స్విస్‌ అగ్రిమెంట్‌లో సీక్రెట్‌ – మోడీ హయాంలో అకౌంట్స్‌ సేఫ్‌

నోట్లరద్దు నిర్ణయం అనర్థక ఫలితాలు తెలిసిన తర్వాత చాలా పత్రికలు మీడియా సంస్థలు వైఖరి మార్చుకుని ప్రజల బాధలు ప్రతిబింబించడం మొదలు పెట్టాయి. కాని అగ్ర తెలుగు పత్రిక మాత్రం ఆ ప్రశంసలలోనే మునిగితేలుతున్నది. స్విస్‌ బ్యాంకులలో సొమ్ములను తెప్పించే విషయమై కుదిరిన ఒప్పందం గురించి మొదటి పేజీలో గొప్పగా ప్రచురించింది. ప్రత్యేకంగా ి మోడీ వాక్కులను సూక్తులుగా తీసుకుని సంపాదకీయం ప్రారంభించింది. ఆయన ప్రతిచర్యనూ ఆకాశానికెత్తుతూ విమర్శలపైనే విరుచుకుపడింది. ఇంత ఘనంగా ఇచ్చిన ఆ స్విస్‌ వార్త చెప్పేదేమిటంటే 2019 వరకూ అంటే మోడీ ప్రభుత్వ పదవీ కాలం ముగిసే వరకూ అక్కడి రహస్య ఖాతాల వివరాలు వచ్చే ప్రసక్తి లేదు అని. అంటే అవన్నీ సురక్షితంగా వుండిపోతాయి. నవంబరు 22(మంగళవారం) ఇరు దేశాల అధికారులుdifference-between-swiss-bank-and-normal-bank-1 – సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సిబిడిటి) చైర్మన్‌ సుహైల్‌ చంద్ర, భారత దేశంలోని స్విస్‌ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ గిలీస్‌ రౌడిత్‌ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2019 సెప్టెంబరు నుంచి ఇరు దేశాలలోని బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఆటోమేటిక్‌ ఎక్సేంచ్‌ ఆప్‌ ఇన్‌ఫర్మేషన్‌(ఎఇఓఐ) ఒప్పందం అని దీనికి పేరు. 2018 తర్వాత అక్కడ డిపాజిట్‌ చేసిన సొమ్ము వివరాలు తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది.అప్పుడైనా మరెన్ని మెలికలు మలుపులు వుంటాయో చూడవలసిందే. మరి దీన్నే గొప్ప చారిత్రాత్మక విజయంగా చెప్పడమెందుకు? మరో విపరీతమేమంటే ఇప్పటికే భారత దేశం కోరగా నిరాకరించిన వివరాల అందజేతకు సంబంధించి ఈ ఒప్పందంలో ఎలాటి నిబంధన లేదు. కాబట్టి మోడీజీ ఎన్నికల వాగ్దానం గోవింద!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *