భారత- పాక్‌ల మధ్య కొత్త కుంపటి

indian-strategic-studies-pakistanoccupied-kashmir-the-future

భారత పాకిస్తాన్‌ల మధ్య ఇప్పటి వరకూ వున్న సమస్యలకు మరొకటి తోడయ్యేందుకు ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగం అంకురార్పణ చేసింది. ఆక్రమిత కాశ్మీర్‌ గిల్లిత్‌, బెలూచీస్థాన్‌లలో మానవ హక్కుల కోసం జరిగే పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఆ ప్రదేశాలు తాను చూడకపోయినా ఎప్పుడూ వెళ్లకపోయినా సరే మద్దతుఇస్తున్నందుకు తమకు కృతజ్ఞతలు అందుతున్నాయన్నారు. ఇప్పటి వరకూ కాశ్మీర్‌లో పాక్‌ చొరబాటుకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్న భారత దేశం ఆక్రమిత కాశ్మీర్‌ పరిస్థితిని కూడా చర్చనీయం చేయాలని కొత్త వ్యూహం చేపట్టింది. ఈ మేరకు మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. హౌం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా కాశ్మీర్‌కు సంబంధించి చర్చలంటూ జరిగితే ఆక్రమిత ప్రాంతాలపైనే అని స్పష్టంగా ప్రకటించారు. అక్కడ పాకిస్తాన్‌నుంచి కొన్ని భాగాలను చైనా కూడా లీజుకు తీసుకున్న నేపథ్యంలో భారత దేశ కొత్త వైఖరి కీలకమైన మార్పుగా పరిగణిస్తున్నారు. బెలూచీస్తాన్‌లో తిరుగుబాట్ల వెనక భారత హస్తం వుందని పాకిస్తాన్‌ ఆరోపిస్తుంటే మన ప్రభుత్వం ఖండించడం పరిపాటి. కాని ఇప్పుడు ఏకంగా ప్రధాని నోట మొదటి సారి ఈ మాటలు రావడంతో భారత దేశ జోక్యాన్ని అంగీకరించినట్టయింది. అదే విధంగా ఆక్రమిత కాశ్మీర్‌ సమస్యను లేవనెత్తితే భారత దేశంలోని జమ్మూ కాశ్మీర్‌ సమస్యపై పాక్‌ రభస చేయకుండా చూడొచ్చని మోడీ సర్కార్‌ అలోచన కావచ్చు. అయితే ఈ విధానం ఫలితంగా కాశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా అంగీకరించినట్టు అవుతుంది. ఐరాస పేరుతో అమెరికా జోక్యం చేసుకోవడానికి అవకాశమేర్పడుతుంది. కాశ్మీర్‌లో పరిస్థితి మరింత దిగజారినా ఆశ్యర్యపోనవసరం లేదు. నిజంగా ఈ ప్రభుత్వం లోతుగా ఆలోచించి ఈ నిర్నయం చేసిందా? మొన్న అఖిలపక్ష సమావేశంలో అలాటి సూచనలు చేసింది లేదు. కనుక దీన్ని తీవ్రంగానే పరిగణించాల్సి వుంటుంది.
ఆగష్టు 14నే పాకిస్తాన్‌ స్వతంత్రదినోత్సవ ప్రసంగం చేసిన పాక్‌ రాయబారి అబ్దుల్‌ బాసిత్‌ ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కాశ్మీర్‌ స్వతంత్రానికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా విదేశాంగ శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ ఆక్రమిత భాగాన్ని ఎలా విముక్తి చేయాలా అన్నదే తమ ఏకైక ఆలోచన అని ప్రకటించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ కూడా ట్విట్టర్‌లో ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ ఇప్పటివరకూ టెర్రరిజాన్ని నిరోధించేందుకే ప్రయత్నించిన తాము ఇకపై ప్రతివ్యూహాన్ని కూడా అమలు చేస్తామన్నారు. వీటన్నిటి నేపథ్యంలో చూస్తే ఇరు దేశాల మధ్య మరో కొత్త కుంపటి రగలడం తథ్యంగా కనిపిస్తుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగానే కాశ్మీర్‌లో పాక్‌ పతకాలు కనిపించాయి.అనుకూల నినాదాలు వినిపించాయి. ఇప్పుడు అవి ఇంకా తీవ్రమవుతాయి. ఇరువైపులా ప్రజలు నలిగిపోతారు. పాకిస్తాన్‌ తదుపరి సైన్యాధ్యక్షుణ్ని కూడా ఈ కోణంలోనే నియమించాలని పాక్‌ మీడియా రాస్తున్నది.ఎన్నికల తరుణంలో ఉద్రిక్తత పెరిగితే ఉపయోగమని బిజెపి కూడా భావిస్తున్నది.

One thought on “భారత- పాక్‌ల మధ్య కొత్త కుంపటి

  • August 15, 2016 at 7:47 pm
    Permalink

    This part of POK is not only beautiful but also strategically imp.to India as it throws up access to Afghanistan without going thru Pak.Long time back I travelled thru Kargil just on the border of POK to Ladakh.It is so beautiful &picturesque.U can find people with original Aryan features.We should take back POK to settle Kashmir issue once for all.

    Reply

Leave a Reply to Dinesh Reddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *