ఓనం పండుగపై ఆరెస్సెస్‌ దాడి!

  • onam_celeberation_3006485f
    హిందూ మత విశ్వాసాలు ప్రశ్నించడానికి వీల్లేనివని ఆరెస్సెస్‌ వాదిస్తుంటుంది. ఆ పేరుతో అసహనం పెంచుకుని ఇతరులపై దాడులు కూడా చేస్తుంటారు పరివార్‌ సభ్యులు. కాని కేరళ ప్రజలు తరతరాలుగా ఘనంగా ప్రియంగా చేసుకునే ఓనం పండుగపై ఇప్పుడు దాడి మొదలుపెట్టింది. కేరళీయుల విశ్వాసం ప్రకారం బలిచక్రవర్తి ఈ పండుగ సమయంలో పాతాళంలోంచి పైకి వస్తాడు. అతన్ని స్వాగతించడానికే ఓనం జరుపుతారు. రాక్షస రాజైన బలి దానగుణశీలి. ఉత్తముడు.కను థామస్‌ ఐసాక్‌కనే అతన్ని ఏమీ చేయలేని దేవతలు విష్ణుమూర్తిని వామనావతారంలో పంపి మూడడు థామస్‌ ఐసాక్‌గుల నేల కోరడం.. మూడో అడుగు నెత్తిపై పెట్టి పాతాళానికి తొక్కేయడం తెలిసిన విషయాలే. ఇంతింతై వటుడింతింగై మరియు దానింతై.. అన్న పోతన్న పద్యం సుప్రసిద్ధం. (దానిపై తాపీ ధర్మారావు గొప్ప వ్యాఖ్య కూడా రాశారు) ఈ దానానికి సిద్ధమయ్యే సమయంలో ముందు రాక్షస గురువు శుక్రాచార్యులు బలిని హెచ్చరించాడు ఇదేదో విష్ణుమాయ అని. అయినా ఆ దాన వీరుడు వెనకడుగు వేయలేదు. అలా అయితే మరింత మంచిది కదా నా జన్మ తరిస్తుంది అంటూ సిద్ధమై పోయాడు. ఆ బలి చక్రవర్తి జ్ఞాపకార్థం మళయాలీలు పండుగ చేసుకోవడం ఆరెస్సెస్‌ వారికి నచ్చడం లేదు. అందులోనూ ఈ సారి సిపిఎం ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం వుండటం ఉభయుల మధ్య ఘర్షణలు కూడా తెలిసిన విషయాలే. ఈ నేపథ్యంలో ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు ఓనం పండుగపై పడ్డారు. ఆరెస్సెస్‌ పత్రిక కేసరిలో బలిచక్రవర్తి కథంతా తప్పు అని వామనుడి జయంతినే పండుగ జరుపుకొంటుంటే ఎవరో కావాలని పురాణాలను తారుమారు చేసి ఈ ప్రచారం తీసుకొచ్చారని ఆ వ్యాసంలో ఆరోపించారు. ఇది విన్న కేరళవాసులకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి సిపిఎంనాయకురాలు శైలజ ఈ వాదనలనుగట్టిగా తిప్పికొట్టారు. ఆరెస్సెస్‌ వారు ఓనంను హైజాక్‌ చేసేందుకు లేనిపోని ప్రచారాలు ముందుకు తెస్తున్నారని ఆమె ఖండించారు.
    సువిశాలమైన ఈ భారత దేశంలో హిందూ మతం అని చెప్పబడే దానిలో కూడా సవాలక్ష విశ్వాసాలు సంప్రదాయాలు వున్నాయి. గంగాస్నానానికి కొండుభొట్ల వారి ఆజ్ఞ అని ప్రతిదానికి ఆరెస్సెస్‌ ఐఎస్‌ఐ ముద్ర అవసరమా అద్యక్షా? గోసంరక్షణ ప్రహసనం,రచయితలపై దాడులు హత్యల వంటివి చాలక ఇప్పుడు పండుగల పైన కూడా దాడి మొదలెట్టారన్న మాట.చాలా గ్రామాలలో పూజించే దేవతలు నిజానికి ఆదిమ తెగలకు చెందిన వారై వుంటారు. పురాణాలలో లేరని తీసేయమంటారా? తమిళనాడులో రావణలీల జరిపే డిఎంకెతో బిజెపి వూరేగలేదా? ఇక్కడ కమ్యూనిస్టు వ్యతిరేకతకు బలిని బలి చేస్తున్నారంతే! మతతత్వం ముదిరిన ఫలితం ఇలాగే వుంటుంది.దీన్ని ఒక్క మళయాలీ కూడా అంగీకరించడం కల్ల
    ముస్లిం మతోన్మాదిపైనాకేసు
    మతాలు వేరైనా మతతత్వ వాదుల చేష్టలు ఒకే రకంగా వుంటాయి. ఇస్లామిక్‌ చాందసులు మహిళల పట్ల ఎలాటి అసమానతను అమానుషాన్ని రుద్దుతారో మనకు తెలుసు.అలాగే కేరళలో ఒక అమాయిక విద్యార్థినిని వేధించి అవమానించిన ఒక మత గురువుపై పోలీసులసు కేసు పెట్టారు. విషయమేమంటే ఆర్థిక మంత్రి మంచి మేధావి థామస్‌ ఐసాక్‌ ఆగష్టు 18న మార్క్వేజ్‌ లా కాలేజీ ఉత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక ముస్లిం విద్యార్థిని అభిమానంగా ఆయనతో కరచాలనం చేసింది. ఇదే ఛాందసులకు నేరమై పోయింది.నౌషాద్‌ అసానీ అనే ప్రబుద్ధుడు దీన్ని చిత్రించి నెట్‌లో పెట్టిkerala-budget_0e315156-78ea-11e6-8cf4-f1fcbcc69a66 ఆమెను అవమానించాడు. అంతేగాక ఆంక్షలు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో పోలీసులు 119 వ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *