లాటిన్ అమెరికా దేశాల్లో కొత్త కుట్రలు
రిజిమ్ ఛేంజ్ (ప్రభుత్వాల మార్పు) అన్నది అమెరికాకు చాలా ఇష్టమైన పదం. అదే సమయంలో ఆయా దేశాల స్వతంత్రాభివృద్ధికి చేటు తెచ్చే పదం కూడా. గతంలో నికరాగ్వాలో శాండినిస్టా ప్రభుత్వం వున్నప్పుడు ఇదే వ్యూహంతో దాడి చేసింది.ఇరాక్ లిబియా ఇప్పుడు సిరియా ప్రతిచోటా ఇదే పాట రిజిమ్ ఛేంజ్. ఇస్లామిక్ తీవ్రవాదంతో పోట్లాడేది తామేనన్నట్టు హడావుడి చేస్తుంటుంది అమెరికా. కాని ఆ శక్తులను భారీ పెట్టుబడులు సమకూర్చే అరబ్ రాచరికాలను మాత్రం కాపాడుతుంది. అక్కడున్న సంపదలు చమురు నిల్వల కోసం.. అందుకే అక్కడ ప్రజాస్వామ్యం లేదనే మాట దానికి పట్టదు.
అదలా వుంచితే లాటిన్ అమెరికాలో వెనిజులా అద్యక్షుడు హ్యూగో చావేజ్‌తో మొదలు పెట్టి వామపక్ష ప్రజాస్వామిక ప్రభుత్వాలు రావడం అమెరికాకు ఏ మాత్రం మింగుడుపడని పరిణామం. బ్రెజిల్, చిలీ, పరాగ్వే, ఎల్ సాల్వడార్, నికరాగ్వా ఇలా అనేక చోట్ల రకరకాల ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడి అమెరికా అధిపత్యాన్ని పక్కనుంచే సవాలు చేశాయి. కాని ఎన్ని పాచికలు వేసినా . క్యూబా కూడా వెనిజులాకు తోడు నిలవడంతో ఆయన ప్రజాబిమానాన్ని కదిలించలేకపోయింది.2013లో చావేజ్ మరణానంతరం దాని పథకాలు పురివిప్పుకున్నాయి. వెనిజులాలో చావేజ్ వారసుడు మదురో అద్యక్షుడుగా ఎన్నికైనప్పటికీ ఆర్థిక సమస్యలు రాజకీయ కూటములు తీవ్ర పరిస్థితి సృష్టించాయి. బ్రెజిల్‌లో ప్రజాదరణ గల లూలా డిసిల్వా పదవీకాలం ముగిసి వర్కర్స్ పార్టీకి చెందిన దిల్మా రౌసెప్ అద్యక్షురాలయ్యారు. 2104లో రెండవసారి గెలిచారు.ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన మైఖెల్ టర్మర్ మొదటి నుంచి ఆమెను తప్పించడంపైనే దృష్టి పెట్టగా అమెరికా అనుకూల మీడియా వంతపాడింది. ఆమె హయాంలో పొరబాట్లు లేవని కాదు గాని అవి సాంకేతికమైనవని నిపుణులు నిర్ధారిస్తున్నారు. ఈ దర్యాప్తునకు ఆధ్వర్యం వహిస్తున్న రేమన్ కెల్విరోజ్ కూడా ఆ మేరకు అంగీకరించారు. అయినా వాటినే పెద్ద వివాదంగా మార్చి అభిశంసన తతంగం తలపెట్టారు. నిజానికి ఆమెను వ్యతిరేకించే మితవాడ కూటమి నేతలలో 60 శాతం మందిపై రాజకీయ హత్యలతో సహా అనేక ఆరోపణలున్నాయి. చివరకు ఆమెను 180 రోజుల పాటు సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని బ్రెజిల్ పార్లమెంటు తీర్మానించింది. తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన మైఖెల్ టైమర్ పైనా ఎన్నికల సంఘం దర్యాప్తు జరుగుతున్నది. అయినా సరే ే 2019 వరకూ తానే అద్యక్షుడుగా వుంటానని ప్రకటించుకున్నారు! అంటే ఆయన వెనక ఎంతటి బలీయమైన శక్తులున్నాయో తెలుసుకోవచ్చు
ఈ రిజిమ్ చేంజ్ కుట్రలు మిగిలిన లాటిన్ అమెరికా దేశాల్లోనూ సాగుతున్నాయి. వెనిజులాలో మదురో కూల్చివేతకు కూటమి కట్టారు. హౌండురాస్‌లో వామపక్ష అనుకూలమైన మాన్యుయెలా జెలియాను, పరాగ్వేలో ఫెర్నాండో లూగోను పడగొట్టడానికి కుట్రలు సాగాయి. అక్కడ కూడా ఇలాగే మితవాద పార్టీలు కూటమి కట్టడం, మీడియాలో వ్యతిరేక కథనాలఱు గుప్పించడం, అనుకూల కార్మిక సంఘాలతో సమ్మెలు చేయించడం అంతా ఒక పథకం ప్రకారమే నడుస్తుంటుంది. ఒకవైపున క్యూబా సందర్శించి సద్భావన పంచిపెట్టినట్టు కనిపించే అమెరికా అధినేతలు మరోవైపున లాటిన్ అమెరికాను తిరిగి తమ అదుపులోకి తెచ్చుకోవడానికి ఇన్ని పాచికలు వేస్తున్నారన్నమాట. ఇందుకు ఆ దేశాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీల పొరబాట్టు కూడా తోడైన మాట నిజం.ఐఎంఎప్ తాకిడికి మొదటగా బలైనబెజిల్‌లో పత్యామ్నాయ విధానాలు పరిపూర్తిగా అమలు జరపలేకపోవడంతఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇక వెనిజులాకు పెట్రోలియం ధరల పతనం పెద్ద సమస్య తెచ్చిపెట్టింది.
దిల్మా రౌసెప్ కేవల రాజకీయాలతో ముడిపడిన నేత కాదు. సాయుధ పోరాటంలో పాల్గొని రాటుదేలిన నాయకురాలు. అప్పుడు విప్లవ పోరాట క్రమంలో ఆటుపోట్టను తట్టుకున్న తాను ఈ రాజకీయ సవాళ్లకు తలవంచబోనని ఆమె ప్రకటించారు!
