గౌరవహత్య …దళిత కుటుంబం పోరాటం

tirupur_2773970f
గౌరవ హత్యలపేరుతో ప్రేమించి పెళ్లాడిన వారిని హత్యలు చేసే అమానుష కాండ మానవత్వానికే కళంకం. తమిళంలో ప్రేమ కథల సినిమాలు చాలా వచ్చాయి గాని సమా జంలో మాత్రం వివక్షతలు సమసిపోలేదు. కింది కులాల చైతన్యం సామాజిక పోరాటాలు తీవ్రంగానే సాగుతున్నా కరుడుగట్టిన దురహంకారులుమారడం లేదు. ఇలాటి వారికి చెంపపెట్టులాటి ఘటన తిరుపూర్‌ జిల్లా ఉడుమల్‌పేటలో జరిగింది. వి.శంకర్‌, కౌసల్య అనే ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఫైనల్‌ ఇయర్‌లో వున్న శంకర్‌ చదువుకోసం మొదటి ఏడాదిలో వున్న కౌసల్య చదువు మానేసి ఏదో చిన్న ఉద్యోగంలోచేరింది కూడా. అయితే దళితుడైన శంకర్‌ను అగ్రవర్ణాలకు చెందిన తDalit_murder_prote_2774404gమ అమ్మాయి పెళ్లిచేసుకోవడాన్ని సహించలేని కుటుంబసభ్యులు వెంటాడి వేధించారు.ఆదివారం నాడు వారిద్దరూ షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా దారి గాచి గాక అందరూ చూస్తుండగానే దాడి చేశారు. శంకర్‌ చనిపోగా కౌసల్య తీవ్రంగా గాయపడింది. దాడికి కారకులైన వారిని అరెస్టు చేస్తే తప్ప తాము శవాన్ని తీసుకోబోమని శంకర్‌ కుటుంబసభ్యులు బంధువులు ఆందోళనకు ఉపక్రమించడం పెద్ద సంచలనమైంది. కౌసల్య చికిత్స పొందుతున్న కొయంబత్తూరు ఆస్పత్రి ముందు బంధువులు, కుల వివక్ష వ్యతిరేక సంఘాలు, రాజకీయ పార్టీలు ధర్నాకు దిగాయి. పోలీసులు ు ఎంతగా చెప్పినా గాయపడిన ఆ తలిదండ్రులు వినలేదు. చివరకు మొదట ఇద్దరు నిందితులు లొంగిపోయారు. ఇక సోమవారం నాడు కౌసల్యతండ్రి కూడా పోలీసులకు లొంగిపోయాడంటున్నారు. పది లక్షల పరిహారం, కౌసల్యకు ఉద్యోగం ఇవ్వాలంటూ దళితులు ఆ ప్రాంతంలో రాస్తోరోకో చేశారు.ఈ ఘటన మొత్తంపైన చాలా సంచలనం కలిగించింది. దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని అందరూ హర్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *