‘మహా’ ఒప్పందం నిజాలేమిటి?

మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందంపై ౖ విమర్శలను పనికిమాలినవని తెలంగాణ నీట ిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కొట్టి పారేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా సమైక్య రాష్ట్రంలో నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని మరోసారి చెప్పారు. సరే అది ముగిసిన అధ్యాయం. వాస్తవంగా ఇప్పుడు కుదిరింది ఒక ి నిర్దిష్ట ఒప్పందం కాదు, అన్నిటి గురించి చర్చించేందుకు ఇరు రాష్ట్రాలు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్న అవగాహన మాత్రమే. మళ్లీ ఒకో బ్యారేజీపై ఆమూలాగ్రం చర్చ జరగవలసే వుంటుంది. బ్యారేజీ ఎత్తు తగ్గింపు, రీ డిజైనింగు వల్ల వ్యయం పెరుగుదల, చేసిన ఖర్చును సద్వినియోగం చేసుకోవడం వంటి చాలా సమస్యలు ఇందులో వున్నాయనేది నిర్వివాదాంశం. అయితే మహారాష్ట్ర ఇంతకన్నా మరో అడుగు ముందుకేసి ఒప్పందమే జరగలేదంటున్నది. ఆ రాష్ట్ర నీటిపారుదల ామంత్రి గిరీశ్ మహాజన్ దైనిక్ భాస్కర్ పత్రికతో మాట్లాడుతూ ప్రధాని సించారు పరియోజన పథకం కింద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్ దేవేంద్ర ఫడ్నవీస్‌లు చర్చించారని వివరించారు. అంతర్‌రాష్ట్ర మండలి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించామనీ మళ్లీ దీనిపై భేటీ కావలసి వుందని చెప్పారు. జలవనరుల కోసం తెలంగాణ ముందు ఆంధ్ర ప్రదేశ్‌తో అవగాహనకు రావడం అవసరమని కూడా గిరీశ్ నొేక్కి చెప్పారు. మహారాష్ట్ర గవర్నర్‌గా వున్న బిజెపి నేత సిహెచ్‌విద్యాసాగర రావును. మేడిగడ్డ రిజర్వాయర్ శంకుస్తాపనకు ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం భావించడంపై ఆ ప్రభుత్వం ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నది. విద్యాసాగర్‌కు తద్వారా తమకు మరింత ఘనత ఇవ్వాలని బిజెపి నేతలు చర్చల్లో చెబితే ఇది రాష్ట్రాల మధ్య వివాదాన్నిరాజ్యాంగసమస్యలను పెంచుతుందని నేనొక చర్చలో చెప్పాను. లేనిపోని ప్రచారాలతో సమస్యలు కొని తెచ్చుకోవడం అనవసరమని అధినేతలు అర్థం చేసుకోవాలి మరి.