ఆ భూమే చంద్రబాబు పెట్టుబడి..

అమరావతిలోనే గాక ఇతర చోట్ల కూడా భారీ ఎత్తున భూ సమీకరణ జరిపించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీర్ఘకాలిక వ్యూహంతోనే వ్యవహరించారనేది బిజెపి వర్గాల అంచనాగా వుంది. గతంలో ఎమ్మార్‌ ఎంజిఎప్‌ నమూనానే అనుసరిస్తున్నారని కూడా ఆ పార్టీ నాయకులొకరు వివరించారు. వాటిపై ఎన్ని వివాదాలు నడిచినా ఖరీదైన ఫ్లాట్ల అమ్మకం వసూళ్లు జరిగేపోయాయి. ఆ సమస్య కూడా లేకుండా ఇప్పుడు అమరావతిలో రైతులను భాగసస్వాములుగా చేస్తూనే వారి భూమి ప్రభుత్వం హస్తగతం చేసుకుంంది. దాన్ని ముఖ్యమంత్రి కోరుకున్నవారికి ధారాళంగా బడలాయించగలుగుతున్నారు. ఏ నిధులు రాకపోయినా తనకు సంబంధించిన వారితోనైనా డెవలప్‌చేయించగలరు. అందుకోసమే ఇప్పుడు దుబాయి కూడా పర్యటిస్తున్నారు. అక్కడ షేక్‌లకు ఇది పెద్ద పెట్టుబడి కింద లెక్కకాదు. వారిని ముందు పెట్టుకుని సబ్‌లీజుల ద్వారా కథ నడిచిపోతుంది. ఇప్పుడు నోట్లరద్దు ఇతర ఒడుదుడుకులు వున్నాయి గనక అలాటి ఒక ఆసామిని పట్టుకొచ్చి కదలిక చూపిస్తారని ఆ నాయకుడు చెప్పారు. వేల ఎకరాల భూమి వుంది గనక బేరసారాలు కూడా తేలికవుతాయి. ఎమ్మార్‌ ఎంజిఎఫ్‌ అనుభవం రీత్యా ఇప్పుడు కంపెనీలు నేరుగా తమ వ్యాపార ప్రయోజనాలు గోల్ఫ్‌ కోర్సుల వంటివాటికి వెళ్లకుండా ముందు ఏ విద్యాలయమో కట్టిస్తాయి. అది కూడా ఖరీదైందిగా వుంటుంది. అలాగే ఆస్పత్రులకు ఇస్తారు. అందులో చాలా భాగం అవి వాణిజ్య ప్రయోజనాలకే వాడుకుంటాయి. ప్రభుత్వం అమరావతిలో ఇంత భారీ ఎత్తున ఇస్తున్నప్పుడు విజయవాడ గుంటూరు వంటి చోట్ల రియాల్టి దెబ్బతినడం నష్టదాయకమని కూడా బిజెపి నేత వ్యాఖ్యానించారు. కాని చంద్రబాబు ఎంచుకున్న నమూనా వల్ల అది అనివార్యమవుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *