జెఎన్‌యు అప్‌డేట్‌….

  • march_2742685f
    . జెఎన్‌యు విద్యార్థి సంఘ అద్యక్షుడు కన్నయ్య కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిల్లీ హైకోర్టుకు బదలాయించింది. తను నేరుగా స్వీకరిస్తే కింది కోర్టులు సమస్యలను పరిష్కరించలేవన్న భావన కలిగించినట్టవుతుందని న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ బెయిల్‌ దరఖాస్తును త్వరితంగా చేపట్టవలసిందిగా సూచించారు.గతంలో తీవ్ర దాడి జరిగిన పాటియాల కోర్టుకు హైకోర్టు దగ్గరగా వుంటుంది గనక భద్రత రీత్యా తాము ఇక్కడకు వచ్చామని కుమార్‌ తరపున హాజరైన సోలీసొరబ్జీ చెప్పగా తగు భద్రత ఏర్పాటుచేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు. వారి వాదనలో వాస్తవం వుందని కూడా అంగీకరించారు.
  • ఈ సందర్భంగా ఆరెస్సెస్‌ పాత్రపై వాది తరపు న్యాయవాదులు చేసిన ఆరోపణలకు తాను గాయపడ్డానని ప్రతివాద న్యాయవాది చెప్పగా కోర్టు పెద్దగా పట్టించుకోలేదు. ఆ వ్యాఖ్యలను తొలగించాలన్న ఆయన అభ్యర్థనను ఆమోదించలేదు.
  • స్థానిక శాసనసభ్యుడు(బిజెపి నేత ఓవిశర్మ) ఈదాడి కేసులో అరెస్టయ్యారు. నిజంగా ఇది తీవ్రమైన సందర్భమే అని న్యాయమూర్తి అన్నారు. ఎవరేమిటనేది కాదు, మాకు భద్రతా ఏర్పాట్లు ముఖ్యం అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
  • మరో వంక మొన్న దాడికి ఆధ్వర్యం వహించిన న్యాయవాది విక్రమ్‌ సింగ్‌ చౌహాన్‌ను కొందరు సత్కరించిన కథనాలు సంచలనం సృష్టించాయి. అయితే అది సన్మానం కాదని వారు చెబుతున్నా ఆయన మెడలో పూలమాలతో వున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో సంచరిస్తున్నాయి.
  • ఈ కుహనా దేశభక్తి కన్నా దేశద్రోహి అనిపించుకోవడానికే తాను సిద్ధమవుతానని ప్రముఖ మీడియా ప్రముఖుడు రాజ్‌దీప్‌ సర్దేశాయి ఒక వ్యాసం రాశారు.
  • కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కూడా కన్వయ్య కుమార్‌ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
    గురువారం నాడు జెఎన్‌యు విద్యార్థుల ర్యాలీ ఒక మహా ప్రజా ప్రదర్శనగా మారింది. ఈ కేసు విషయంలో మోడీ ప్రభుత్వం సమస్యలు తీవ్రం చేసిందనే భావన బిజెపి వర్గాలలోనూ వ్యక్తమైంది.
  • .. ఈ ఘటనపై అంతర్జాతీయంగానూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. లండన్‌లోని ప్రపంచ ప్రసిద్ధమైన పలు దక్షిణాసియా సంస్థలు జెఎన్‌యు పరినామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ భావ ప్రకటనా స్వేచ్చ కాపాడుకోవాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *