సందేప్‌ పాండే తొలగింపు ఉత్తర్వు రద్దు

sandeep111
ఐఐటి వారణాసిలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌ బాధ్యతల నుంచి ఆర్‌టిఐ కార్యకర్త ప్రొఫెసర్‌ సందీప్‌ పాండేను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వు చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. ఆయన ఎక్కడో వెబ్‌సైట్‌లో జాతి వ్యతిరేక సమాచారం ఇచ్చారంటూ ఒక విద్యార్థి ఫిర్యాదు చేయడంతో సైబర్‌ నేరం మోపారు. అంతేగాక క్యాంపస్‌లో బిబిసి రూపొందించిన నిర్భయ డాక్యుమెంటరీని ప్రదర్శించడం మరో నేరంగా చూపించి జాతి వ్యతిరేక ముద్ర వేశారు. రెండున్నర ఏళ్లుగా ఆయన కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వుంటున్నారు.ఆర్‌ఎస్‌ఎస్‌కు సన్నిహితుడైన విసి జి.సి.త్రిపాఠీ కేవలం రాజకీయ కారణాలతోనే తనను తొలగించారని ఆయన కోర్టులో కేసు వేశారు. న్యాయమూర్తులు వికెశుక్లా, మహేష్‌ చంద్ర విచారణ అనంతరం ఈ తొలగింపు చెల్లదని తీర్పునిచ్చారు. మామూలుగా కాంట్రాక్టు రద్దుగానో లేక తొలగింపుగానో గాక రాజకీయకారణాల వల్ల తీసుకున్న కక్ష సాధింపు చర్యగా కనిపిస్తున్నదని వారు వ్యాఖ్యానించారు. నిజానికి ఇదే విధమైన విమర్శతో ఆయనను తొలగించవద్దని విశ్వవిద్యాల55555యంలో చాలామంది నిరసన తెల్పినా నిర్వాహకులు పెడచెవిని పెట్టారు. చివరకు ఇప్పుడు న్యాయస్థానంలోనే ఆయన విజయంసాధించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంటు చేయాలని తాను ప్రదర్శనకు నాయకత్వం వహించడం కూడా అధికారులకు నచ్చక కక్షసాధింపునకు పాల్పడ్డారని సందీప్‌ వివరించారు. నిర్భయ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ఏ విధంగా నేరమని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *