అగ్నిగుండంలా అమెరికా..భగ్గుమన్ననల జాతీయులు

2380279D00000578-0-image-10_1416955333642ఇండియా చైనా క్యూబా ఇలా అనేక దేశాలకు అమెరికా మానవ హక్కుల పాఠాలు చెబుతుంటుంది. తమపౌరుల భద్రత పేరిట ఇతర దేశాలపై దురాక్రమణలు చేస్తుంటుంది. కాని అక్కడ తుపాకి సంసృతి వందల మంది ప్రాణాలు తీస్తున్నా అది పెద్ద సమస్యగా వుండదు. ఇటీవల ఈ తరహా ఘటనలు ఎన్ని చూశామో లెక్కేలేదు. అయితే ఇప్పుడు నల్లజాతి వారికీ పోలీసులకూ మధ్యన సాగుతున్న భీషణ సమరం వాటన్నిటినీ మించిపోయింది. సాక్షాత్తూ అద్యక్షడు ఒబామా విదేశాల్లో వుండి కూడా తమ దేశంలో సామాజిక న్యాయ పరిస్థితి పట్ట శాంతి భద్రతల పట్ట ఆందోళన వెలిబుచ్చవలసి వచ్చింది. మినియా పలిస్‌లో ఫిలాండో కాస్ట్రీ అనే నల్లజాతియుడు స్నేహితురాలితో కలసి వెళుతుండగా అనవసరంగా అటకాయించిన పోలీసులు తర్వాత లతన్ని కాల్చేశారు. తుపాకికి లైసెన్సు వుందని చెబుతున్నా వినిపించుకోకుండా వేధించి తర్వాత ప్రాణాలే తీసేశారు.ఇదంతా ఆ అమ్మాయి మొబైల్‌లోరికార్డు చేయడంతో దేశమంతా వైరల్‌ అయిపోయింది. ఆగ్రహంమిన్నుముట్టింది. ఇందుకు నిరసనగా ప్రదర్శన జరుగుతున్నప్పుడు డల్లాస్‌లో ఆల్టన్‌ స్టెర్లింగ్‌ అనే ఆవేశపరుడు పోలీసులను కాల్చాడు. వారు అతన్ని కాల్శేఆరు. ఇలా మొత్తం ఆరుగురు నేలకొరిగారు. ఇక ఇప్పుడు దేశమంతా మరోసారి భగ్గుమంటున్న పరిస్థితి.మిన్నసోటా గవర్నర్‌ మార్క్‌ డేటన్‌ కూడా నల్లజాతీయుల భద్రత పట్ట వారిపై వివక్ష పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజానికి అమెరికాలో ఇలాటి మరణాలు 2015 మొదటి ఆరునెలల్లో 465 అయితే ఈ ఏడాది 491కి పెరిగాయి.వీరిలో నల్లజాతీయులే చాలా ఎక్కువనిచెప్పనవసరం లేదు. మృతులలో పదిశాతం మంది నిరాయుధులు. వృద్దులైన భారతీయులను కూడా అమెరికా పోలీసులు అమానుషంగా వేధించిన ఘటనలు మనం చూశాం. అందుకే మానవ హక్కుల నీతులు మానేసి దేశంలో పరిస్థితిని సామాజిక న్యాయాన్ని నెలకొల్పడం అంకుల్‌ శ్యాం ప్రథమ కర్తవ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *