జయ కొంచెం నయమేనా?

jya111

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి అధికార అన్నా డిఎంకె నేతలు ఈ రోజున వ్యక్తం చేస్తున్న ధీమాను బట్టి ఆమె పరిస్తితి కొంచెం మెరుగై వుండచ్చనిపిస్తుంది. ఇది కావాలని చెబుతుండొచ్చు గాని వదంతులలో ఏమాత్రం వాస్తవం వున్నా వారు ఇంతకు సాహసించలేరు, ఈ రోజు బ్రిటన్‌ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు రిచర్డ్‌ జాన్‌ బేరీ జయలలితకు అత్యుత్తమ చికిత్స అందుతున్నదని ప్రకటించారు, ఆయన అంత బలంగా అబద్దం చెప్పవలసిన అవసరం వుండదు. ఇక కేంద్ర సహాయమంత్రి బిజెపి నేత రాధాకృష్ణన్‌ ఆమె ఆరోగ్యంపై వూహాగానాలు చేయొద్దని హితవు పలికారు, రాష్ట్ర మంత్రి జయకుమార్‌. పార్టీ నేత వరల్మని కూడా ఆమె గురించిన కథలు నమ్మొద్దని కోరారు. ఆమె తీవ్ర పరిస్థితిని ఎదుర్కొన్నా కొంత వరకూ బయిటపడటం వల్లనే వీరంతా ఈ వ్యాఖ్యలు చేసి వుంటారని భావిస్తున్నారు, కావాలని నాటకీయత నిగూఢత పెంచే జయలలిత వ్యూహం కూడా ఆ మేరకు ఫలించినట్టే, ఆమె ఇప్పటికే మరణించారన్న కథనాలు వూహాగానాలేనని తేలిపోతున్నది, బహుశా ఇది కూడా ఆమె గురించిన భవిష్యత్‌ ప్రచారంలో ముఖ్యపాత్ర వహించవచ్చుvbk-apollo_3021413f
apollo_3030211f

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *