తాజా సర్వే బాబుకు కితాబే కాదు

babu22222
చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పనితీరుపై సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌(సిఎంఎస్‌) నిర్వహించిన సర్వేలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టినట్టు శ్రీరామనవమి రోజు కొన్ని ఛానళ్లు పత్రికలు హౌరెత్తించాయి. దీని గురించి ఎపి సమాచార శాఖ అధికారికంగా ఒక నోట్‌ విడుదల చేసింది. సిఎంఎస్‌ సర్వే తమకు అందుబాటులో లేనట్టుగా ఈనాడు మీడియా సమాచార శాఖ నోట్‌నే వార్త ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. .చంద్రబాబు పనితీరు పట్ల చాలా సంతృప్తిగా వున్నారనీ,ఆయనకు మరో ప్రత్నామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తమైందని ఆ నోట్‌ పేర్కొనట్లు వార్తలో తెలిపారు. ఇక ఆంధ్రజ్యోతి బాబుకు ప్రత్యామ్నాయం లేదు అని సర్వే కథనానికి శీర్షిక నిచ్చింది.తమాషా ఏమంటే సిఎంఎస్‌ వారు విడుదల చేసిన సర్వే సారాంశానికి ‘ప్రజలను ఉత్సాహ పర్చలేకపోతున్న బాబు సర్కార్‌ పథకాలు’ అని శీర్షికనిచ్చింది. అందులో సర్వే గణాంకాలన్నీ మిశ్రమంగానూ లేదా వ్యతిరేకంగానూ వున్నాయి. అయినా సరే మొత్తంపైన బాగా అనుకూలంగా వున్నట్టు చిత్రించేప్రయత్నమే చాలా వరకూ జరిగింది. వాస్తవంగా సర్వే విశేషాలు విశ్లేషణ తెలుసుకోవడానికి సిఎంఎస్‌ చైర్మన్‌ డా.భాస్కరరావుగారిని సంప్రదించాను. వాస్తవానికి తాము రెండేళ్ల కిందట విభజనానంతర ఎన్నికల సమయంలో చంద్రబాబు పాత్ర గురించి మాత్రమే తాము అడిగాము తప్ప ప్రస్తుత కాలానికి సంబంధించి కాదని డా.భాస్కరరావుcms br111 వివరణ ఇచ్చారు. ఆ విధంగా చూస్తే తమ సర్వే విభజననాటి నేపథ్యంలో చంద్రబాబు పాత్రకు సంబందించిందే గాని భవిష్యత్తు అవకాశాల అంచనా కాదని ఆయన స్పష్టం చేశారు. తామిచ్చిన వివరాల ప్రకారం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రజల సమాధానాలను స్పందనను గమనిస్తే రాజకీయ శూన్యత, మిశ్రమ స్పందన వున్నట్టు ఎవరికైనా బోధపడుతుందని వివరించారు. కనుక ఇది తెలుగుదేశంకు అనుకుంటే అది పాక్షికతే అవుతుందని కూడా చెప్పారు.
. ప్రధానంగా రుణమాప,ీ వృద్ధాప్య పెన్షన్ల వంటి పథకాలపై కొంత సంతృప్తి వున్నా బాబు పెంచిన హైప్‌తో పోల్చినప్పుడు ఫలితాలలో బాగా వెనకబడి వుండటం ముందుముందు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించవచ్చుని సర్వేలో విశ్లేషించారు.చంద్రబాబు వాగ్దానాలు పరిపూర్తి అవుతాయనిౖ మెజార్టి ప్రజలు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇక ముందు అమలుపై సానుకూలంగా చూడటమే జరుగుతున్నది. తనది స్వచ్చమైన ప్రభుత్వమని ముఖ్యమంత్రి చెబుతున్నా అవినీతి విషయంలో ఇతర మంత్రివర్గాలకూ దీనికి పెద్ద తేడాలేదనే భావనే బలంగా వుంది.(43శాతం మంది అవినీతి పెరిగిందనిచెబుతుండగా 18 శాతం ఎటూ చెప్పలేమన్నారు. 31 శాతం మాత్రమే తక్కువగా వుందన్నారు) మంత్రుల పని బాగాలేదని కూడ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. యువతలో అసంతృప్తి ఎక్కువగా వుండటం మరింత తీవ్రమైన విషయంగా సిఎంఎస్‌ భావించింది. మళ్లీ విభజన ఉద్యమాలు రావచ్చని 38 శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చడం చిన్నసంఖ్యేమీ కాదు. అన్ని జిల్లాల సమతులాభివృద్ధి విషయంలోనూ 54 శాతం అనుకూలంగా 46 శాతం ప్రతికూలంగా స్పందించడం ముఖ్యమైన పరిణామం. మరోసారి అధికారం చేపట్టాక తెలుగుదేశం రాజకీయంగా మెరుగైంందేమీ లేదని సగానికి పైగా అంచనా వేశారు. 2014తో పోలిస్తే తెలుగుదేశంకు ఓటు వేయాలనుకునేవారి సంఖ్య జిల్లాలను బట్టి ఎంతో కొంత తగ్గినట్టే కనిపిస్తుంది. అమరావతి నిర్మాణం కోసం అంత భారీఎత్తున హడావుడి చేయనవసరం లేదని కూడా సర్వేలో పాల్గొన్న వారిలో అధిక సంఖ్యాకులు చెప్పారు. ఆనాటి పరిస్థితుల్లో చంద్రబాబే మంచి ముఖ్యమంత్రి అని 63 శాతం మంది చెప్పగా ఇప్పుడు మాత్రం అంచనా దాదాపు నిట్టనిలువునా చీలివున్నాయి. మొత్తంపైన 51 శాతం అనుకూలంగానూ 49 శాతం వ్యతిరేకంగానూ వున్నట్టు , 30 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది ప్రతికూలంగా వున్నట్టు ఈ సర్వే తేల్చింది. తెలుగుదేశం పార్టీ మధ్యంతర హెచ్చరికగా తీసుకోవలసిన ఈ సర్వేను సానుకులంగా చూడటం కొన్ని మీడియా ప్రభుత్వ సంస్థలూ అదేచిత్రం ఇవ్వడం అవాస్తవికతే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *