క్విక్ టేక్ ఆన్ పవన్

తిరుపతిలో ప్రకటించిన ప్రకారం సభ జరపడం
కేంద్ర ప్యాకేజీ ప్రహసనాన్ని చంద్రబాబు నాయుడు స్వాగతించిన తర్వాత కూడా పాచిపోయిన
లడ్డూలతో పోల్చడం
అప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేసిందని బిజెపి టిడిపిల తరపున ప్రచారం చేస్తే ఇప్పుడు బిజెపి మరీ ముఖ్యంగా సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు వంటివారు కూడా మాట తప్పారని విమర్శించడం.ద్రోహులు అనిపించుకోవద్దు
పాచిపోయిన లడ్డూలు తీసుకుంటారో లేదో నిర్ణయించుకోవలసిందే తెలుగుదేశం ప్రభుత్వమే. జీహుజూర్ అంటూ బతకనవసరం లేదు
తెలంగాణ సీమాంధ్ర ప్రజలు పరస్పర శత్రువులు కారు. సమస్యలు అలాగే కొనసాగిస్తున్నారు ఇక్కడ హౌదా ఇవ్వరు. అక్కడ హైకోర్టు ఎందుకు పెట్టరు?
విభజనను వ్యతిరేకించిన సిపిఎం అంటే గౌరవం.సీతారాం ఏచూరి మాటలంటే ఇష్టం. కలసి కార్యాచరణకు సిద్ధం
ముందు ఎంపిలు పోరాడాలి. వ్యాపారాలు చేసుకోవచ్చు గాని ఆ శ్రద్ధ ప్రజలకోసం కూడా చూపించాలి
అవంతీ శ్రీనివాస్ రాజీనామా చేస్తే నేను మళ్లీ గెలిపించేందుకు ప్రచారం చేస్తా
రాష్ట్రంలో అన్ని జిల్లాలకూ వెళతా. మాట తప్పితే ముప్పు తిప్పలు పెడతా.
రెండున్నరేళ్లు రాజధాని చుట్టూనే తిప్పుతూ మిగిలిన సమస్యలు విస్మరించా
ఇవీ ఇంకా ఇలాటి చాలా వ్యాఖ్యానాలు ఆయనలో ఆగ్రహాన్ని ఆవేదనను కూడా ప్రతిబింబించాయి.
తిరుపతి సభతో పోలిస్తే కొంత అస్పష్టత కలగాపులగం కనిపించిన మాట నిజం.
ఆరితేరిన వృత్తిపరమైన రాజకీయ వేత్త కాదు గనకనీ గజిబిజిని అర్థం చేసుకోవచ్చు.
ఈ నాయకులు ఎన్నికలప్పుడు బాగా అర్థమయ్యేలా వాగ్దానాలు చేస్తారు తర్వాత సాంకేతిక భాషలో మాట్లాడతారు. ఇంటికో గేదె నిస్తామన్న వారు గెలిచాక పశుసంవర్థక శాఖ కమిటీని వేస్తామంటారు. ఈ డైలాగు అత్తారింటికి దారేదిలో అప్పు కావలసినప్పుడు తెలుగులో అడుగుతారు తీర్చమంటే ఇంగ్లీషులో కోప్పడతారు అన్న దానికి దగ్గరగా వుంది
.ఈ సభలో చివర అపశ్రుతి ఒకరి మరణం, కొందరు గాయాల పాలవడం బాధాకరం.పోలీసులు నిర్వాహకులు మరింత జాగ్రత్త తీసుకోవలసింది.
తిరుపతి సభలో వామపక్షాలనీ కాకినాడలో సిపిఎం అనీ చెప్పారు గనక పవన్ మాటలను బలపర్చనవసరం లేదు గాని వాటిలో ఇప్పుడు ప్రజల మనస్థితి ప్రతిబింబిస్తున్న మాట నిజం. అందుకే తెలుగుదేశం వైసీపీలు రెండూ స్వాగతిస్తున్నామంటున్నాయి.