మహిళలపై ఐఎస్‌ఐఎస్ రాక్షసాలు

ఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకునే ఐఎస్‌ఐఎస్ 250 మంది మహిళలను కాల్చిచంపడం దాని రాక్షస స్వభావాన్ని చెబుతుంది. ఇరాక్‌లోని మసల్ పట్టణం 2014 నుంచి ఐఎస్ అధీనంలో వుంది. అక్కడ బందీలుగా పట్టుకున్న 250 మంది మహిళలను బానిసలుగా చేసుకోవడమే గాక తమ అత్యాచారాలకు ఒప్పుకోవలసిందిగా బలవంతపెట్టారు. కొంతమందిని అలా బలిచేశారు కూడా. నిరాకరించిన వారిని చాలా కాలంగా వేధిస్తూ వస్తున్నారు. తాత్కాలిక వివాహంగానే దీన్ని పరిగణించాలని, బానిసలుగా అది మీ బాధ్యత అని మహిళలను హింసించారు. ఇందుకు ఏదో మత ధర్మాలను సాకుగా చూపే ఫత్వాలు కూడా రూపొందించినట్టు అమెరికాకు పట్టుబడిన పత్రాలలో వుందని చెబుతున్నారు. మత చాందసులు, జాత్యహంకారులు ఎప్పుడైనా మహిళలను మనుషులుగా చూడరు. హిట్లర్ కూడా బందీలైన మహిళలను
లైంగిక బానిసలుగా ఉపయోగించే వారని చరిత్ర చెబుతున్నది.కరుడుగట్టిన మతోన్మాద సైనిక శక్తి ఐఎస్‌ఐఎస్ ఇలాటి కిరాతకాలకు పాల్పడ్డంలో ఇలాటి దారుణమే.బాలికల దురవస్థ మరింత ఘోరం. ఇస్లామిక్ దేశాలలోనూ బహుభార్యత్వంతో పాటు మహిళల అసమానత్వం అధికారికమే. ఇటీవల గాని కొన్నిదేశాలలో ఓటు హక్కు ఇవ్వలేదు. ఆ రాచరిక ప్రభువులు అండదండలతోనే ఐఎస్ మనుగడ సాగిస్తున్నదని గతంలో వివరంగా చెప్పుకున్నాము. సిరియా ఇరాక్‌లలో సాధారణ పరిస్థితుల పునరుద్దరణకు ప్రపంచ దేశాలు చొరవ చూపిస్తేగాని ఈ అమానుసాలు అంతం కావు. సిరియాలో పట్టు పెంచుకోవాలని అమెరికా కూటమి సౌదీ వంటి దేశాలు పాచికలు వేస్తున్నంత వరకూ ఈ పరిస్థితి మారదు.