బెడిసికొట్టిన జెఎన్‌యు కు’తంత్రం’

  • బెడిసికొట్టిన జెఎన్‌యు కు’తంత్రం’
  • జెఎన్‌యు విద్యార్థినేతలపై వేట, అరెస్టులు దేశ ద్రోహ ప్రచారాల గురించి చాలా చెప్పుకున్నాం. వరుసగా బెడిసికొడుతున్న పరివార్‌ పాచికల గురించి సూటిగా సూక్ష్మంగా
  • తమ నాయకుల పోకడలు భరించలేక ఎబివిపికి ముగ్గురు ప్రతినిధులు రాజీనామా చేయడంkanhayya111
  • విశ్వ విద్యాలయాల్లో విద్వేషం నింపింది చాలక న్యాయాలయాల్లోనూ దౌర్జన్యశక్తుల విలయతాండవం
  • తన ప్రసంగంతో దేశాన్ని ముగ్ధులను చేసిన కన్నయ్యకుమార్‌పై న్యాయదేవత సాక్షిగా దాడి
  • ఆర్థిక మంత్రి సీనియర్‌ నేత అరుణ్‌జైట్టీ కూడా ఖండించక తప్పని స్థితి
  • దాడి జరగలేదని పక్షపాత ప్రకటన చేసిన ఢిల్లీ పోలీసు కమిషనర్‌ బస్సీ. తాము సురక్షితంగా అప్పగించాము గనక బాధ్యత లేదన్న వ్యాఖ్య. (పదవి మారే ప్రయత్నంలో బస్సీ)
  • హౌదగ్రమైన అత్యున్నత న్యాయస్థానం
  • అసందర్భంగా వందేమాతరం పాడి దేశభక్తి ప్రదర్శన చేసిన ప్రబుద్దులకు న్యాయమూర్తుల మందలింపు, పేరు వివరాల నమోదు
  • కన్నయ్యకు మద్దతుగా (ఒకప్పట)ి బీహార్‌ బిజెపి తార ఎంపి శతృఘ్నసిన్హా
  • నోబుల్‌ గ్రహీతలు అమర్త్యసేన్‌తో సహా 300 మంది ప్రపంచ స్థాయి మేధావులు అధ్యాపకుల మద్దతు
  • కన్నయ్య దేశవ్యతిరేక నినాదాలు చేసినట్టు ఆధారాలు లేవని పోలీసుల నివేదిక
  • రాష్ట్రపతికి నేతల ఫిర్యాదు
  • నిరసన ప్రదర్శన రద్దు చేసుకోవాలని విద్యార్థులకు వైస్‌ ఛాన్సలర్‌ విజ్ఞప్తులు
  • నైతిక బలంపెరిగిన జెఎన్‌యు విద్యార్థులు
  • మా కుమారుడు క్షేమంగా నిర్దోషిగా బయిటపడతాడన్న కన్నయ్య తలిదండ్రులు
  • విద్యార్థులకు హెచ్చరికలు చేస్తూనే తప్పుచేసిన తమవారిపై చర్య తీసుకుంటామన్న ఢిల్లీ బార్‌కౌన్సిల్‌ అద్యక్షుడు
  • మొత్తంపైన నైతికంగా రాజకీయంగా జెఎన్‌యు విద్యార్థులు మరింత నిలదొక్కుకోగా ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణ స్థితిలో పడిపోయిన తీరుకు ఇవన్నీ నిదర్శనాలు.
  • హెచ్‌సియు టు జెఎన్‌యు వ్యూహాన్ని ఇకనైనా విరమిస్తారేమో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *