భారత వారసత్వాల్లో అధికారాలు, అంత:కలహాలూ..

karuna_0
సమకాలీన భారత రాజకీయాల్లోనే అత్యంత కురువృద్ధుడు, డిఎంకె అద్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి చిన్న కుమారుడు ఎంకెస్టాలిన్‌ను తన వారసుడుగా ప్రకటించడం పెద్ద వార్తేమీ కాదుు. ఎందుకంటే స్టాలిన్‌ చాలా కాలంగా కీలక పాత్ర వహిస్తూనే వున్నారు. పోనీ అధికారంలో వున్నారు గనక ముఖ్యమంత్రి అవుతారా అంటే అదీ లేదు. పార్టీ అద్యక్ష పదవిలో కొనసాగుతానని కరుణానిధి అంతకు ముందే స్పష్టం చేశారు. కాబట్టి ఇది కేవలం లాంచన ప్రాయమైన రాజకీయ ప్రకటన మాత్రమే. నావంటి వాళ్లం ముప్పై ఏళ్లకిందటే స్టాలిన్‌ వారసత్వం చూశాం. ే కేవలం కుటుంబంలో సమస్యల కారణంగానే కరుణ ఆయనను వారసుడుగా ప్రకటించలేదు. మరో భార్య కుమారుడు మాజీ కేంద్ర మంత్రి అళగిరి, కుమార్తె, ఎంపి కనిమొళి వంటివారికి రాజీ కుదర్చలేకే కరుణ వారసత్వ ప్రకటన వాయిదా వేస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నం చేస్తే అళగిరి విధ్వంసం సృష్టించారు. మరో దశలో కనిమొళి అవినీతి కుంభకోణాల్లో జైలుకెళ్లింది. ఈ లోగా జయలలిత తిరిగి పగ్గాలు చేపట్టారు. ఆమెపై గట్టిగా పోట్టాడుతూ పార్టీ కార్యకర్తల స్థయిర్యం నిలబెట్టింది నిర్ణయాలు తీసుకున్నది స్టాలిన్‌ అయినా అంతా తండ్రి పేరు మీదే.ఇప్పుడు జయలలిత తీవ్రంగా జబ్బు పడ్డారు గనక వారసుడి విషయం తేల్చేస్తే ఎందుకైనా మంచిదని వృద్ధ నేత భావించినట్టున్నారు. ఇది ఇప్పటికిప్పుడే అమలుకు వచ్చేది కాదు.ఈ సందర్భంలో అళగిరిపైనా కరుణ ప్రశంసలు, స్టాలిన్‌కు పరిమితులు విధించడం అందరూ గమనించారు.కాబట్టి ఇది ఆలస్యంగా అది కూడా అరకొరగా జరిగిన పరివర్తనే. ఈ దేశంలో వారసత్వ రాజకీయాలకు ప్రజలు అలవాటు పోయారు గాని అంతర్గతంగా మాత్రం ఘర్సణలు తప్పడం లేదు. లేకుంటే గత ఎన్నికల్లోసే స్టాలిన్‌ నాయకత్వాన ముందుకు పోతే ఫలితం మరోలా వుండేదని డిఎంకె వారంటారు. చాలామంది పరిశీలకుల ఉద్దేశమూ అదే. అసలు ఈ ప్రకటనతో కరుణ నేనే కొనసాగుతానని చెప్పాడనే వారూ వున్నారు.politicalheirs-678x381
పార్టీలూ ప్రభుత్వాలలో కుటుంబ వారసత్వాల గురించి చాలా చర్చ వుంది గాని నేనెప్పుడూ ఆ చర్చకు పెద్ద ప్రాధాన్యత నిచ్చింది లేదు. ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యాలను కాపాడుకోవలసింది ఆయా పార్టీలే గాని బయిటివారి చేయగలిగింది లేదు. పదవుల కోసం పాకులాడేవారు పోటీపడి పొగుడుతుంటే ఏ కుటుంబమైనా ఆధిపత్యం కొనసాగిస్తుంటుంది.
ఇండియాను అనడమే గాని అంత గొప్పదనే అమెరికాలో ఏం జరుగుతున్నది? రెండు సార్లు సీనియర్‌ బుష్‌, తర్వాత రెండు సార్లు బిల్‌ క్లింటన్‌, ఆ పైన రెండు సార్లు జూనియర్‌ బుష్‌, తర్వాత ఒబామా వచ్చినా విదేశాంగ మంత్రి సెనేటర్‌ హౌదాలో అద్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌ రెండు కుటుంబాల చుట్టూనే అమెరికా ఆధిపత్య ఆర్థిక రాజకీయాల పరిభ్రమణం ఈ ప్రజాస్వామ్యం నిజరూపం చూపడం లేదూ?తండ్రులు కొడుకుల వారసత్వ రాజకీయాల సమస్యలేమిటో ఉత్తర ప్రదేశ్‌లోనూ మరో రూపంలో కనిపిస్తున్నది. సమాజ్‌వాది పార్టీ సర్వాధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ పార్టీని తమ్ముడు శివపాల్‌యాదవ్‌కూ ప్రభుత్వాన్ని కొడుకు అఖిలేష్‌ యాదవ్‌కూ ఇచ్చి నడిపిద్దామంటే కుదరడం లేదు. అసలు ములాయం రెండవ భార్య, అఖిలేష్‌ సవతి తల్లి కుట్ర పన్ని ఇదంతా చేయిస్తున్నట్టు ఆరోపించేవారున్నారు. కాదు తరాల ఘర్షణ అనేవారున్నారు. ఈ మధ్యలో ఎస్‌పి నిలువునా చీలిపోతుందని జోస్యాలు కూడా వినిపిస్తున్నాయి గాని అంతదూరం వెళ్లకపోవచ్చునేమో.. అయితే పాత కాలపు పద్దతులను విడనాడితేగాని మరోసారి ప్రజామోదం పొందలేమని భావించిన అఖిలేష్‌ తండ్రిని బాబాయిని పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళుతున్నారట. ఇక బాబాయి శివలాల్‌ నా వల్ల తగాదా ఎందుకని పార్టీ అద్యక్ష పదవి వదిలేస్తానన్నారట. ఈ లోగా ఇరువైపులా ఇద్దరు ఎంఎల్‌ఎసిలు కుట్రల ఆరోపణలతో రచ్చకెక్కారు. దీర్ఘకాలం దూరమై తిరిగొచ్చిన అమర్‌సింగ్‌ కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇదంతా చెప్పడమెందుకంటే వారసత్వాలెప్పుడూ సజావుగా సాగిపోవాలని లేదు.
చరణ్‌సింగ్‌ అజిత్‌ సింగ్‌, పివి నరసింహారావు- ఆయన కుమారులు, ఎన్టీఆర్‌ చంద్రబాబు దగ్గుబాటి బాలయ్య హరికృష్ణ, వైఎస్‌ఆర్‌- జగన్‌, చంద్రబాబు లోకేశ్‌,దేవగౌడ-కుమారస్వామి, నెహ్రూ నుంచి రాహుల్‌ వరకూ… ఇలా చెప్పాలంటే చాలా వున్నాయి. కొన్ని ఒడుదుడుకులున్నాయి. ఆ మాటకొస్తే జయలలిత శశికళ సంబంధాలలోనూ కల్లోలాలు చూశాం. ఇవన్నీ వ్యక్తిగత స్పర్థల్లో సర్వసాధారణం.
అచ్చంగా ఇలాటిది కాదుగాని ఈ మధ్య రానాకు కెటిఆర్‌కు మధ్య నడిచిన ఒక ట్విట్టర్‌ సంభాషణ ఇక్కడ గుర్తుకు వస్తుంది. తండ్రి దగ్గుబాటి సురేష్‌బాబు తీస్తున్న సినిమాలో తొలిసారి నటించడంపై రానా ట్వీట్టర్‌ పోస్టు చేయడం, దానికి స్పందనగా తండ్రులు చాలా కఠినమైన (టఫ్‌) బాస్‌లు అని కెటిఆర్‌ వ్యాఖ్యానించారు. ఆసక్తికరమే. . నాగార్జున వచ్చిన కొత్తలో అక్కినేని బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు- నేనే చాలా తిరగబడే పాత్రలు వేశాను, ఇప్పుడు తానొచ్చి తిరగబడుతుంటే నేను తండ్రిగానో లేక తాతగానో వేస్తానా అని. ఇక బాలకృష్ణ అయితే ఏకంగా తిరుగుబాటే చేశారు. సామ్రాట్‌ అశోక చిత్రం కథ కాన్సెప్ట్‌ నచ్చక చేయడానికే నిరాకరించారు. ( ఈ ఉదంతాన్ని చాలామంది సరదా సారంగధర అనేవారు) తన తండ్రి ఎన్టీఆర్‌ చాణక్య-చంద్రగుప్తలో చంద్రగుప్తుడుగా వేయమని అక్కినేనిని ఎలా అడిగారో అర్థం కాదని ఆయన కోపంగానే వ్యాఖ్యానించిన ఇంటర్వ్యూ నెట్‌లో వుంటుంది. అయితే కెటిఆర్‌, రానాలు తండ్రుల ఆశీస్సులు అండదండలు పుష్కలంగా కలిగి వున్నవారే. కెటిఆర్‌ సంగతి ఎలాగూ రోజూ కనిపిస్తూనే వుంటుంది. ఎంత టఫ్‌ బాస్‌లైనా స్వంత బిడ్డలనే సరిగా ఐస్‌లుగా మారిపోతుంటారు కదా! లేకపోతే అంతగా బడ్జెట్‌ లెక్కలు వేసుకునే అల్లు అరవింద్‌ ఒక్క పాట కోసం అర్జున్‌ పట్టుపడితే కోట్లు ఖర్చు చేశానని ప్రకటిస్తారా? మెగాస్టార్‌ చిరంజీవి సరే కుమారుడి చిత్రాల్లో కనిపించారు కూడా.
. కాబట్టి కెటిఆర్‌కూ రానాకు మాత్రం సమస్య లేదనే చెపచెప్పొచ్చు. లోకేశ్‌కు కూడా. స్టాలిన్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఇక అఖిలేష్‌ పురాణం ఇంకోంత కాలం నడుస్తుంది.జగన్‌ది ఇప్పుడు స్వంత పోరాటమే.. ఇది వారసత్వ పురాణంలో కొంత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *