‘సంస్కారభరిత’ ఛానల్‌- జబర్దస్త్‌గా కామెడీ కుళ్లు

jabardt11

మొన్న దీపావళి ఆదివారం గనక కాస్త ఎక్కువ సేపు టీవీ చూసే వీలు కలిగింది. ఆ సమయంలో జబర్దస్త్‌గా సాగుతున్న కుళ్లు కామెడీ చూస్తే మతిపోయింది. మామూలుగా దాంట్లో వుండే రాకెట్‌ రాఘవ, చమక్‌ చంద్ర, వండర్స్‌వేణు, చలాకీ చంటి తదితరులు చాలా ప్రతిభావంతులే. సమయస్పూర్తి బాగా వుంటుంది. స్పీడు కామెడీ ఇంకా ఎక్కువ. ఇమిటేషన్లు సెటైర్లు పారడాక్సులు, హిపోక్రసీలు అన్నీ గొప్పగా చూపించగలరు. మెప్పించగలరు కూడా. కాని ఎందుకలా అనుకుంటున్నారో రాను రాను బూతు శాతం దారుణంగా పెరిగిపోతుంది. దీపావళి రోజున చూసిన ఎపిసోడ్‌లో కొన్ని భాగాలు రాయడానికి కూడా ఇష్టం లేదు. సమస్య సరదాగా సరసంగా ఏదైనా అంటే కొంపలు మునిగిపోతాయని కాదు. అయితే ఆ పేరుతో పదే పదే జీవితంలో మరేం లేనట్టు భార్యాభర్తల వ్యవహారాలు పరస్పర ద్రోహాలు చేసి దొరికిపోవడాలు ఇవేనా ఇతివృత్తాలు? ఎగతాళి చేయడానికి ఎన్నో టాపిక్స్‌వున్నాయి గాని మహిళల సమస్యలపై నడిచే పంచాయతీలను కూడా కామెడీగా మార్చేయాలా? అప్పుడెప్పుడో కవిచౌడప్ప బూతాడక దొరకు నవ్వు పుట్టదు సభలో అన్నట్టు ఖతర్నాక్‌ కామెడీ షో అంటే బుతర్నాక్‌ గా మారక తప్పదా? కొన్ని తరాల వెనక్కు పోయి అమ్మాయిలుగానూ అబ్బాయిలే వేషం కట్టి అసహ్యంగా మాట్లాడేస్తుంటే అనుమతించాల్సిందేనా? సంసార పక్ష విలువలకు కట్టుబడి తెలుగు అండ్‌ భారతీయ సంప్రదాయ సంసృతిని సంరక్షించేందుకు కంకణం కట్టుకున్న ఈనాటి చానల్‌ ఇంత పచ్చిగా పిచ్చిగా కూడా కార్యక్రమాలు నడిపిస్తుంటే ఇతరులననేదేముంటుంది? ఇదే ఛానల్‌లో యువత పేరిట ఒక జంట నడుపుతున్న కార్jabardasth-13th-october-2016-full-episode-etv-telugu-comedy-showయక్రమం కూడా వెగటుపుట్టిస్తుంటుంది. సుమ రాజీవ్‌ పాల్గొన్న ఎపిసోడ్‌లో ఈ పెళ్లి వల్ల నా జీవితం నాశనమైందని ఎప్పుడన్నా అనుకున్నారా అని అడిగిన యాంకర్‌ను ఏమనాలి? అడగాలనుకున్నా అదేనే అడిగే తీరు? మరి అతిరథ మహారథులు అపర ధర్మప్రబోధకులు వీటన్నిటినీ ఎలా సాగనిస్తున్నారు?అప్పుడెప్పుడో ఒక జోక్‌ విన్నాను. విమర్శలొస్తున్నాయన్న యజమానితో ప్రోగ్రామర్‌ ఈ బూతు కామెడీతో రేటింగు బాగా పెరుగుతుంది. బూతులు తగ్గించాలా రేటింగు తగ్గించాలా అని అడిగితే సర్లే వెళ్లు అన్నార్ట. సో .. మరీ జుగుప్స కలగకుండా చూడగలరని మనవి. ఆ కుర్రాళ్లకు స్వేచ్చనిస్తే బూతులు లేకుండానే బాగా బాగా చేయగలుగుతారు. మనమే వీక్షకుల బలహీనతలను రేటింగుకు సోపానాలనుకుంటున్నాం. ఈ క్రమంలో కుటుంబాల్లోకి కూడా కళ్లు జొప్పిస్తున్నాం. జడ్జిలు కూడా ప్రతిదాన్ని బావుంది బావుంది అంటూ మోసెయ్యనవసరం లేదు. ముసిముసి నవ్వులూ, ఉత్తుత్తి కోపాలతో మరింత రక్తి కట్టించాల్సిన పనీ లేదు. నేను నీతులు చెప్పడం లేదు గాని మరీ బూతుల్లో ముంచెత్తవద్దంటున్నా. దానికి వేరే ఛానళ్లు సైట్లు వుండనే వుంటాయి కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *