టూరిస్టు బార్లు.. బీచ్‌లో బీర్లు

ఆదాయం పెంచుకునే పేరిట ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంతకంతకూ అభ్యంతరకర నిర్ణయాలు తీసుకుంటున్నది. విశాఖ బీచ్‌లో లౌ ఫెస్టివల్ జరిపి తీరతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక కృష్ణా నదిగర్బంలోని భవాని ద్వీపంలో పేకాట శిబిరం(క్యేసినో) ఏర్పాట్లపై పరిశీలన జరుగుతున్నది. ఇక ఇప్పుడు విశాఖలోనే గాక అన్ని బీచ్‌లలోనూ నూతన బీర్ పార్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పనిలో పనిగా ప్రముఖ పర్యాటక కేంద్రాలలోనూ క్షేత్ర సందర్శనతో పాటు తీర్థ సేవన సదుపాయం కలిగిస్తున్నది. టూరిజాన్ని ప్రోత్సహించడంకోసం బార్ల లైసెన్సు విధానాన్ని సవరించింది. జీవో ఎంఎస్-470 ప్రకారం బీచ్‌లలోనూ, పర్యాటక ప్రాంతాలలోనూ పార్లర్ల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. లక్ష రూపాయల నాన్ రిఫండబుల్ డిపాజిట్‌తో ఇందుకు దరఖాస్తు చేయొచ్చు. బీచ్ షేక్స్, పార్లర్స్ పేరిట వీటికి అనుమతిస్తారట. ఇక్కడ బీరు వైనుతో పాటు రెడీ టు డ్రింక్ మద్యం లభిస్తుందట. ఈ లైసెన్సు వచ్చే ఏడాది మొత్తం అమలులో వుంటుంది. ఈ మద్యం దుకాణాలుఎక్కడ ఎలా ఏర్పాటు చేస్తారో దాని ప్రభావం ఎంత దారుణంగా వుంటుందో చూడాలి. ఎందుకంటే అనేక టూరిస్టు ప్రదేశాలలో ఇప్పటికే అనేక రకాలైన అవాంఛనీయ ధోరణులు అరాచకాలు చూస్తుంటాము. ఇక ఏలిన వారే నేరుగా మందు దొరికే మంచి అవకాశం కల్పిస్తే చెప్పేదేముంది? క్యెేసినోటూరిజం,డ్రింక్ టూరిజం నిజంగా ఆదాయం పెంపు మార్గాలా? రేపెవరైనా రొమాంటిక్ టూరిజం అనరనే గ్యారంటీ ఏమైనా వుందా?
క్యెేసినోటూరిజం,డ్రింక్ టూరిజం Comments:- eka migilindi licence to brothels. oka mettu digevarake, aatharuvatha pata naanni yevvaru aapaleru. deenni digajarudu rajakeeya aalochanalu anavachcha?