సూర్జిత్ ,జ్యోతిబాసు పేర్లే తలవని ,చంద్రబాబు , ఐవిఆర్ – మహానేతల బదులు లోకేష్ ముచ్చట

.1. ఇక తాను ప్రధాని అయ్యే అవకాశం వస్తే వద్దని లోకేశ్ సలహా ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో మాట చెప్పారు. ఇది కూడా ఐవిఆర్ పుస్తకంలో లేదు. ప్రధాని పదవి ఎక్కువ కాలం స్థిరంగా వుండదు గనక రాజకీయ భవిష్యత్తు మృగ్యమై మాజీగా మిగిలిపోతానని దూరాలోచన చేసిన చంద్రబాబు అందుకు నిరాకరించారని మాత్రమే ఆయన రాశారు. ఈ సమాచారం కోసం చూసే సమయంలో ఐవిఆర్ చేసిన పెద్ద చారిత్రిక తప్పిదమేమిటో నాకు అర్థమైంది. గతంలో అంత ప్రత్యేక పరిశీలనతో చదవలేదు. నిజానికి ఈ అధ్యాయం మొత్తం ఆయన సమతుల్యంగా రాయలేకపోయారు. చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ప్రతిపాదన రావడం అదృష్టమని ఒకసారి అంటారు. అది నిలిచే ప్రభుత్వం కాదు గనక ఎవరో వొకరు వుండాలని చూశారని ఆయనే అంటారు. చివరకు దేవగౌడను గత్యంతరం లేక ప్రధానిని చేశారని తేలిగ్గా తీసిపారేస్తారు. ఈ క్రమంలో చంద్రబాబు కింగ్ మేకర్, జాతీయ చక్రధారి అని ఎంతగా పొగిడినా అభ్యంతరం లేదుగాని ఆయనే సమన్వయ కర్త అని కితాబివ్వడం ఒక సీనియర్ నుంచి ఆశించలేము. అప్పటికి ఇంకా చంద్రబాబు నవ నాయకుడే. ఆయనకు అండగా నిలిచిన అసలైన సూత్రధారి సిపిఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్. విపిసింగ్,సూర్జిత్‌ల ఆశీస్సులు అండదండలు లేకుంటే చంద్రబాబుకు అంతటి స్థానం లభించేది కాదని అందరికీ తెలుసు. వాస్తవానికి అందరూ కలసి పశ్చిమ బెంగాల్‌లో 20 ఏళ్లుగా పాలిస్తున్న జ్యోతిబాసును ప్రధానిగా వుండాలని ఒకటికి రెండు సార్లు కోరారు. రాజకీయ విధానం ప్రకారం సిపిఎం అందుకు అంగీకరించలేదు.(తమాషా ఏమంటే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న కథనంలోని లోకేశ్ పాత్రలో అప్పుడు జ్యోతిబాసు కుమారుడు చందన్


బాసు వున్నారు. ప్రధానంగా ఆరోగ్యం, పనివొత్తిడి కారణంగా జ్యోతిబాసు కుటుంబ సభ్యులు అందుకు ఇష్టపడలేదని ఆయన జీవిత చరిత్ర రాసిన సురభి బెనర్జి పేర్కొన్నారు ప్రధాని పదవి తీసుకోకపోవడం చారిత్రిక తప్పిదం అని అప్పట్లో జ్యొతిబాసు చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది) అయితే ఐవిఆర్ పుస్తకంలో జ్యోతిబాసు, సూర్జిత్ ఇద్దరి పేర్లు లేకుండా నేరుగా చంద్రబాబునే పదవి చేపట్టమని కోరినట్టు రాయడం ఆశ్చర్యకరమే కాదు, చరిత్రకు అపచారం. అసలు ఆ ్ల యునైటెడ్ ఫ్రంట్ ఘట్టంలో చంద్రబాబుకు వామపక్షాల మద్దతు వుందని మాత్రమే చెప్పి ఆ ఇద్దరి పేరు రాయకపోవడం వూహకందని తప్పిదం. ఐవిఆర్ వంటి వారి నుంచి జరగవలసింది కాదు. ఆనాడు చంద్రబాబును ఫ్రంట్ కన్వీనర్‌గా, దేవగౌడను ప్రధానిగా తానే ప్రతిపాదిస్తే అలవోకగా జరిగిపోయిందని సూర్జిత్ నాతో రెండు మూడు సార్లు చెప్పారు. అనువాదకుడుగా నేను ఆయన ఎప్పుడు వచ్చినా వెంటనే ప్రయాణిస్తుండేవాణ్ని గనక ఇంకా చాలా విశేషాలు తమాషాలు చెబుతుండేవారు. దేవగౌడ అసమర్థుడని నిద్రపోతు అని తర్వాత చాలా ప్రచారం జరిగింది గాని చంద్రబాబుకన్నా ఆయన కర్ణాటకలో అఖండ విజయం సాధించి దాదాపు 23 లోక్‌సభ స్థానాలు తీసుకొచ్చారనేది కూడా ఒక వాస్తవం.
2.చంద్రబాబు ఇటీవల కాలంలో చాలాసార్లు ప్రధాని పదవి వదులుకోవడం, ప్రధాని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వంటి వాటికి తనే పేర్లు ప్రతిపాదించడం చేశానని చెబుతుంటారు గాని వెనక విపిసింగ్, సూర్జిత్, జ్యోతిబాసు వంటి హేమాహేమీలు వున్నారనేది కూడా చెబితే పూర్తి చిత్రం అర్థమవుతుంది.వారందరి తరపున ఆయన ఈ పనిచేశారు గాని వ్యక్తిగత శక్తియుక్తులతోనో బలంతోనే కాదు. యువకుడు లౌకిక పార్టీగా వున్న తెలుగుదేశం నాయకుడు గనక వారు ప్రోత్సహించారు. తర్వాత అదే వ్యక్తి అప్పుడూ ఇప్పుడూ ఎన్నిసార్లు ఫెడరల్ ఫ్రంట్‌ల కోసం ప్రయత్నించినా ఎందుకు సఫలం కాలేకపోయారంటే ఇలాటి అతిరథ మహారథుల అండదండలు లేకపోవడమే. బిజెపిని బలపర్చడం వల్ల కలిగే ఫలితమేమిటో వారెంత కించపరుస్తారో ఇప్పుడు ప్రత్యేక హౌదా ప్రహసనంలోనే తెలిసిపోతున్నది.
ఇక నరేంద్ర మోడీకి చంద్రబాబుపై కోపం వుందని, గతంలో ఈయన ముఖ్యమంత్రిగా వుండగా చాలా గట్టిగా మాట్లాడ్డమే కారణమని ఇంకో పెద్ద కథనం పచార్లు చేస్తున్నది. చంద్రబాబు నాయుడు దానిపైనా వివరణ ఇచ్చారు. ఆ వివరాలేమిటో రేపు చూద్దాం.
Ivr, chadra babu paksham, enta vayasu vachinaa kondarilo parivarthana raadu, meeru aasinchadam tagadu, puttukato vachinavi ………………………….., tone potavi ani peddala maata. mee lati vaaru lekapote ave nijaalavutaavi chala vastavaalu velugu loki teesukuvastunna meeku danya vaadalu.