భారతీయ పునర్వికాస కవీంద్రుడు

tagore2222
భారత దేశ వ్యాపితంగా తన కవితా ప్రభావం ప్రసరించడమే గాక అన్నిభా’ా కవులనూ ప్రభావితం చేసిన ఏకైక ఆధునిక కవి రవీంద్రనాథ టాగోరు అంతకు ముందు కాలంలోని కబీరు, నానక్‌ తుకారం, మీరాబాయి వంటి వారు కూడా భ’క్తులుగా తప్ప కవులుగా దక్షిణాది వారికి పరిచితులు కాదు. ఆ ఘనత దక్కిన ఏకైక భారతీయ కవి రవీంద్ర నాథ టాగోరుమాత్రమే. ప్రసిద్ధ వామపక్ష చరిత్ర కారుడు కె.ఎన్‌. ఫణిక్కర్‌ ఈ విషయం చెబుతూ తమ మళయాల భాషలో మహాప్రసిద్ధుడైన వల్లథోల్‌ నారాయణ మీనన్‌ కూడా రవాగూరు ప్రభావానికి గురైనటుy గుర్తు చేశారు. ఒరియాలో కాళిందీ చరణ్‌ పాణిగ్రాహి, అన్నదా శంకరరారు, వైకుంరy నాథ్‌ వంటివారు ఈ ప్రభావంతోనే సచుజ్‌(హరిత)కవులుగా ఏర్పడి కవితా సృజన చేశారు. హిందీలో నిరాలా ,ప్రసాద్‌,పంత్‌ త్రయం కూడారవీంద్రుని ప్రభావంతోనే ఛాయావాద్‌ అనే కాల్పనిక కవిత్వ శాఖను నడిపించారు.
ఇక తెలుగు కవిత్వంలో ఆధునికతకు ఆద్యుడైన గురజాడ అప్పారావుకు టాగోరు పట్ల అమిత గౌరవం. మన కవులకే మార్గదర్శకుడైన గురజాడనే ప్రభావితం చేయడంలో టాగోరు గొప్పతనం తెలియడం లేదూ? 1908 నాటికి తెలుగు కవులను టాగూరు జాతీయ భావన ఎంతగానో ఉత్తేజపర్చినటుy సిఆర్‌ రెడ్డి రాశారు.
గురజాడ టాగోరు కన్నా మూడు నెలలు మాత్రమే చిన్న. అయితే కవిత్వ పరంగా, విజ్ఞాన పరంగా మాత్రం ఆయన పట్ల చాలా గౌరవం. ఆయనతో పరిచయం పెంచుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. వాడుక భాష కోసం తను జరుపుతున్న పోరాటంలో టాగోరు సలహాలూ సూచనలూ వుపయోగించుకున్నాడు.బెంగాలీ సంపాదకుడు శంభ’ు చంద్ర ముఖర్జీ తమ కవిత్వంలో వస్తున్న కొత్త ధోరణులను గురజాడ దృషిyకి తెచ్చాక టాగోరును ప్రత్యేకంగా అధ్యయనం చేయసాగారు. ప్రజల భాషలో రాయడం ఇషyంలేని వాడు రాయడమే మానుకోవచ్చని టాగోరు అన్న మాటలు ఆయనను చాలా ఉత్తేజ పర్చాయి.1912లో కోల్‌కత్తాలో టాగోరును కలిసిన తర్వాత గురజాడ ఇలా రాశారు:
కవి రాజైన రవీంద్రునికి బంగాళా చూపిన మిక్కుటపు పేరు పారలేని భ’క్తి ఏ రాజెరుగును. ఆ మహాకవి భాషను యెత్తాడు. తలపుల నెత్తాడు. కీర్తి వెన్నెలల దిక్కుల నింపాడు. అది తన కీర్తి అని వంగ దేశము గుర్తించినది. అతను తన సిరియని గర్వించింది. దేవుడని పూజించింది.
టాగూరు శాంత స్వభావి. మాట పొందిక మహ మెత్తన. నాజూకైన ముఖ లక్షణాలు. తేటగా సున్నితంగా నవ్వుతారు. మాటలాడేప్పుడు పురుషత్వం తొణకిసలాడుతుంది. ఇక విధమైన మనో నిశ్చయం ప్రస్పుటమువుతుంది. మన వీరేశలింగం గారి మన:ప్రవృత్తికిది పూర్తి విరుద్ధం. ఆయన వలె రవీంద్రుడు గడబిడగా మాట్లాడడు. సంభాషిస్తున్నప్పుడు జీవం తొణకిసలాడుతూ వుంటుంది.ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవచిస్తున్నప్పుడు కంరyం శ్రావ్యంగా వుంటుంది.రవీంద్రునిది వినసొంపైన గొంతుక” టాగూరు కవిత్వాన్నే గాక వ్యక్తిత్వాన్ని స్వరాన్ని స్వరూపాన్ని కూడా గురజాడ అంతటి వ్యక్తి ఇంత పరవశంతో వర్ణించారంటే ఆయన ప్రగాఢ ముద్ర తెలుస్తుంది.
గురజాడ తర్వాత అంతటి వాడుగా పేరు పొందిన రాయప్రోలు సుబ్బారావు 1915 నుంచి 1917 వరకూ రెండేళ్ల పాటు టాగూరు దగ్గరే శాంతి నికేతన్‌లో గడిపారు. ఆయన రచనలను అనువాదం చేశారు కూడా. వీరందరి భావ కవిత్వంపైన ప్రకృతి ఆరాధనపైన టాగూరు కవిత్వ ప్రభావం అపారంగా వుంటుంది.వేంకట పార్వతీశ్వర కవులు టాగూరును మొదట్లో అనువదించి జనానికి అందుబాటులోకి తెచ్చారు. దేవుల పల్లి కృష్ణశాస్త్రి, చలం,దువ్వూరి రామిరెడ్డి కూడా టాగూరు పట్ల ఎంతగానో ఆకర్షితులైనారు. ఫిడేలు రాగాల డజన్‌తో సరికొత్త కవిత్వాన్నితెలుగులోకి తెచ్చిన పరవాభి కూడా శాంతి నికేతన్‌ విద్యార్థి. ఆ రోజులలోనే ఆయన టాగూరు ప్రకృతి ప్రేమ వగైరాలపై తిరుగుబాటు చేశారని ఎవరో రాస్తే దాన్ని పటాభి గటిyగా ఖండిస్తూ రవాగూరుపై తన గౌరవాన్ని పునరుద్ఘాటించారు. సంచలన కవి చలం కూడా రవాగూరును అనువదించడమే గాక ఎంతగానో గౌరవించారు
ఇక ఆ ప్రభావానికి తలవంచక పోగా ప్రతికూలత చూపిన ఒకే ఒక గొప్పకవి శ్రీశ్రీ. ఆయన టాగూరుపై అదే పనిగా విమర్శలు రాస్తూ వచ్చారు. ఇందుకు చలం గటిyగా సమాధానం ఇస్తే తను మారబోనని శ్రీశ్రీ చెప్పారు. టాగోరు నా అల్లెర్జీ అంటూ ఆయన పనిగటుyకుని రాసింది చూస్తే ఇప్పటికి ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీశ్రీకి భిన్న ధృవంగా ఖ్యాతికెక్కిన విశ్వనాథ కూడా టాగూరును పెద్దగా నెత్తిన పెటుyకోరు.
టాగూరులోని స్వేచ్చా ప్రియత్వం, సౌందర్యారాధనా దృషిy, దేశ భ’క్తి భావన ప్రయోగ శీలత ఆయనను తెలుగు వారికి సన్నిహితం చేశాయి. జీవితంలో వైవిధ్యాన్ని టాగూరు ఆహ్వానించారు, ఆవిష్కరించారు కూడా. (కవితలు చూడండి) జీవితాన్ని తృణీకారంగా చూసే వైరాగ్య భావనను టాగూరు ఆదరించలేదు. అయితే ఆయన జీవన తాత్వికత ఏమిటన్నది ఎప్పుడూ నిగూఢంగానే మిగిలిపోయింది.
1962లో రాయప్రోలు సుబ్బారావు టాగూరు ప్రభావం భావ కవిత్వానికే పరిమితమన్నటుy రాస్తే కె.వి.రమణారెడ్డి దానితో విభేదిస్తూ ఆయన దృక్పథం వామపక్ష అభ’ు్యదయ వాదులకే దగ్గరగా వుంటుందని వివరించారు. ” కమ్యూనిసుy సాహిత్యం దూకి పడిన తర్వాత టాగూరు ప్రభావం అంతరించిందనడం అబద్దమే గాక ఆత్మాపచారమని తెలుసుకోవాలి. రవీంద్రుని జాతీయాంతర్జాతీయ భావనా వైఖరులకు భారతీయ సాహిత్యంలో నిజమైన వారసులు అభ’ు్యదయ రచయితలు. ప్రజా సంక్షేమం.రాజకీయ, ఆర్థిక భావ స్వేచ్చలు, యుద్ధ పరాజుఖత్వం, ఫాసిజం నిరసన సామ్యవాద వ్యవస్థలో ప్రత్యక్షమైన సంసృతీ మూల్యాల గుర్తింపు ఇవి వ్యక్తిగా రవీంద్రుని మూర్తిని పెంచగలిగాయి’ అని కె.వి.ఆర్‌… రాశారు. ” రవీంద్రుని మర్మవాదం, అధ్యాత్మిక భావన,ఎంత మధురమైనా అభ’ు్యదయ రచయితల మదికెక్కలేదు.కారణమేఇటంటే వారు ఎక్కువగా భౌతిక వాదులు. మానవలోకాన్ని మించి చుక్కలు గుటుy విప్పేందుకు మబ్బుల వలువలు వలిచేందుకు సృషిy మర్మం కనుగొనేందుకు తమ భావాలను వాళ్లు గాలికి వదలలేదు. ఈ అభిప్రాయాన్ని కాస్త వికటంగా ప్రకటించడానికే గీతాంజలి కంటే వాడేవీడు అనే అపరాధ పరిశోధక నవల గొప్పదని శ్రీశ్రీ అనవలసి వచ్చింది.మహనీయులు విడిచి వెళ్లిన సంసృతీ ధనంలోని పొల్లును తీసి నెల్లును స్వీకరించే గుణం రచయితలది” ఇంతకూ టాగూరు తొలిదశలోని కవిత్వాన్ని భావ కవులు స్వీకరిస్తే తర్వాతి కాలపు సామాజిక చైతన్యకవితను అభ’ు్యదయ కవులు ఆరాధించారు. అందుకే ఈ వైరుధ్యం అనివార్యం.
గీతాంజలిని ఎందరు తెలుగులోకి అనువదించారో లెక్కలేదు. ఇప్పటికీ అది అంతగా ఆకర్షిస్తూనే వుంటుంది. విశి’ాyద్వైతాన్ని విలక్షణ శైలిలో ఆవిష్కరించిన రచనగా చెప్పే గీతాంజలి ఆంగ్లానువాదాలు కూడా తెలుగు నాటు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ ప్రభావంతోనే రవీంద్ర భారతి మొదలు వూరూరా ఆ పేరిట పారyశాలలు కూడా వెలశాయి.కొన్ని దశాబ్దాలలో తెలుగు వారు చాలా ఎక్కువగా పెటుyకున్న పేర్లలో రవి ఒకటైంది. గీతాంజలి కవిత్వ సారాంశం ఏమైనా సౌందర్యం మాత్రం ఆకర్షిస్తూనే వుంటుంది. అందులోని ఒక గీతం భారత దేశంలో ప్రగతిశీల భావకుల స్వేచ్చా ప్రియుల అనధికార ప్రణాళికగా మారిపోయింది.
నోబుల్‌ బహుమతి వచ్చినందువల్ల గీతాంజలి గురించి ఎక్కువగా చెప్పుకున్నా టాగూరు మొత్తం వెయ్యికి పైగా కవితలు రాశాడు. రవీంధ్ర సంగీతంలోని వేలాది పాటలు రాయడమే గాక తనే బాణీలు కటాyడు.1896-1901 మధ్య కాలంలో కణిక,కల్పన, నైవేద్య వంటి కవితా సంపుటాలు వెలువరించాడు. ఈ సంపుటాల్లో ఒక అదృశ్య అస్పషy నాయికను దృషిyలో పెటుyకుని రాశాడు.ఆమెను కొన్నిసార్లు మానవి అని, మరికొన్ని సార్లు విచిత్ర వ్యక్తి అని, ఇంకా కొన్ని సార్లు సౌందర్య రసాధిదేవత అని పలు రకాలుగా చిత్రిస్తూవచ్చాడు. ఈ కవితలు ప్రేమ సౌందర్యాల మయంగా వుండి మన భావ కవిత్వానికి వరవడి పెటిyనటుy అగుపిస్తాయి. 30 ఏళ్ల ప్రాయంలో జీవితం నుంచి దూరంగా తన లోకంలో తనుండి పోయిన టాగూరు మనస్తత్వం మొదటి ప్రపంచ యుద్దం తర్వాత చాలా మారిపోయింది.అప్పటి వరకూ ఆయన తను పెరిగిన నేపథ్యాన్ని బటిy ప్రపంచం అంటే ఇ’ాyనుసారం నడుస్తుందని అనుకునేవాడు. కాని ఆ యుద్దం తర్వాతే ఆయనకు మానవజాతి ఎదుర్కొంటున్న సవాళ్లు సంక్లిషyతలు తెలిసి వచ్చాయి. ఆదర్శ వాదం మాయమై వాస్తవికత పొటమరించింది.అప్పుడే ఆయన ‘వెనక్కు తిరిగి చూసే సమయం’ అన్న కవిత రాశాడు. తర్వాతి కవిత్వం రూపురేఖలు మారిపోయాయి. వాస్తవానికి గీతాంజలికి నోబుల్‌ బహుమతి వచ్చేనాటికే ఆయనలోని మార్మిక వాదం మాయమై పోయిందని పరిశీలకుల అభిప్రాయం. అందులోనూ బంగ్లా భాష తెలిసిన వారికి రవాగూరు విభిన్నంగా ఆత్మీయంగా కనిపిస్తాడంటారు. చలాకా(ఆడకొంగ) అనేకవితా సంపుటిలో రవాగూరు రమణీయ పద గుంఫనం, పద ప్రవాహం గోచరమవుతాయి. పలాతక్‌ లో ఆయన జానపద శైలిని తీసుకుని మహిళల బాధలను గానం చేశాడు.రొమాంటిక్‌ కవిగా రవాగూరుకు తిరుగులేదని విమర్శకుల అంచనా.బెంగాలీలో ఆయన తర్వాత విష్ణుడే వంటి మార్క్సిసుy కవులు, జీవనానంద దాసు వంటి ప్రతీక వాదులు కూడా బాగా పేరు తెచ్చుకున్నారు.
1925-41 మధ్య ఆయన పూరబి,మహయ, పరిశేష్‌,సప్తన్‌, విచిత్ర, దిధిక, ప్రాంతిక, ప్రవాసిని, వనజాతక, రోగశయ్యారు,ఆరోగ్య,జన్మదినే,జీవన దేవత తదితర కావ్యాలు వెలువరించారు. పూరబి బాలక మహయ వంటి ఈ కవితా సంపుటాల్లో ఆయన ప్రకృతి పరిష్వంగం నుంచి ప్రపంచపు టావర్తంలోకి రావడం చూస్తాం. ప్రాంతిక,స్నేంజుతి వంటి కవితల్లో ఆయన ఫాసిజాన్ని గటిyగా నిరసించడం కనిపిస్తుంది. మనిషిలో అమానుషత్వం అంత దారుణంగా వుంటుందని ఆయనకు ఐరోపాలో పర్యటించిన తర్వాత తెలిసి వచ్చింది.అప్పటి నుంచి ఆయన కవిత్వమే గాక బెంగాలీ కవిత్వం కూడా మారిపోయింది. జన్మదిన్‌ మానవీయ విలువలకు పటyం కటిyన మహోన్నత కవిత. బెంగాలీ సనాతన సంప్రదాయాలను ధిక్కరిస్తూ గద్య కవిత్వం అన్న దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా టాగూరే. ఆయన ప్రేరణతోనే బెంగాలీ నూతన కవి లోకం సృజనలో పరవళ్లు తొక్కింది. వారంతా ఆయనకు వందనం చేశాకే తమ గురించి చెప్పుకుంటారు.ఇంతకూ టాగూరు పీడిత ప్రజా కవి అని చెప్పడం కషyమే గాని ప్రపంచ శాంతిని, ప్రజాస్వామిక లౌకిక విలువలనూ కోరిన ప్రజాస్వామిక వాది అని సామ్యవాదాన్ని కూడా స్వాగతించిన దార్శనికుడని చెప్పక తప్పదు. నోబుల్‌ బహుమతి గ్రహీతగా వుండి ఫాసిజాన్ని వ్యతిరేకించడం, సోవియట్‌ ను హర్షించడం చిన్న విషయాలు కాదు. ఆ అర్తంలో ఆయన నిజంగా విశ్వ కవీంద్రుడే.
……………
ఒక శూన్య సంతోషం నాలో నిండనీ
నా చేతిని నీ చేతిలోకి తీసుకో
అంతే చాలు
చీకటి పరుచుకునే నిశి వేళ
నా హృదయం నీదిగా చేసుకో
స్వేచ్చగా ఆడుకో
……..
ఆమె నన్ను విడిచి
వేగంగా వెళ్తుంది
తాకింది నన్ను
తన పరికిణీ జలతారు అంచు
…..
ప్రణయోన్ముఖంగా నేను ప్రయాణిస్తుంటే
పక్షులు పాడవు
గాలి కదలదు
నీరవ నిశ్శబ్దంగా వుండి పోతాయి
అటూ ఇటూ ఇళ్ల సముదాయాలు
…..
నా అస్తిత్వానికి దారిచేసే ధృవతారవు నీవే
ఇక జీవన యాత్రలో నేనెలా దారి తప్పేను?
…..
ఎక్కడ మనసు నిర్భయంగా సంచరిస్తుందో
శిరస్సు సమున్నతంగా భాసిస్తుందో
ఎక్కడ సంకుచితత్వపు అడ్డుగోడలతో ప్రపంచం
చిన్నాభిన్నం కాలేదో
ఎక్కడ మాటలు హృదంతరాళాన్ని చీల్చుకుని
దూకుతాయో
ఎక్కడ నిర్విరామకృషి పరిపూర్ణతకై
పరుగులు తీస్తుందో
ఎక్కడ హేతువు దారితప్పి
నిర్జీవ మరీచకగా మారదో
ఎక్కడ మనసు నీచే
నిరంతర విస్త్రత యోజనల్లోకి పయనిస్తుందో

ఆ స్వేచ్చా స్వర్గంలోకి నా తండ్రీ
నా దేశాన్ని నడిపించు.
………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *