తలకిందులు రాజ్యం.. కవితా కామెంటరీ
శుక్రవారం(25వతేదీ) సాక్షి ఛానల్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు షోలో ా కొన్ని చరణాలు కట్టి చదివాను.
పోస్టు చేయమని చాలా మంది అడిగారు. దీన్ని కవిత్వం అనలేము గాని సందర్భోచిత వ్యాఖ్యానంగా మాత్రమే చూడొచ్చు.
తలకిందులు
నల్లడబ్బు పేరుతోటి
‘నమో’ వేసె బాణం
నడిబజారు పాలాయెను
సామాన్యుడి ప్రాణం
ఘరానాలు క్షేమం
స్విస్ ఖాతాలకు అభయం
తలకిందులు రాజ్యంలో
తల్లడిల్లె భారతం
‘చారువాలా’ పాలనలో
గరీబుకే గాయం
వికటించిన విధానం
విధ్వంసం ఆర్థికం
నిజానికి నాకు పాటలు కవితలు రాయడం బాగా అలవాటే. డైలీ కామెంటరీ రాయడం, సందర్భానికి అక్కడికక్కడే పాట కట్టడం సర్వసాధారణం. వందలాది పాటలు పద్యాలు కంఠోపాఠంగా వస్తాయి. కాని నా మాటలకే ఉడుక్కుంటున్న వారిని ఇంకా ఇబ్బంది పెట్టడమెందుకుని వాటిని పెద్దగా వాడను. కొమ్మినేని అడిగితే ఎప్పుడైనా చెబుతుంటాను. గమనంలో నా శీర్షికలు వచన ప్రయోగాలు తెలిసిన మిత్రులు అభినందిస్తుంటారు. చెప్పాలంటే మీడియాలో నిరంతరం భావ ప్రసారం జరుగుతుంటుంది గనక ఇంకా కవితలు కథల వరకూ వెళ్లడం పెద్దగా జరగదు.ఈ మధ్య ఇంటర్వ్యూలోనూ ఇదే అడిగారు. అభద్ర అన్న నా కథాసంపుటి రెండు ముద్రణలు పూర్తిచేసుకుంది. గురజాడ శ్రీశ్రీలపై సమగ్రఅధ్యయనాలతో సహా పలు సాహిత్య రచనలు కూడా చేశాను. చాలామంది నా మీడియా వీక్షకులకు తెలియని విషయం ఏమంటే ఈ పదమూడేళ్లుగానూ ఇప్పటికీ నేను సాహిత్య ప్రస్థానం అనే మాసపత్రిక సంపాదకుణ్ణి. (వీలు కుదరిత)ే నా పోర్టల్‌లో రోజూ కవితా చరణాలు రాద్దామని వద్దనీ కూడా అనుకుంటుంటా. ఒక తెలుగు సినీ యువకవి భారతీయుల బాధలను అవహేళన చేస్తూ పెట్టిన విడియోకు వీలైతే సమాధానం రాయాలి. అంత ప్రాధాన్యత ఇవ్వాలా అని మరో ఆలోచన. చూడాలి.