సైన్యాన్ని వివాదంలోకి లాగింది సర్కారే!

uri_filephoto_3014628f

ప్రధాని నరేంద్ర మోడీని ఉత్తర ప్రదేశ్‌ బిజెపి విజయదశమి నాడుి ప్రత్యేకంగా ఆహ్వానించింది. అక్కడ మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగాలి. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌(శస్త్రచికిత్సాత్మకదాడులు) గురించి సర్కారు మోత మోగిస్తున్న సమయంలోనే పాలక పక్షం ఈ రాజకీయ తతంగం అది కూడా యుపిలో తలపెట్టడం యాదృచ్చికం కాదు.ే మోడీఅక్కడ చేసిన ప్రసంగంలో ఈ విజయదశిమి ప్రత్యేకమైందని ప్రకటించారు. తర్వాత రోజున మన సైన్యం బలంగా వుండాలని ఆకాంక్ష వెలిబుచ్చారు. . సైనిక దశాలకు వందనాలర్పించడం వారి ధైర్య సాహసాలనూ త్యాగాలను ప్రశంసించడం ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. కాని భారత దేశ చరిత్రలో ఒక ప్రధాని బహిరంగంగా సైన్యం బలం గురించి మాట్టాడ్డం ఇదే ప్రథమమేమో. రక్షణ పాటవం అన్నది మామూలుగా వాడే మాట. మోడీ ఇలా మాట్లాడుతున్న తరుణంలోనే ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కూడా మన సైనిక దశాల పరాక్రమాన్ని కొనియాడారు. ఇంకోవైపున సర్జికల్‌ దాడులకు సంబంధించిన విడియో ఫుటేజీ బయిటపెట్టాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వంటివారు కోరితే దాన్ని సైన్యాన్ని శంకించడం అంటూ ప్రభుత్వం వింత భాష్యం చెబుతున్నది.అడుగుతున్నది ప్రభుత్వాన్నయితే సైన్యంపై అనుమానం అంటూ చర్చను దారి మళ్లించడం దారుణం.ఎందుకంటే సైన్యం ఇప్పటికే ఆ ఫుటేజిని ప్రభుత్వానికి అందజేసింది. నిజంగా అది సైనిక రహస్యాల రీత్యా బయిటపెట్టకూడనిదైతే ప్రభుత్వానికి ఎందుకు చేరుతుంది? . ఆక్రమిత కాశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ అవతల వున్న ఏడు టెర్రరిస్టు కేంద్రాలపై దాడి చేసినట్టు, 38 మందిని హతమార్చినట్టు ప్రభుత్వం మీడియాకు ఇచ్చిన కథనాన్నే అఖిలపక్షంలోనూ చెప్పింది తప్ప కొత్తగా తెలియజేసింది లేదు.సర్జికల్‌ దాడులపై అఖిలపక్షంలో ప్రభుత్వం వివరించినపుడు అందనూ బలపర్చారే గాని ఎవరూ ఏ విధమైన విమర్శ చేసింది లేదు.

అయితే తర్వాత పరిస్థితి మారింది.ఒకవైపున బడా మీడియాలో కృత్రిమ దేశభక్తి పొంగిపొర్లిస్తూ మోడీ ప్రభుత్వ హయాంలో ఏదో అపూర్వఘనకార్యం జరిగినట్టు కథలు గుప్పించారు.రెండోవైపున రక్షణ మంత్రి మనోహర్‌ పరికర్ర్‌ పాకిస్తాన్‌ ఈ దాడులతో సుషుప్తిలోకి పోయిందని దెప్పిపొడిస్తే మరో సీనియర్‌ వెంకయ్య నాయుడు తేలుకుట్టిన దొంగలా వుండిపోయిందిన గేళి చేశారు. దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను ఆ దాడి జరిగినట్టు చెబుతున్న ప్రదేశాలకు తీసుకువెళ్లింది. సిఎన్‌ఎన్‌,బిబిసి వంటి ప్రముఖ పాశ్చాత్య సంస్థలు అక్కడేమీ జరిగనట్టు లేదని వ్యాఖ్యలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు నిజాలు వెల్లడించాలని కోరాయి.

సైన్యం ఇచ్చిన సాక్ష్యాలు అందుబాటులో వున్నప్పుడు వివాదాలకు అతీతంగా ఇబ్బందిలేని రీతిలో పూర్తి వివరాలు వెల్లడిస్తే ఏ సమస్య వుండేది కాదు. అందుకు నిరాకరించడమే గాక ప్రతిపక్షాలపై నిందారోపణలు చేయడం ద్వారా ప్రభుత్వమే దేశంలో అంతర్గత వివాదం సృష్టించింది. ప్రతిపక్షాలు పాకిస్తాన్‌ ఏజంట్లులా మాట్లాడుతున్నారని వారి భాషే వినిపిస్తున్నారని వెంకయ్య నాయుడు నోరు పారేసుకున్నారు. అంటే ఒక వైపున సైన్యం పేరిట రాజకీయం చేస్తున్నారని వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని చాలామంది బిజెపి మంత్రులూ నేతలూ ఆరోపణలు కురిపించారు. ఈ దశలో రాహుల్‌ గాంధీ సైనికుల త్యాగాలతో వ్యాపారం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తే బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా రంగంలోకి దిగి కాంగ్రెస్‌ హయాంలో జరిగిన రక్షణ కుంభకోణాలను ఏకరువు పెట్టారు. అదే సమయంలో తెహల్కా ఉదంతం మర్చిపోయారు! సర్జికల్‌ దాడులతో మోడీ ఛాతి 56 నుంచి 100 అంగుళాలకు పెరిగిందని బాధ్యతాయుత స్థానంలో వున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కీర్తించారు. విచిత్రమేమంటే మొదట పఠాన్‌కోట, తర్వాత ఉరి సైనిక స్తావరాలపై పాకిస్తాన్‌ సాయుధులు చొరబడ్డారు. సైనికులు రక్షణ లేని టెంట్లలో వుండటం వల్లనే ఉరీలో అంతమంది చనిపోయారని, ఆఖరుకు భద్రతకోసం అడ్డం పెట్టుకునే ఇసుక బస్తాలకు కూడా నిధులు మంజూరు కావడం లేదని ఈ ఘటనల తర్వాతనే కథనాలు వచ్చాయి. గత దాడులే గాక సర్జికల్‌ దాడి తర్వాత కూడా బారాముల్లా సైనిక కేంద్రం దగ్గర మరి ఈ వైఫల్యాలన్నిటికి బాధ్యత తీసుకోదు గాని స్పష్టత లేని సర్జికల్‌ దాడులపేర బిజెపి ప్రచార రాజకీయం చేస్తూనే వుంటుంది- దానిపై వివరాలు కోరితే మాత్రం సైనిక దళాల స్థయిర్యం దెబ్బ తింటుందని అభాండాలు వేయడం, పాకిస్తాన్‌ ఏజంట్లుగా నిందించడం ఎంత బాధ్యతా రహితం? సరిగ్గా సర్జికల్‌ దాడుల తరుణంలోనే సైనిక సిబ్బంది పించన్లు తీవ్రంగా కోత కోస్తూ లోలోపల ఉత్తర్వులు వెలువరించినట్టు ఆలస్యంగా వెల్లడైంది. ఇక్కడే రాజకీయ కౌటిల్యం తెలసిపోతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *