మోడీజీ.. మీ కేంద్ర మంత్రికే దురవస్థ
నోట్లరద్దు వల్ల సామాన్యులు సంతోషంగా వున్నారని ప్రధాని మోడీతో మొదలు పెట్టి వందిమాగధులంతా ప్రకటిస్తున్నారు. ఆస్పత్రులు,బిల్లుల చెల్లింపునకు పాత నోట్లను అనుమతించడం గొప్ప ఉపశమనంగా చెబుతున్నారు. దీని బండారం ఏమిటో కేంద్ర మంత్రి సదానందగౌడకు ఎదురైన చేదు అనుభవంతో తేలిపోయింది. గతంలో న్యాయశాఖ నిర్వహించి ఇప్పుడు కార్యక్రమాల అమలు, గణాంకాల శాఖ చూస్తున్న సదానంద గౌడ తమ్ముడు భాస్కర గౌడ(54) మంగుళూరులోని కస్బూర్బా ఆస్పత్రిలో చనిపోయాడు. పసరికల వ్యాధితో ఆయన చనిపోగా బంధువులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాతనోట్లు ఇవ్వబోతే తీసుకులేదు.మంత్రి జోక్యం చేసుకుని చెప్పినాఫలితం లేకపోయింది. ఈ విషయం లిఖిత పూర్వకంగా చెప్పాలని ఆయన అడిగితే నిరభ్యంతరంగా రాసిచ్చారు. తర్వాత ఆయన చెక్కు రాసి ఇచ్చి మృతదేహం తీసుకుని బయిటపడ్డారు. ఇదంతా తప్పు అని అక్కడ రాశారు.అయితేనేం పని మాత్రం జరగలేదు. పైగా ఆస్పత్రి ఎండి సంఘీర్ సిద్దిక్ తమకు రిజర్వు బ్
యాంకు నుంచి అలాటి ఆదేశాలేమీ రాలేదని ఖచ్చితంగా దాని నిబంధనల ప్రకారమే చేశామని ఎన్‌డిటివికి చెప్పారట. మంత్రులకూ అందునా కేంద్ర మంత్రులకు స్వంత రాష్ట్రంలోనే ఇంత దుస్థితి వుంటే మామూలు మనుషుల సంగతేమిటో మోడీజీ మీరే ఆలోచించండి!