ప్రభుత్వాల డ్రామా ముగిసింది! ే ప్రజలు చూపే సినిమా మిగిలింది!!

2J0ichy

ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ప్రహసనంపై కొన్ని మీడియా సంస్థలు జరుపుతున్న చర్చలు ఇస్తున్న శీర్షికలు చూస్తుంటే తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేవలం రిసీవర్‌గా చిత్రించే ప్రయత్నం వెగటు పుట్టిస్తున్నది. సామాన్యమైన తెలుగు ప్రజలకు కూడా అర్థమైన విషయాలు అత్యున్నత నేతలకు తెలియకే ఇంకా ఎదురు చూస్తున్నారా?వారు పంపిన డ్రాఫ్టులు పరిశీలిస్తున్నారా? ఒక వైపున కలసి మంతనాలు జరుపుతూ పరోక్షంగా ఆమోదాలు తెల్పుతూ మరోవైపున తామే పోరాడుతున్నట్టు చెప్పుకోవడం దేనికి? ఏది ఏమైనా బిజెపితోనే వుంటామని ప్రకటిస్తే రేపు ప్రజలే వివరాలు తెలుసుకుంటారు తదనుగుణంగా స్పందిస్తారు కదా! కేంద్రం ప్రధమ దోషి నిజమే కాని తెలుగుదేశం ఆ దోషంలో భాగస్వామి కాదా? ఎందుకు మన అగ్ర మీడియా కేసరులు వన్‌సైడ్‌ షోలతో సరిపెడుతున్నట్టు? ఎవరిని కాపాడుతున్నట్టు? ఎందుకు ? హౌదా కోసం పోరాడే యోధులు కూడా ఎందుకు విమర్శలు ఒక్కరికే పరిమిbabu with delhi ldrsతం చేస్తున్నారు?
మరీ విచిత్రమేమంటే గుజరాత్‌ వర్సెస్‌ ఎపి అన్నట్టు కొత్త వాదన తేవడం. మొన్న విజయవాడలో చర్చ సైడ్‌లైన్స్‌లోనూ తెలుగుదేశం నేతలు ఈ తరహా వాదనలే చేశారు. బిసెంట్‌ రోడ్‌ సెంటర్‌లో మాట్లాడుకునే విషయాలు జాతీయ రాజకీయాల చర్చలో వినిపించడం ఎంత హాస్యాస్పదం? రాష్ట్ర విభజన అన్నప్పుడు ఇలాగే చిదంబరం తమిళనాడు కోసం ఎపిని చీలుస్తున్నారని టిడిపి నేతలు వాదించేవారు. ఇవన్నీ వింటుంటే నా వంటి వాడికి చికాకేస్తుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *