రామా స్వస్తి, రావణా స్వస్తి- అదెలా సిఎం గారూ?
పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రసంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా వున్నాయి. పవన్ మాటలను స్వాగతిస్తున్నామని ఆయన అన్నారట. కేంద్రం ప్రకటించిన ప్యాకేజిని పవన్ తీవ్రంగా విమర్శించారు.పాచిపోయిన లడ్లతో పదేపదే పోల్చారు. చంద్రబాబు వాటిని స్వాగతించారు.ఇచ్చిన దానికి ధన్యవాదాలు, రావలసినదానికోసం ఇంకా కృషిచేస్తామని సరిపెట్టారు. ప్రకటించిన కేంద్రాన్ని స్వాగతించి దానిపై ధ్వజమెత్తిన పవన్ను కూడా స్వాగతించడం ఎలా సాధ్యమవుతున్నది? పవన్ మాటలను వ్యతిరేకిస్తే ప్రజలు ఒప్పుకోరనా? లేక పవన్ వెనక నేనున్నానంటూ గందరగోళ సంకేతాలు పంపాలనే వ్యూహమా?దీని భావమేమీ తిరుమలేశ?
