తండ్రులూ కొడుకుల తగాదాలు

ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్‌ యాదవ్‌కూ అఖిలేష్‌ యాదవ్‌కూ మధ్య తగాదా ఏమంత వింత కాదు. కుటుంబ రాజకీయాల సమస్య ఒకటైతే తండ్రులు ఎంతకూ అధికారాన్ని వదలకపోవడం కూడా ఒక సమస్యే. తమిళనాడులో స్టాలిన్‌ను డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంటుగా చేయడంలోనూ ఇది కనిపిస్తుంది. మేము చూస్తున్నప్పటినుంచి స్టాలిన్‌ సారథ్యం అంటూ వింటూనే వున్నాం గాని జరిగింది లేదు.ఇప్పుడాయన వయస్సు 63. అంటే ఇప్పటికి 90 దాటిపోయినా ఎన్నిసార్లు ఐసియులోకి వెళ్లివచ్చినా కరుణానిధి పూర్తిగా అధికారం అప్పగించడానికి సిద్దంగా లేరన్నమాట. తన బహు భార్యత్వం బహు సంతానం కారణంగా తేల్చుకోలేని అవస్థ ఆయనది. ఇక ఇప్పుడు జయలలిత మరణానంతరమైనా స్టాలిన్‌ను ముందకు తేకపోతే కుదరని స్థితిలోనే వొప్పుకున్నారు. లేదంటే ఎలాగూ తిరుగుబాటు వచ్చేది. ప్రస్తుత తమిళరాజకీయాల్లో స్టాలిన్‌కు అనుకూలత వుండొచ్చు. అన్నా డిఎంకెతో సీట్ట తేదా తక్కువే గనక కొత్ktr-lokshmuly-akhత పరిణామాలూ కూడా చూడొచ్చు. గతంలోనూ ఎంజిఆర్‌ చనిపోయాకే కరుణ శకం పునరుద్ధరణ జరిగింది.
ముఖ్యమంత్రిగా వున్న అఖిలేష్‌కే అత్యధిక మద ్దతు రావడం సహజం. గతంలో చరణ్‌సింగ్‌కూ అజిత్‌ సింగ్‌కూ మధ్యనా ఇలాటి తగాడానే నడిచింది.జమ్మూ కాశ్మీర్‌లో ఒమర్‌ అబ్దుల్లా పాలిస్తుంటే ఫరూక్‌ ఢిల్లీలో చేసే వ్యాఖ్యలు చిక్కులు తెచ్చిన సందర్భాలున్నాయి. పిడిపిలోనూ మఫ్తీ మహ్మద్‌ సయిద్‌కూ మెహబూబాకు అలాటి తేడాలుండేవి. ఆమె అప్పుడప్పుడు అలిగేవారు..వారసత్వ రాజకీయాలకు నిలయమైన ఇందిరాగాంధీ కుటుంబంలోనూ ఒకప్పుడు సంజరు తర్వాత రాజీవ్‌ గాంధీలు అన్ని విషయాల్లో అమ్మతో ఏకీభవించిన వారు కాదు. ఇప్పుడు రాహుల్‌ కూడా అమ్మ మీద అలిగి సెెలవుపై వెళ్లడం చూశాం. ఎన్గీఆర్‌పై తిరుగుబాటు చేసింది చంద్రబాబే కాదు- కుమారులు కుమార్తెలు కూడానని గుర్తుంచుకోవాలి. బహుశా ఇప్పడు లోకేశ్‌కూ కెటిఆర్‌కూ కూడా అలాటి సమస్యలు లేవని చెప్పడం కష్టం. వారి విభేదాలు సర్దుబాట్టు ఏమనేది ఒకటైతే ప్రజల కోణం ప్రజాస్వామ్య విలువలు అంతకంటే ముఖ్యం మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *