వైద్య వ్యాపారం హద్దు మిరితే..?

doctor-steth.jpg.image.784.410
తన భార్యకు స్వల్ప చికిత్స చేసి నలభై వేలు బిల్లు కట్టి కదలాలని నిర్బంధించారని రాజ్యసభ సభ్యుడు ఎంకెఖాన్‌ ఆస్ప్రతిపై ఫిర్యాదు చేశారు. తనపరిస్థితే ఇలా వుంటే సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించారు. దీనికన్నా ముందు మరో ఘటన కుదిపేసింది. 5.7 ఎత్తున్న నిఖిల్‌ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు కాళ్లు కట్‌ చేసి ఆ మధ్యలో కణజాలం పెరిగేలా చేసి ఆరడగులకు చేరుకోవడానికి అమ్మ నాన్నలకు తెలియకుండా గ్లోబల్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించుకున్నాడు. దీనిపై దుమారం రేగిన తర్వాత వారి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని, ఇది నైతికతకు ఉద్వేగానికి సంబంధించిన అంశంగా చూడొద్దని సదరు ఆస్పత్రి బాధ్యులు వాదించారు. వారి వివరణ కూడా ఒకో పత్రికలో ఒక విధంగా వచ్చింది. ఒక పెద్ద పత్రిక పనిగట్టుకుని అతి జాగ్రత్తగా ప్రచురిస్తే తాము ఆరునెలలుగా వారిస్తున్నా ఆ అబ్బాయి విననందుకే ఆపరేషన్‌కు ఒప్పుకున్నా03TH_DOCTOR_672768fమని వారు చెప్పినట్టు మరో పత్రిక రాసింది. దీని గురించి నేను చెప్పినప్పుడు మరో రంగంలో సూపర్‌ సీనియర్‌ స్పెషలిస్టు ఇలాటిది చేస్తారని తానెప్పుడూ వినలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు! ఇక మామూలు వారి సంగతి ఏం చెప్పగలం? ఇదే గాక మరో వార్త అవసరంలేకున్నా అందరికీ సిజేరియన్లు చేసి కడుపుకోసి పిల్లలను తీస్తున్నారని లెక్కలతో సహా వచ్చింది. ఇంతకంటే ఘోరమైన మరో కథనం- తెలంగాణ గిరిజన తండాలలో అందంగా దృఢంగా వున్న అమ్మాయిలనుంచి అండాలను సేకరించి పెట్టుకోవడం. దీనివల్ల వారిపై పడే దుష్ప్రభావాల గురించి అస్సలు చెప్పకపోవడం. చాలా కాలం కిందట మూత్ర పిండాలను ఏ విధంగా టోకున కొనేవారే అదే రీతిలో ఇప్పుడు అండం విడుదలయ్యేప్పుడే సేకరించడం కోసం కొన్ని కృత్రిమ పద్ధతులను కూడా అనుసరించడం వారికి తీవ్రమైన వ్యాధులు తెచ్చిపెడుతుందని ప్రముఖ గైనకాలజిస్టు మాతో పాటు ఒక చర్చలో చెప్పారు. ఇవన్నీ వింటుంటే వైద్య వ్యాపారం మరీ ఇంత ఘోరమా అనిపించదూ? ప్రభుత్వాసుపత్రులను గాలికి వదిలిఏసిన తర్వాత ఇలా గాక మరేలం జరుగుతుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *