మ్యూనిచ్‌లో అమానుషం, అల్లా స్మరణ?
దక్షిణ జర్మనీలోని
ని మ్యూనిచ్ రైల్వే స్టేషన్‌లో ఒక ఇస్లామిక్ తీవ్రవాది దాడి చేసిన ఘటన జర్మనీని కుదిపేసింది. గతంలో ఫ్రాన్స్,బెల్జియం వంటిచోట్ల జరిగిన ఘటనల వంటివి ఈ దేశంలో జరగలేదు. కాని సిరియా అంతర్యుద్ధం తర్వాత శరణార్థుల రాకకు జర్మనీ ఒక ముఖ్య కేంద్రంగా వుంది. ఇస్లామిక్ స్టేట్ ఐఎస్‌ఐఎస్‌పై దాడికి బాగా సహకరిస్తున్నది. ఈ విధంగా అమెరికా యూరప్ దౌత్య పథకాలకు వెన్నుదన్నుగానూ వుంటుంది గనక అక్కడ భయోత్పాతం సృష్టించాలని భావించివుండొచ్చు. కత్తితో దాడిచేసిన ఫలితంగా ఒకరు మరణించగా 5 గరు గాయపడ్డారని బవేరియా పోలీసులు తెలిపారు. మరణించిన వారి సంఖ్య కంటే ఘటన జరిగిన తీరు ఎక్కువ భయం కలిగించింది. దీని తర్వాత జర్మనీ మరింత కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేస్తుందని భావిస్తున్నారు. ఈ దాడి చేసిన సమయంలో దుండగుడు అల్లా హొ అక్బర్ అని నినాదాలు చేసినట్టు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అతను రాజకీయ ప్రేరేపితమైన నినాదాలు ఇచ్చినట్టు వస్తున్న సమాచారంపై దర్యాప్తు జరిపి నిర్ధారిస్తామని పోలీసులు అధకారికంగా చెబుతున్నారు. బహుశా జర్మన్ పోలీసులు ఈ దేశంలో పరిస్థితులు ప్రభావాల దృష్టితో జాగ్రత్త తీసుకుంటున్నట్టు భావించాల్సి వస్తుంది. (భారత దేశంలోనూ ఇంగ్లీషు పత్రికలు రెండు రకాల శీర్షికలు,కథనాలతో ఈ సమాచారం ప్రచురించాయి. అందుకే ఈ పోస్టును కూడా అప్‌డేట్ చేయడమైంది)