కుమ్ముడు టీజర్‌కు మెగా సమర్థన- అవసరమా అద్యక్షా
?
ఖైదీ 150 చిత్ర వేడుకలకు ఆటంకాలు వివాదాలపై గతంలోనే వ్యాఖ్యానించాను. నేను సూటిగా రాయలేదని ఆయన వీరాభిమానులు కొందరు విమర్శించారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారులు తిప్పించుకున్నారంటూనే రాజకీయ కారణాలేమీ వుండకపోవచ్చని కొట్టిపారేశారు. ఇది వూహించబట్టే నేనూ కొంతవరకూ చెప్పి వదిలేశాను.
ఇకపోతే అమ్ముడూ లెట్స్ డూ కుమ్ముడు వంటి చరణాన్ని టీజర్‌గా తీసుకోవడంపై ఈ సైట్లోనూ , ఛానళ్లలోనూ కూడా నేను విమర్శించాను. అంత ప్రసిద్ధ హీరో తన పునరాగమనచిత్ర ప్రచారానికి ఈ తరహా పాటను తీసుకోవడం ఎందుకుని నా ప్రశ్న. కుమ్ముడు అనే పదానికి అనేక అర్థాలున్నాయని తెలియకకాదు. చిరు తన ఇంటర్వ్యూలో వాటన్నిటినీ వివరిస్తూనే అభిమానుల కోసం మసాలాలు తప్పుకాదన్నట్టు మాట్లాడారు. దాన్నే కొంతమంది వీరాభిమానులు ఫేస్బుక్లో పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు గాని ఆయన కొంత సర్దుబాటుకు ప్రయత్నించారే గాని ఏకపక్షంగా ఖండించలేదు.. పైగా ఇలాటివి వచ్చే చిత్రం విలువ పెంచవు కూడా. నిజానికి దీని మూలచిత్రం తమిళ కత్తి రైతుల సమస్యలకు భూ నిర్వాసితులకు సంబంధించింది. కాబట్టి కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి, యమహా నగరి వంటి పాట ఎంచుకుని వుంటే బావుండేది.
చిరు ఈ దశలన్నీ ఎప్పుడో దాటేశారనేది నా పాయింటు రాజకీయాల్లోలాగే సినిమాల విషయంలోనూ అభద్రత అవిశ్వాసం అవసరం లేదాయనకు. ఎవరికెన్ని తేడాలున్నా తప్పక ఆదరిస్తారు.