఎంపి చౌదరి బాబూలాల్ వీరందరినీ మించి పోయారు.
. అరవింద్ కేజ్రీవాల్‌నో రాహుల్‌గాంధీనో సర్జికల్ స్ట్రయిక్స్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించడం వేరు. అలా అన్నందుకు వారు పాకిస్తాన్ ఏజంట్లుగా వర్ణించడం వేరు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఒకటికి రెండు సార్లు వారంతా పాక్ ఏజంట్ట భాష మాట్లాడుతున్నారని ఆరోపించడం ఆ పార్టీవారే సమర్థించలేకపోయారు. రాజకీయ విమర్శలకూ విద్వేష వ్యాఖ్యలకూ తేడా వుంటుంది. తన కోపమె తన శత్రువు అన్నట్టు వెంకయ్య నాయుడు అనేక కారణాల వల్ల అసహనానికి గురై చేసే ఈ వ్యాఖ్యలు తమకు రాజకీయంగా నష్టం చేస్తాయని కొందరు బిజెపి ముఖ్యులే ఆందోళన వ్యక్తం చేశారు. కాని అది వెంకయ్య వ్యక్తిగత ధోరణి కాదని రాహుల్‌గాంధీపై బిజెపి అద్యక్షుడు అమిత్ షానే నోరు పారేసుకోవడంతో తేలిపోయింది. సైనికుల రక్తంతో ప్రచారం రాజకీయ లబ్ది పొండవద్దని రాహుల్ గాంధీ అనడం( ఆయన దళాలీ అనే పదం వాడటం) అన్ని హద్దులు దాటిపోయిందని అమిత్ విరుచుకుపడ్డారు. బోఫోర్స్ తదితర కుంభకోణాలను ప్రస్తావించారు. అయితే అనేక కేసుల్లో చిక్కుకున్న మీరు రాహుల్‌ను అనే అర్హత ఎక్కడిదని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడి చేశారు.
ు. ఫతేపూర్ సిక్రీకి ప్రాతినిద్యం వహించే ఈ గౌరవ సభ్యుడు అసలు రాహుల్ గాంధీకి ఎవరికి పుట్టాడో కూడా తెలియదంటూ వీఢి తిట్ట భాష మాట్లాడారు. మహిళలను గౌరవించడం భారతీయ సంప్రదాయమంటారు. అందులోనూ ఇంటి కోడలికి చాలా విలువవుంటుంది.కాని బిజెపి సంఘ పరివార్ నేతలు మొదటి నుంచి కాంగ్రెస్ అద్యక్షురాలి విషయంలోఅసహ్యంగా మాట్లాడినవి చాలా వున్నాయి. కొన్నిటికి క్షమాపణలు కూడా చెప్పారు.అయితే ఇప్పుడు బాబూలాల్ అసభ్యతలో వారందరినీ మించి పోయాడు. తల్లిని స్త్రీని గౌరవించలేని వారు భారత మాతను మాత్రం ఏం గౌరవిస్తారు? ఇంతా చేసి సోనియా గాంధీపై వీరేదైనా విచారణ జరిపి నిర్ధారించారా అంటే అదీ లేదు. అనారోగ్యంతో వున్న ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఈ ఎంపిని బిజెపి ఏం చేస్తుందో చూడాలి.గాంధీని హత్యచేసిన గాడ్సేను దేశభక్తుడన్నప్పుడే ఏ చర్య తీసుకోని వారు ఇప్పుడు మాత్రం ఏదో చేస్తారని ఎలా అనుకోవడం?