కన్నయ్య కుమార్‌పై మరోదాడి, పోలీసుల విచారణ

జెఎన్‌యు విద్యార్థి సంఘ అద్యక్షుడు కన్నయ్య కుమార్‌పై ఆదివారం మరో దాడి జరిగింది. జెట్ ఎయిర్‌వేస్ విమానంలో బిజెపికి గట్టి మద్దతుదారుడైన మానస్ దేఖా అనే వ్యక్తి తనను పిసకడానికి ప్రయత్నించాడని ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీనిపై తాను ఫిర్యాదు చేసినా ఎయిర్‌వేస్ సిబ్బంది పట్టించుకోలేదని వారి దృష్టిలో దాడికి ఘర్షణకు తేడా లేదని ఆయన విమర్శించారు. భావపరమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మీరు అనుసరించే పద్ధతి ఇదేనా అని కూడా కన్నయ్య ప్రశ్నించాడు.
కన్నయ్యపై దాడికి సంబంధించి ముంబాయి విమానాశ్రయంలో ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్నట్టు పోలీసులు మధ్యాహ్నం తర్వాత ప్రకటించారు. అతన్ని విచారిస్తున్నట్టు తెలుస్తున్నది.
అయితే సీట్ల మధ్య స్థలం లేకపోవడం వల్లనే తాను కన్నయ్య కాలుతొక్కాకని మానస్‌దేకా తర్వాత అన్నారు. . మొదట అతని వెంట వున్నవారు గొడవచేస్తే తర్వాత కన్నయ్య కూడా గొంతు కలిపాడని చవకబారు ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తను ఎప్పుడూ ఓటు వేయలేదని, బిజెపికి తనకు సంబంధం లేదని చెప్పారు.పోలీసులు ఆయనను ప్రశ్నించి వదలివేశారు.దీని
పై తానుగా ఫిర్యాదు చేయడానికి కన్నయ్య నిరాకరించారని, ఆయన స్నేహితులు చెప్పింది నిజం కాదని తేలిందని పేర్కొన్నారు. ఇక మహారాష్ట్ర మంత్రి కన్నయ్య తమ రాష్ట్రాన్ని అవమానం పాలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
విమానంలో కన్నయ్యతో పాటు వున్న స్నేహితుడు నిశాంత్ మాట్లాడుతూ చివరి సీటులో కూచున్న వ్యక్తి(మానస్) ఎవరితోనో ఫోనులో మాట్లాడుతున్నాడని అవకాశం రాగానే నేను చూసుకుంటానని చెబుతున్నాడని జరిగిన ఘటనను వివరించారు.అతను ఫోన్ పెట్టేసిన వెంటనే కన్నయ్య నాలుక పట్టుకుని బయిటకు లాగాడని గొంతు పిసికేందుకు ప్రయత్నించాడని తెలిపారు. తాము అతన్ని విడిపించాల్సి వచ్చిందని చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది పరిస్థితిని పట్టించుకోకుండా అతన్ని తమను కూడా ముంబాయిలో దించేశారని తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం వారిద్దరూ కారులో పూనే బయిలుదేరి వెళ్లారు.
కన్నయ్య కుమార్‌పై జాతి వ్యతిరేక ముద్ర వేయడం బిజెపి తప్పిదమనీ దీనివల్ల యువత మద్దతు కోల్పోవలసిన పరిస్థితి వస్తుందని దాని మిత్రపక్షమైన శివసేన నాయకుడు ఉద్భవ ఠాక్రే వ్యాఖ్యానించారు.
కన్నయ్యపై కక్ష కట్టిన సంఘ పరివార్ ఎబివిపి సంస్థలు ఎక్కడికక్కడ ఏవో దాడులకూ పాల్పడుతున్నాయి. హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గోసంరక్షణ సమితి కార్యకర్తలనబడే ఇద్దరు చెప్పు విసిరినినాదాలు చేశారు. విజయవాడలోనూ సభలో నినాదాలిస్తూ భగం చేయడానికి విఫలయత్నం చేశారు.మరోచోట చెప్పువిసిరారు. ఇక ఇప్పుడు అంతిమంగా భౌతికంగానే దాడికి దిగినట్టు కనిపిస్తుంది. వాస్తవానికి ముంబాయి వస్తే మామూలుగా తిరిగివెళ్లలేవని వీర్‌సేన తదితర మతోన్మాద సంస్థలు ముందే బెదిరించడం తెలిసిన విషయమే. అయినా ఆయన ముంబాయి సభ జయప్రదంగా జరగడమే గాక చాలామంది ప్రముఖులు హాజరైనారు.