అమెరికన్ల అపహాస్యాలు- మన అభ్యర్థనలు

trump2222
రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖాయమైన ట్రంప్‌ దుర్భాషలు దురుసు మాటలు రోత పుట్టిస్తున్నాయి. అయితే అదే విజయవంతమైన వ్యూహమని ఆయన అనుకోవడం అమెరికా సమాజ స్వరూపానికి నిదర్శనం. ప్రచారంలో ఇమేజి మార్చుకుంటారని కూడా ఆయన ప్రచారకులు చెబుతున్నారు. ఈ తరహాలోనే ఆయన తాజాగా భారతీయులు ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడలేరన్నట్టు గేళి చేశారు. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు ఇతరులు తన్నుకుపోతున్నారనేది ఆయన ప్రచారంలో ఒక ముఖ్యభాగం. కాల్‌సెంటర్‌కు తాను ఫోన్‌ చేస్తే అవతలి వారి గొంతు వినగానే తనకు భారతీయులని తెలిసిపోతుందని ఆయన అపహాస్యం చేశారు. ఐయామ్‌ ఫ్రం ఇండియా అని ఇలా అంటారు అంటూ అనుకరించగా అక్కడ సమూహం కేరింతలు కొట్టారు. అయితే ఆ వెంటనే మళ్లీ ఇండియా చైనా వియత్నాం ఇవన్నీ గొప్పదేశాలేనని ముక్తాయించడం విడ్డూరం.ఇదే trump1111సమయంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజృంభణకు అడ్డుకట్టవేయకపోతే మనకు నష్టమని అమెరికా సెనేట్‌లో అధికారికంగా చర్చ జరిగింది.
మరో విశేషమేమంటే ట్రంప్‌ అలా అంటున్న తరుణంలోనే మన దేశం నుంచి వెళ్లిన నీటి ఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమితవ్‌ కాంత్‌ అమెరికా సర్వీసు రంగంలో భారతీయులకు అధికతర అవకాశాలు కల్పించాలని అభ్యర్థిస్తున్నారుష ఒక వాణిజ్య సమావేశంలో మాట్లాడుతూ అమితవ్‌ మేము అన్ని రంగాల్లో అమెరికన్లకు తలుపులు తెరిచాము. రైల్వేల్లో జిఇకి భారీ కాంట్రాక్టు ఇచ్చాము. అమెరికన్‌ టవర్‌ సెంటర్లు దాదాపు అరవై వేల వరకూ ఏర్పాటు చేశారు. అసలు మీరు తెలుపులు తెరవని రంగమే లేదు.మరి మాకు కూడా ఛాన్సివ్వాలి కదా అన్నట్టు మాట్లాడారు. అయితే ఇదే సభలో మాట్లాడిన భారత్‌లో అమెరికా రాయబారి ఇరు దేశాల వాణిజ్యం పెరుగుతున్నదని లెక్కలు చెప్పారు.అమెరికాలో భారతీయ వ్యాపారుల పెట్టుబడులు పెరుగుతున్నాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *