రజనీకాంత్‌ – అప్‌డేటింగ్‌

teaser-rajinikanth-124-1419362190-k-balachander-kamal-haasan-rajinikanth
రజనీ కాంత్‌! ఆ పేరు వినగానే సినీ ప్రేక్షకులకు ఎక్కడ లేని హు’ారు.ఆయన పుట్టిన రోజుకు ప్రధాని మోడీ,మిలీనియం హీరో బచన్తో సహా శుభాకాంక్షలు పంపించారు రజనీ కాంత్‌ భాషా తీతం, భావాతీతం కూడా. ఏమంత అందగాడు కాదు. మొదట్లో పెద్ద అందంగా కనిపించాలనీ అనుకోలేదు. దిలీప్‌ కుమార్‌ అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్‌ శివాజీ గణేషన్‌లలా మహత్తర నటన ప్రదర్శించిన దాఖలాలూ లేవు. ధరించిన పాత్రలూ పెద్ద ఉదాత్త గంభీరమైనవి కావు. అయినా రజనీ కాంత్‌తో ప్రేక్షక జన బాహుళ్యం మమేకమైన తీరు వెనక చాలా కారణాలున్నాయి. కేవలం సినిమా రంగానికే గాక సామాజిక రంగానికి కూడా సంబంధించిన నేపథ్యముంది. ే 1975లో అపూర్వ రాగంగళ్‌( తెలుగులో తూర్పు పడమర) తో మొదలు పెటిy 2016లో కబాలి వరకూ సాగిన ఈ గాధలో రజనీ పాత్రలు మాత్రమే కాక పాత్రధారి కూడా మారిపోవడం విశేషం.
తొలి తమిళ సూపర్‌ సాyర్‌ భాగవతార్‌ శతజయంతి కూడా ఎప్పుడో ముగిసిపోయింది. అంటే ఆ సినిమా అంత పాతది. తమిళంలో( తెలుగులో కూడా) కథానాయకుల పాత్రలు అనగానే సకల సద్గుణ సంపన్నమైనవిగా వుండే రోజులవి. మరీ ఎంజిరామచంద్రన్‌ అయితే తన పాత్రలను కూడా వ్యక్తిగత ఇమేజికి అనుగుణంగా మలుచుకున్నాడు. ఆ పాత్రలెప్పుడూ తప్పు చేయవు.అమ్మకు సేవ చేయడం, పేదలను ఆదుకోవడం విలన్లను కొటyడం ఇదే ఫార్ములా. ఎంజిఆర్‌ సినిమాల్లో కూడా ఎప్పుడూ మద్యపానం చేయడు సరికదా సిగరెట్‌ కూడా అంటుకోడు. అమ్మాయిలు ఆయన వెనక బడి పాటలు పాడటం కలలు కనడం తప్ప ఆయన మాత్రం చేయడు. తెర బయిట కూడా ఎప్పుడూ కళ్లజోడు లేకుండా కనిపించడు. ఎంఎస్‌ఎస్‌ పాండ్యన్‌ అనే రచయిత తమిళ సూపర్‌ సాyర్‌ పాత్రల గురించి సవివరమైన పరిశీలన ప్రకటించాడు.అందులోనూ ఎంజిఆర్‌ రజనీ కాంత్‌ల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేశాడు.ఎంజిఆర్‌ రాబిన్‌:హుడ్‌ తరహాలో మధురై వీరన్‌ వంటి పాత్రలు ధరించాడు.ఇందులో ప్రతినాయక లక్షణాలున్నా పేదల తరపున నిలబడటమే చూస్తాం.ద్రవిడ వుద్యమం ఉచ్చస్తితిలో వుండటం వల్ల ఎంజిఆర్‌కు ఆ పాత్రలు బాగా చెల్లాయి. ఉత్తరోత్తరా ఆయనను రాజకీయంగానూ తిరుగులేనినాయకుణ్ని చేశాయి.( వాస్తవంలో రాజకీయంగానూ ఎంజిఆర్‌ సాహసంతో వ్యవహరించింది శూన్యం) రజనీ కాంత్‌ కాలానికి ఆ పరిస్తితులు లేవు.సమాజమూ రాజకీయాలూ కూడా మారాయి. తమిళ తెలుగు సినీ రంగాలలో శూన్యం ఏర్పడింది. హిందీలో అమితాబ్‌ బచన్‌ యాంగ్రీయంగ్‌మాన్‌గా ప్రతినాయక లక్షణాలు గల నాయకుడు(యాంటీ హోరో) గా అద్భుతంగా రాణించడం మొదలైంది.సలీమ్‌ జావేrajinikanth-storyfb_647_041216021759ద్‌లు హాలివుడ్‌ నుంచి (అనువ)దించిన స్క్రిపుyలు అందుకు గొప్పగా ఉపయోగపడ్డాయి.తెలుగులోనూ వాటినే ఎనీyఆర్‌ వంటివారు ధరించి విజయాలుjay-rjni సాధించారు. కె.విశ్వనాథ్‌,రాఘవేంద్రరావు, దాసరి వంటి వారు ఆ తరుణంలోనే కొంత కొత్త దనం చూపించి తమ తమ తరహాల్లో వాణిజ్య పార్ములాలు తయారు చేసుకున్నారు. తమిళంలో మాత్రం బాల చందర్‌తో మొదలై తర్వాత వరుసగా భారతీ రాజా భాగ్యరాజా,బాలూ మహేంద్ర వంటి వారు ప్రయోగాత్మకమైన కొత్త చిత్రాలతో విజయాలు సాధించడమే కాక వరవడి మార్చారు. కమల్‌హాసన్‌, రజనీ కాంత్‌లు ఆ సమయంలో హీరోలుగా రావడం తమిళ దర్శకులలో వచ్చిన ఈ మార్పును వేగవంతం చేసింది.
రంగస్థలం నుంచి వచ్చిన బాలచందర్‌ కాస్త సంచలనాత్మకమైన వివాదాస్పదమైన ఇతివృత్తాలతో విడ్డూరమైన పాత్రలతో సినిమాలు రూపొందించడం మొదలెటాyడు. అపూర్వ రాగంగళ్‌లో తండ్రి కొడుకులు కూతురిని తల్లిని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇతివృత్తంగా తీసుకున్నాడు. స్వతహాగా బెంగుళూరులో బస్‌కండకyరయిన రజనీ కాంత్‌ను కొడుకు పాత్రకు ఆయన ఎన్నుకోవడం తర్వాతి సంచలనాలన్నిటికీ శ్రీకారం. కమల్‌హాసన్‌ బాలనటుడుగా మొదలైనప్పటికీ నాయకుడుగా స్థిరపడింది మాత్రం బాలచందర్‌ శిష్యరికంలోనే. పదనారు వయందిలే(పదహారేళ్ల వయసు)లో వీరిద్దరూ నటించారు. కమల్‌ హాసన్‌ ఒక విధమైన ప్లేబారు ఇమేజికి పరిమితమైతే రజనీ కాంత్‌ పట్టణ ప్రాంతాల అలగా జన ప్రతిబింబమైనాడు. ఆయన వేష భాషలు మేనరిజమ్స్‌ అన్నీ మాస్‌ మసాలాలై తమిళ గ్రామాల వరకూ పాకాయి.అంతకు ముందు కాలంలో తమిళ చిత్రరంగం డిఎంకె రాజకీయాల పరిధిలో పరిభ్ర’మిస్తే ఇప్పుడు మారిన సాంసృతిక వాణిజ్య సంసృతిలో సామాన్యుల నెరవేరని ఆకాంక్షలకు అలజడికి రజనీ కాంత్‌ ప్రతినిధిగా మారాడు. ఆయన జీవితకథ రాసిన గాయత్రి శ్రీకాంత్‌ అమెరికన్‌ హీరో ల మిశ్రమ స్వభావంతో పోల్చారు. జాన్‌ ఫిక్‌ దీనిపై వ్యాఖ్యానిస్తూ యాంటీహీరోలు మానవ స్వభావంలోని వక్రభాగానికి ప్రాతినిద్యం వహిస్తారు గనకే ఆకర్షిస్తారని విశ్లేషించాడు. కమల్‌ హాసన్‌ నాజూగ్గా మారుతున్న కొద్ది రజనీ కాంత్‌ రఫ్‌గా తయారైనాడు. ఇద్దరూ రెండు ధృవాలుగా తమిళ పరిశ్రమను నడిపించారు. 1975-85 మధ్య రజనీ కాంత్‌ వంద చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. ఈ మద్యలో రజనీ కాంత్‌ నిజ జీవితంలో అనేక ఘర్షణలు వివాదాలలో(సల్మాన్‌ ఖాన్‌లా) చిక్కుకున్నాడు.కొన్ని భిన్న పాత్రలలో నటించి దెబ్బతిన్నాడు. హాలివుడ్‌ చిత్రం బ్లడ్‌ సోyన్‌లో ప్రాధాన్యత లేని పాత్ర ధరించి భ’ంగపడ్డాడు. బాలీవుడ్‌లో అంధకానూన్‌ వంటి చిత్రాలతో ప్రవేశించబోయి నిరుత్సాహం మూటకటుyకున్నాడు. తెర మీద బయిటా కూడా ఈ తరహా అనుభ’వాల తర్వాత అలసిపోయానంటూ ఆధ్మాత్మిక ప్రబోధాలు మొదలు పెటyడమే కాక నూరవ చిత్రంలో రాఘవేంద్ర స్వామి పాత్ర ధరించాడు. అంతటితో ఒక అధ్యాయం ముగిసింది.
1991లో మణిరత్నం రూపొందించిన దళపతి రజనీకాంత్‌ నట జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ముమ్ముటిy దుర్యోధనుడైతే రజనీ కర్ణుడుగా మణి రత్నం మహాభారత కథను మాఫియా నేపథ్యంలో తీసి విజయం సాధించారు. (దీనికన్నా ముందు ఆయనే కమల్‌తో నాయకుడు కూడా తీశాడు.) రజనీ కాంత్‌ అప్పటికే బాగా ఖరీదైన నటుడై పోయాడు.ఇక ఆయనతో కొత్త ప్రయోగాలు ప్రయత్నాలు చేసే సాహసం చిన్న దర్శకులకు దూరమై పోయింది. వడియప్ప(భా’షా) అతని వసూళ్ల శక్తిని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లింది.తర్వాత ముత్తు. నరసింహ వగైరా. ఇవన్నీ తమిళంలో విజయం సాధించడమే గాక తెలుగులోనూ పెద్ద చిత్రాలను మించి పోయాయి.ఇన్నిటి తర్వాత తను చిత్రాలు విరమించుకుంటున్నానని, బాబా విజయవంతమైతే ఆఖరి చిత్రం అవుతుందని ప్రకటించాడు. కాని అర్థం లేని ఆ మంత్రాల చిత్రం ఘోరంగా దెబ్బతిన్నది. కొనుగోలు దార్లకు డబ్బులు తిరిగిఇచ్చేశాడు.రజనీకాంత్‌లో మరో మార్పునకు ఇది దారి తీసింది.
తన స్వంత పాత్ర, మేనరిజమ్స్‌ కన్నా కథకు సాంకేతిక నైపుణ్యానికి ఎక్కువ మొగ్గుచూపడం మొదలెట్టాడు. ఉదాహరణకు చంద్రముఖి 800 రోజులకు పైగా ఆడి ఘన విజయం సాధించింది గాని అందులో హీరోగా రజనీ ప్రత్యేకత చాలా స్వల్పం. కాని ఆయన నటించకపోతే అంతటి వసూళ్లు వచ్చేవా అంటే రావు. ఆ తర్వాత శివాజీ. దీంట్లో నల్లడబ్బుపై పోరాటం చేయడానికి ఎంచుకున్న మార్గం చాలా కృత్రిమమైనదే గాక సాంకేతికమైనది. తొలి వారాలలో వసూళ్లు వచ్చినంతగా తర్వాత రాకపోయినా లాభాలకు లోటు రాలేదు. వందలాది ప్రింట్లతో విడుదల చేయడమే ఇందుకు తారకమంత్రం. ఇక రోబో అయితే ఫక్తు సాంకేతిక గారడీ తప్ప ఆయన నటనకు వున్న అవకాశాలు చాలా చాలా తక్కువ. వీడియో గేమ్‌లాటి ఈ చిత్రంలో ప్రపంచ సుందరిని పక్కనపెటుyకుని విజయం సాధించడం రజనీ అనే సూపర్‌ స్టార్‌డమ్‌కు నిరూపణ ఏమీ కాదు. ఇందులో వున్నది ఒక విధమైన రాజీ లేదా వాస్తవాల ఒప్పుకోలు మాత్రమే. ఆ విధంగా తను జనాలకు దగ్గరగా వుండి వసూళ్లకు ఢోకా లేకుండా చూసుకోవాలని రజనీ నిర్ణయించుకున్నాడు. కాకపోతే ఇప్పటికి అన్ని చిత్రాల్లోనూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూనే వుంటాడు గనక హీరో ఇమేజికి నష్టం రాదు.
లింగా చిత్రం విఫలమవడమే గాక వివాదాలకు కూడా దారి తీశాక కబాలి కనీ వినీఎరుగని ప్రచారంతో విడుదలైంది. హాలివుడ్డు పోకడలు పోయింది. ఈ చిత్రంలోనూ రజనీ వయసు మళ్లిన హీరోపాత్రలో నటించారు. వసూళ్లలో రికార్డులు అదరగొట్టింది గాని మిశ్రమ ప్రభావమే మిగిల్చింది. కాని జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆయన నూతన శిఖరాలు చేరుకుంటూనే వున్నారు. దక్షిణ భారతంలోనే గాక దేశంలోనే ఒక పెద్ద తారగా మారారు. ఆయన పుట్టిన రోజుకు ప్రధాని మోడీ,మిలీనియం హీరో బచన్తో సహా శుభాకాంక్షలు పంపించారు. అయితే జయలలిత మరణం కారణంగా వేడుకలు జరుపుకోబోనని ఆయన ప్రకటించారు.ఇక్కడే రజనీ రాజకీయాల ప్రసక్తి కూడా వస్తుంది. గత ఇరవయ్యేళ్ల నుంచి ఏదో రూపంలో దానిపై చర్చ జరుగుతూనే వుంది.1966లో జయలలితను ఓడించడానికి తన వ్యాఖ్యలు కారణమైనాయని ఆయన సంతాప సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సభకోసం తన హాలును ఇచ్చారు కూడా.ఆ రోజుల్లో ఆయన రాజకీయాల్లోకి వస్తారని వూహాగానాలు నడుస్తూనే వున్నాయి. ఒక దశలో కన్నడ హీరో రాజకుమారన ఆయనను నిరుత్సాహపర్చారు.చిరంజీవి ప్రయోగం వ్రిఫలమైన నేపథ్యం కూడా ఆయనపై బాగా పనిచేసింది. మోడీ ప్రత్యేకాసక్తి చూపడంతో ఒక దశలో బిజెపితో కలిపి కథలు నడిచినా ఆయన వాటినీ తోసిపుచ్చారు. ఇప్పుడు జయలలిత లేని లోటు రజనీ తీర్చగలడని ఒక ప్రచారం నడుస్తుంది. ఆయన శిబిరం వాటిని కొట్టిపారేయడం లేదు. ఇరవయ్యవ శతాబ్దపు అతి శక్తివంతమైన సినిమా ప్రక్రియ రాజకీయ సాంసృతిక రంగాలను కూడా అమితంగా ప్రభావితం చేస్తుందనడానికి తమిళ తెలుగు సమాజాలే పెద్ద ఉదాహరణలు. కాబట్టి ఆయన ఏమైనా చేస్తారా లేదా అన్నది అస్పష్టమే. కాని వ్యక్తిగత జీవితంలో ఆచితూచి అడుగేయడం గమనిస్తే మాత్రం రాజకీయ ప్రవేశం చేయరనే అనిపిస్తుంది. భాషా లో నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అని రజనీ డైలాగ్‌. రాజకీయాల విషయంలో మాత్రం ఆయన వంద సార్లు చెప్పినా ఒక్క సంకేతం ఇవ్వరు.

ఏది ఏమైనా భ’విష్యత్తులోనూ రజనీ చిత్రాలు భారీ ఖర్చు సాంకేతిక విలువలతో ే కొనసాగవచ్చునే తప్ప తొలి రోజుల నాటి ప్రయోగశీలత ప్రత్యామ్నాయ హీరోయిజం వుండకపోవచ్చు.ఇలాటి కథలు దొరికి ఖర్చులు భ’రించాలి గనకనే ఆయన చిత్రాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. మొదటి పదేళ్లలో ఏడాదికి పది చిత్రాలైతతర్వాతి పద్నాలుగేళ్లలో ఆరంటే ఆరు చిత్రాలే చేశాడు. ఇందుకు వయస్సు మాత్రమే కారణంకాదు. మారిన పరిస్తితులలో తన పరిమితులను గుర్తించి ఆయన మార్గం మార్చుకున్నాడనేది స్పష్టం
రజనీకాంత్‌ నటుడుగా పైకి రావడమే ఒక విచిత్రమైన పద్ధతిలో జరిగింది. కూలిగా, కండకyర్‌గా పనిచేస్తూ నిజో రఫ్‌గా తిరిగే రజనీఅనుకోకుండా నటనవైపు మళ్లాడు. స్నేహితుల సలహాపై పూనా వెళ్లి నటనలో శిక్షణ పొంది వచ్చాడు. తొలి అడుగుులోనే ఎగ్జామినర్‌గా వచ్చిన సంచలన దర్శకుడు కె.బాలచందర్‌ చూపులో పడ్డాడు. అంతే. అతనికి తిరుగులేకుండా పోయింది. తను మూడు సినిమాల్లో విలన్‌గా బుక్‌చేసుకున్నాడు. బాలచందర్‌ తీసిన అపూర్వరాగంగళ్‌లో తొలి సినిమా.(తెలుగులో ఇది తూర్పు- పడమరగా వచ్చింది) తెలుగులో వచ్చిన అంతులేని కద(1976)¸లో నాయిక తాగుబోతు అన్నయ్యగా రజనీకాంత్‌ తన ప్రత్యేకత చూపిస్తాడు. 1978లోనే భైరవి సినిమాతో హీరోగా తన ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ ఉభ’యులనూ పైకి తెచ్చిన ఘనత బాలచందర్‌దే.
చేగొండి హరిబాబు తీసిన విభిన్న చిత్రం ‘చిలకమ్మ చెప్పింది'(1979)లో హీరో స్నేహితుడిగా కనిపించి తెలుగు ప్రేక్షకులతో ఓహో అనిపించాడు. పెళ్లికానుక దర్శకుడుగా సుపరిచితుడైన శ్రీధర్‌ అందించిన డబ్బింగ్‌ సినిమా వయసు పిలిచిందిలోకమల్‌హాసన్‌, రజనీ కాంత్‌లు స్నేహితులుగా పోటీపడి నటించారు.అదో పెద్ద మ్యూజికల్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత కమల్‌తో అందమైన అనుభ’వం. కృష్ణతో కలసి అన్నదమ్ముల సవాల్‌ వచ్చింది.
క్రమేణా రజనీ తమిళంలో ఎంజిఆర్‌ తర్వాతి సూపర్‌ సాyర్‌గా అవతరించాడు. అతని మ్యానరిజమ్స్‌ ప్రత్యేక ఆకర్షణ అయ్యాయి. ముఖ్యంగా సిగరెట్‌ ఎగరేసి తాగడం, అదో విధంగా నడవడం. మాట్లాడేప్పుడు చూపుడు వేలు ఆడించడం ప్రతీదాంట్లోనూ ఏదో స్టైల్‌ ప్రవేశపెట్టాడు. బాలచందర్‌ స్కూలు నుంచే వచ్చినా రజనీ మాస్‌, కమల్‌ క్లాస్‌ అనే ముద్ర పడింది. రజనీ నిజజీవితం కోపతాపాలు, వ్యసనాలతో గజిబిజిగాసాగింది. అయినా రజనీ అంటేనే జనం వెర్రిగా పరిగెత్తారు.. తన సినిమాలు తనే తగ్గించుకుని ఒక దశలో పూర్తిగా మానేశాడు. కాని బాలచందర్‌ హితవు చెప్పిన మీదట మళ్లీ మామూలు జీవితంలో పడ్డాడు.
భారీ వసూళ్లు చేసే అవకాశం దృ’ాy్య అతని పారితోషికం విపరీతంగా పెరిగిపోయింది దానికింద లాభ’దాయకమైన జిల్లాలు అటిyపెటుyకుంటూ, వసూళ్లలో సగం వాటాకోరుతూ రజనీ ఆ విషయంలోనూ తనదైన సైyల్‌ ప్రవేశపెటాyడు. అతని తమిళ హిట్ల తెలుగు హక్కులు పొందేందుకు తెలుగు హీరోలు దర్శకులు ఎగబడ్డారు. ఆ విధంగా స్నేహితుడు మోహన్‌బాబుకిచ్చిన ‘ పెదరాయుడు’ కూడా పెద్ద విజయం సాధించింది. భా’షాా,ముత్తు, నరసింహ డబ్బింగ్‌లైనా ఒరిజినల్‌ తెలుగుసినిమాలను తలదన్నేలా వ్యాపారం చేసి రజనీని సంచలన నటుడిగా నిలిపాయి. హీరో ఫ్లాష్‌బ్యాక్‌ను అట్టిపెట్టి ఆకట్టుునే భా’ాషా కథ, డైలాగులు, సంగీతం అన్ని ట్రెండ్‌ సెటర్స్‌ అయ్యాయి. తర్వాత తెలుగులో కాసులు పండించిన ఫ్యాక్షన్‌ కథలకు పునాది భా’ాలోనే వుంది. వేలు చూపేప్పుడు సంగీతం పెంచడం, నడుస్తుంటే హోరు వగైరాలన్ని వచ్చాయి. ో ఇవన్నీ అసహజమే అయినా వసూళ్లు కీలకమనే రజనీ పటిyంచుకోడు.కమల్‌హాసన్‌ వెరైటీ ప్రయోగాలు చేస్తూ లౌకికవాదిగా పరివర్తన చెందితే రజనీ కాంత్‌ అంతకంతకూ మాస్‌ వే’ాలు వేస్తూ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడు.
ముత్తు విజయం తర్వాత రజనీ కాంత్‌ ఎంతో భారీ అంచనాతో అందించిన అరుణాచలం అపజయం పాలైనా తర్వాత మళ్లీ వడయప్ప(నరసింహ) అతని ఇమేజ్‌ను కాపాడింది.అప్పటి నుంచి సినిమాలు మానేస్తానని ప్రకటించాడు. ఇంతలో అకస్మాత్తుగా బాబా మొదలెటాyడు. అదివిజయం సాధిస్తే విరమిస్తానని, విఫలమైతే మళ్లీ నటిస్తానని ముందే ప్రకటించాడు. ఎన్నో అంచనాలు రేకెత్తించిన బాబా ఘోరంగా దెబ్బతింది.ఆ సినిమా కథ మొత్తం మహిమలు, మహత్యాలతో సాగుతుంది. నిజంగా దాన్ని ఎంచుకోవడమే పొరబాటని చాలామంది భావించారు.అయితే బాబాకు భారీ అడ్వాన్సులిచ్చి నషyపోయిన బయ్యర్లకు రజనీకాంత్‌ సొమ్ములు తిరిగిఇచ్చేసి తన ప్రత్యేకత మరోసారి చాటుకున్నాడు.
ఆ ఓటమి తర్వాత చాన్నాళ్లకు రజనీ అందించిన సినిమా చంద్రముఖి. తన ఇమేజిని ప్రదర్శించుకోవడం కంటే ఆసక్తికరంగా రావడంపైనే దృషిy నిలిపిన రజనీ అనుకున్నది సాధించాడు. అయితే బాబాలో లాగే ఇందులోనూ అతీతశక్తులనే ఆధారంగా చేసుకున్నాడు. అందులో దైవ శక్తులైతే ఇందులో క్షుద్ర శక్తులు. అంతే తేడా. కాని సంగీతం, ఫోటోగ్రఫీ, సెటిyంగులు, తారాబలం వగైరాలలో చంద్రముఖి ఉన్నత విలువలతో నడుస్తుంది..మొదట ఈ చిత్రం తమిళనాడులో జయప్రదమైనంతగా తెలుగులో కాలేదన్నారు గాని తర్వాత బాగానే నిలదొక్కుకుంది. యాభై రోజులు పూర్తిచేసుకుంది.
రజనీ కాంత్‌ ముత్తు, నరసింహ చిత్రాలు జపాన్‌లో చాలా బాగా ఆడాయి. ఆ కోవలో చంద్రముఖి మరింత పెద్ద విజయం సాధించింది. వందకోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంటున్నారు. ఘోష్‌y, ఎగ్జార్జిస్‌ వంటి దయ్యం సినిమాలు చూసిన పాశ్యాత్యప్రేక్షకులకు భారతీయ ముద్రతో తయారైన ఈ దయ్యం సినిమా నచ్చే అవకాశాలు సహజంగానే ఎక్కువ.
కమల్‌హాసన్‌ క్షత్రియ పుత్రుడు,భారతీయుడు, శుభ’ సంకల్పం వంటివి హిట్‌ అయినప్పటికీ హేరామ్‌, సత్యమే శివం అభ’రు, ముంబై ఎక్స్‌ప్రెస్‌ తదితర చిత్రాలతో వరుసగా పరాజయాలు చూరగొన్నాడు. పంచతంత్రం, తెనాలి వంటి హాస్య చిత్రాలు ఒక మాదిరిగా ఆడితే బ్రహ్మచారి బాగా విజయవంతమైంది. హేరామ్‌, సత్యమే శివం సందేశాత్మకమైనవి, సాహసోపేతమైనవి కూడా. విశ్వరూపం మరీ శ్రుతిమించిన ప్రయోగమైంది. ఇటీవల ఉత్తమ విలన్‌ కూడా. సమకాలికులు, సమవుజ్జీలు అయిన ఈ ఇద్దరు తమిళ హీరోలు మలిదశలో కూడా భిన్నమైన శైలిని నిలబెటుyకోవడం విశేషమే. రజనీకాంత్‌ తన మాస్‌ ఇమేజిని కాపాడుకోవడానికే ప్రాధాన్యతనిచ్చే రజనీ అందుకు అన్ని విధాల సరిపోతుందనే విశ్వాసంతోనే చంద్రముఖిని ఎన్నుకున్నారు. అయితే చిత్రసీమలో విజయాలను మించిన ఇమేజి ఏదీ వుండదని తనకు బాగా తెలుసు. ఇంతకూ తమిళులను ఇంతగా ఆకటుyకున్న రజనీకాంత్‌ పుటుyకరీత్యా మహారాష్రీyయుడు. స్థిరపడింది కర్ణాటకలో.నటుడుగా రాణించింది తమిళసీమలో.కళకు భా’ా భేదాలు వుండవనడానికిదిదో ఉదాహరణ.
( ఈ రెండు వ్యాసాలు వేర్వేరు సందర్భాలలో రాసినవి. కొంత భిన్నమైన కోణాలు కూడా వుంటాయి. అన్నీ కలిపి కలగాపులగం చేయడమెందుకుని విడివిడిగానే ఇస్తున్నాను. రజనీ గురించి ఇవి తెలియని వారుండరు గాని ఒక చిన్న పరిశీలన 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *