చరిత్రపేరిట రామచంద్ర గుహ పాక్షిక పాఠాలు

చరిత్రకారుడుగా గత దశాబ్దకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన రామచంద్ర గుహ నిజానికి చాలా విషయాల్లో పాక్షికంగా మాట్టాడ్డం రాయడం నాకు తెలుసు. ఉదాహరణకు ఆయన రాసిన భారత దేశ ప్రభావశీలుల జాబితాలో ఒక్కరంటే ఒక్క కమ్యూనిస్టు నేతకు స్థానం ఇవ్వలేదు. సోవియట్‌ విచ్చిన్నం తర్వాత కూడా రాజ్యాంగంలో సోషలిస్టు పదం కలిగిన ఈ దేశం, బిజెపి కూడా గాంధేయ సోషలిజం తన లక్ష్యమని ప్రకటించుకున్న దేశం కమ్యూనిస్టు సిద్ధాంత ప్రభావానికి ఎంతగా గురైందో చెప్పాలా? దేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా కమ్యూనిస్టులే. అసలు వారు అన్ని రంగాలలో చొరబడ్డారని బిజెపి సంఘ పరివార్‌ నిరంతరారోపణ. కాని మన చరిత్ర కారుడికి అదేమీ అక్కర్లేదు. ఆరెస్సెస్‌ పెరుగుదలకు వామపక్ష వాదులకు దేశభక్తి లేకపోవడం కారణమని, మితవాదులకు మార్గరెట్‌ థాచర్‌ వంటి ఆలోచనా పరులు కావాలని ఆయన ఉవాచ. సరే ఏది ఏమైనా అవి ఆయన అభిప్రాయాలు. మోడీజీ మితవాదం ఆయనకు చాలదన్నమాట. థాచర్‌ రీగన్‌ కావాలి!
తాజాగా ఆయన హిందూస్థాన్‌ టైమ్స్‌లో వ్యాసం రాస్తూ కాంగ్రెస్‌ నశించిపోవాలని ఆకాంక్షించారు. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే దాని నాశనం తప్పదన్నారు. పాక్షిక తీర్పులకూ అసహన వ్యాఖ్యలకు దూరంగా చారిత్రిక వాస్తవికత పాటించవలసిన ఒక మేధావి(బిరుదాంకితుడు) ఇలా రాయడం ఇప్పుడు అధికారంలో వున్న బిజెపికి ఆనందం కలిగించవచ్చునేమో గాని ఆయనకు గౌరవం కాదు. కాంగ్రెస్‌ బాగా బలహీనపడిన మాట నిజమే. విధానాలు మార్చుకుని అవినీతి కళంకం నుంచి ప్రక్షాళన చేసుకోవలసిన మాటా నిజమే.కాని నాశనం కావాలని కోరుకోవడం చరిత్ర కారుని పని కాదు. చరిత్ర పని. దాన్ని నిర్ణయించేది ప్రజలే . ఎందుకంటే రేపు ఇంకొకరు బిజెపి నాశనంకావాలని మరొకరు ప్రాంతీయ పార్టీలు పతనంకావాలని ఇలా రాసుకుంటూ పోతే అది వివాదాలకు తప్ప విచక్షణాయుత చర్చకు మేలు చేయదు.

Congress lacks idealism, energy: Party should perish for India to flourish

  • Ramachandra Guha

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *