రామ రామ.. ఉత్తినే అన్నా..

భారత్‌ మాతాకు జై అనని వారి తల తీసేస్తానన్న రామ్‌దేవ్‌ బాబా ఒక్కసాe3b4f141ff3dcf12f23a6db9f1cf354bరిగా వెనక్కు తగ్గారు. ఉత్తినే అన్నా అంటున్నారు. తల తీసినా అనను అని అసదుద్డీన్‌ ఒవైసీ అంటే ఆ ఎమోషన్‌లో తలలు నరికేయాలి అన్నాను గాని అవన్నీ ఉత్తుత్తి మాటలే అని సరిపెట్టేశారు. మౌలికంగా తాను అహింసను సహజీవనాన్ని నమ్ముతానని హింస ద్వేషం అస్సలు సరిపడవని శాంతి వచనాలు ఆలపించారు. నా మతాన్ని చూసి నేను గర్వపడొచ్చుగాని ఉరితీసినా ఖురాన్‌,బైబిల్‌లను గౌరవించబోనని చెబుతానా? అది ఒవైసీ మాటల్లాగే వుంటుంది. .ఎవరైనా జై అంటానంటే అననివ్వండి. దానిమీద ఇలాటి వ్యాఖ్య వచ్చేసరికి భరించలేక పల్లెటూరి బాషలో సమాధానమిచ్చానంతే. ఆ మాటలన్నీ నిజమై పోవు కదా అని తప్పుకున్నారు.
జెఎన్‌యు, శ్రీనగర్‌ ఐఐటి పరిణామాలు దిగజారిన విలువలు విధానాల ఫలితమని వ్యాఖ్యానించారు. పనామా పత్రాలపై అడిగిన ప్రశ్నకు అమితాబ్‌ బచన్‌ మంచివారని కాకపోతే విచారణకు సిద్దపడి పూర్తి విషయాలువెల్లడించాలని ఆయన అన్నారు.ఉత్తరాఖండ్‌ పరిణామాలలో తన హస్తం లేదని తను యోగాలో బిజీగా వున్నానని తప్పుకున్నారు. అవన్నీ మోడీజీ చూసుకుంటారని కూడా ముక్తాయించారు.
మరింత విశేషంగా తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకోసం రామ్‌దేవ్‌ మరో వ్యూహం చేపట్టారని మీడియా నివేదించింది. అందుకే రాబోయే సంవత్సరాలలో నెస్లె కాల్గేట్‌ వంటి విదేశీ బ్రాండ్లను పూర్తిగా పంపించేయాలని ఆయన పిలుపునిచ్చారని చానళ్లు ప్రసారం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *