‘ఆది’ కవి పుట్టిన చోటనే మరో ఆదికవి!


సెప్టెంబరు 17న రాజమండ్రిలో కుసుమ ధర్మన్న కుసుమాంజలి కార్యక్రమం గురించి మిత్రులకు గతంలో తెలియజేశాను. నిజానికి ఆ రోజున హైదరాబాదులో పోలవరంపై రౌండ్‌ టేబుల్‌, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పుస్తకావిష్కరణలు వున్నా ముందుగా నిర్ణయించిన సభ గనక రాజమండ్రికే వెళ్లాను. నిజంగా ఆ సభ గొప్ప అనుభూతిని మిగిల్చింది . తొలినాటి దళిత నేతగా కవిగా ఆదిపీఠం అందుకోవలసిన కుసుమ ధర్మన్న ఎందుకు చరిత్రలో చిక్కకుండా పోయారు? మాకొద్ది నల్లదొరతనము అన్న ఆయన పాటలు గాని, హరిజన శతకం గాని ఏడెనిమిది దశాబ్దాలు అందుబాటులో లేకపోవడం.. పరిశోధకులు కూడా విస్మరించడం ఎలా సంభవించింది? రాబోయే రోజుల్లో వీటికి సమాధానమే కాదు, సంచలనాలు కూడా రాబోతున్నాయి. ప్రస్తుsakshi-_kusuma-dharmanna-19-09-1d7f85204-65f1-4072-aedd-a5f2995f07d8తానికి రాజమండ్రి సభపై ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు ఇచ్చిన కథనాలు ఇక్కడ-

https://youtu.be/-SPR11HM1fc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *