బిజెపి మంత్రి దేశ్‌ముఖ్‌ నోట్ల ముఖం

పెద్దనోట్లరద్దుతో అవినీతిపై పోరాటమంటూ ప్రధాని నరేంద్ర మోడీ సర్జికల్‌ దాడి చేస్తుంటే- ఆయన పార్టీకి చెందిన మంత్రి ఒకరు దాదాపు కోటిరూపాయల నోట్లతో దొరికిపోయారు! మహారాష్ట్రలో మంత్రి సుభాష్‌ చంద్ర దేశ్‌ముఖ్‌ సంస్థలకు చెందిన వాహనంలో 91లక్షల పాత నోట్లు పట్టుబడ్డాయి.లోక్‌మంగళ్‌ గ్రూపు పేరిట పంచదార మిల్లులు బ్యాంకులు నడిపే ఆయన ఇది ఆ బ్యాంకులు తీసుకువెళ్తున్నదేనని సమర్థించుకుంటున్నారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖను ఎదుర్కొంటానని ప్రకటించారు. నోట్ల రద్దు వల్ల మొదటిసారి బయిటపడిన నాయకుడు పాలకపక్షీయుడే కావడం ఆసక్తికరం. నిజంగా ఏ తప్పులేకుండా మామూలుగా రవాణా జరుగుతుంటే అప్పుడు పట్టుకోవడం వార్త వెల్లడించడం జరిగేదే కాదు కదా? ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవిస్‌ ఈయనపై ఏ చర్య తీసుకుంటారో చూడాలి మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *