కెసిఆర్‌ ఆందోళన, చంద్రబాబు మౌనం

naidukcr_2478588f 55556
నరేంద్ర మోడీ నాటకీయంగా అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు సామాన్యుల సంగతి అటుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలనూ బాగానే దెబ్బతీసింది. ఇరుచోట్ల లావాదేవీలు వ్యాపారాలు స్తంభించిపోయాయి. పన్నుల ఆదాయం పడిపోయింది. రియల్‌ బూమ్‌నే గొప్ప అభివృద్దిగా ఆదాయ వనరుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ చర్య వల్ల అక్కడా బాగా నష్టం కలిగింది. ఏమంటే నల్లడబ్బుతో భారీ కొనుగోళ్లు జరిపే భూ బాబులు కొంత విరామం ప్రకటించారు. మద్యం అమ్మకాలూ తగ్గాయట. అయితే ఈ ప్రభావంపై ఇరు రాష్ట్రాల ప్రతిస్పందనలూ భిన్నంగా వుండటం ఆసక్తికలిగిస్తుంది. కెసిఆర్‌ ఈ నష్టాన్ని గురించి బాహాటంగానే మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే దానిపై బాగా కేంద్రీకరించి ప్రభుత్వం చేయలేకపోయిన పనులకు కూడా ఒక కారణంగా చూపించే అవకాశం వుంది. దీనిపై గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి అధికారికంగానే చర్చించారు.
చంద్రబాబునాయుడు విషయంలో ఇలా జరగకపోవడానికి కారణం ఆయన నోట్ల రద్దు సూచన చేసింది తానేనన్నారు.తీరా చూస్తే రెండురోజుల్లోనూ దాదాపు 170 కోట్ల పన్ను రాబడి ఖజానాకు చేరలేదట.దీనిపై ఆర్థిక శాఖ కార్యదర్శి అజరు కల్లాం బ్యాంకర్లతోనూ మాట్లాడాల్సి వచ్చింది. అయినా ఈ నిర్ణయాన్ని హర్షించారు.కాబట్టి మింగలేక కక్కలేక అన్నట్టు వుండిపోవలసిన స్థితి. అలా అని నిజంగా నోట్ల రద్దు జరిగిందా అంటే కొత్తవి ముద్రించడం తప్ప నోట్లే రద్దయింది లేదు.పైగా మరింత పెద్ద నోటు వస్తున్నది.ఇదంతా చంద్రబాబుకు ముందే తెలుసనే కథనాలూ వున్నాయి. ఈ కారణంగానే అమరావతి ప్రాంతంలో చకచకా భూలావాదేవీలు జరిగిపోయాయని అంటారు. కాబట్టి అస్మదీయులకు పెద్దగా నష్టం వుండకపోవచ్చు గాని మామూలు మనుషులకు మాత్రం పెద్ద దెబ్బే అయింది.

ఈ సందర్భంలో కెసిఆర్‌ ప్రభుత్వం తమకు కేంద్రం నుంచి రావలసిన నెలవారీ పన్నుల వాటా 42 శాతం తగ్గిందని లెక్కలతో సహా వెల్లడించింది. నిజానికి 14వ ఆర్థిక సంఘం కేటాయింపులపై అతిశయోక్తి ప్రచారాలు ఎలా వున్నా శాతంగా చూసినప్పుడు వచ్చేది కొంత తక్కువే. అది కూడా సకాలంలో విడుదల చేయలేదన్నమాట. ఈ సందర్భంలోనూ తెలుగుదేశం కేంద్రంలో భాగస్వామి గనక మాట్లాడలేని పరిస్థితి. మిథ్యా ప్యాకేజీని గొప్పగా స్వాగతించి హడావుడి చేసిన నేపథ్యంలో ఇప్పుడు పన్నుల వాటా తగ్గుదల గురించి మాట్లాడితే రాజకీయ నష్టమని తెలుగుదేశం భావనగా వుంది. కాబట్టి మౌనమే శరణ్యమైంది.రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం నష్టం కలుగుతున్నది.

One thought on “కెసిఆర్‌ ఆందోళన, చంద్రబాబు మౌనం

  • November 11, 2016 at 4:12 pm
    Permalink

    కాబట్టి మౌనమే శరణ్యమైంది.రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం నష్టం కలుగుతున్నది.

    Comments :-evaru teesukunna gotilo valle paddaru. nene rasa, nenechesa, idi anta naa prathibhe ani cheppi, ippudu venakki taggaleruga. prajalloki vellite sanmanamkooda chestaru.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *