వట్ట్తిగొప్పలు చెప్పుకోకయ

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 18 వేలకు పైగా గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం లేదని వాటిని తక్షణం పూర్తి చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ లెక్క వాస్తవానికి ఇంకా చాలా ఎక్కువగా వుంటుందని అధికారులు నిపుణులు వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మరో అడుగు ముందుకు వెళ్లి గత ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇందులో సగం గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పూర్తి చేశామని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. హిందూ పత్రిక వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రభుత్వ జాబితాలోని 345 గ్రామాలు పరిశీలించింది. అక్కడ ఏ విద్యుత్‌ సరఫరా లేదని తేల్చింది. అంటే వీధి దీపాలు వుండి పదిశాతం ఇళ్లకు కరెంటు వుంటే చాలు గ్రామీణ విద్యుదీకరణ జరిగినట్టేనని అధికారిక నిర్వచనం. ఇదే లోపభూయిష్టమైతే ఈ మేరకు కూడా చేయకుండానే విద్యుదీకరణ విజయాల జాబితా ప్రకటించడం విడ్డూరం కదూ! అది జరిగిన చోట్ల కూడా ఈ సంవత్సరమే జరిగినట్టు చెప్పలేమని 2014 ఎన్నికలకు ముందే ఆ ప్రక్రియ మొదలై వుండొచ్చని కీలmodi2222అధికారులు వ్యాఖ్యానించారు. అత్యున్నతస్థానాల్లోని వారు అతిశయోక్తులు మాని ఆచరణకు ప్రాధాన్యత నిస్తే మంచిది కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *