స్వయంకృతాల పర్యవసానం యాంటీ క్లైమాక్స్‌

babu-new-latest-756-29-1464512470
కేంద్ర కాంగ్రెస్‌ తన రాజకీయ నిర్ణయం మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన చేసినా అనంతర అంశాలు సహేతుక పరిష్కారాలు చేసి వుంటే మరో విధంగా వుండేది. కాంగ్రెస్‌ నేతలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జైరాం రమేష్‌ వంటి వారువిభజనపై రాసిన పుస్తకాలు చూస్తే విభజన తతంగం ఎంత ఏకపక్షంగా అయోమయంగా జరిగించో అర్థమవుతుంది. ఈ మొత్తం కాలంలో హైదరాబాదుతో అనుబంధం, అక్కడ ఉద్యోగాలు పెట్టుబడులు అన్న అంశం ప్రబలంగా ప్రచారమైంది. తెలంగాణ అంటూ ఏర్పడిన తర్వాత హైదరాబాదు దాంట్లో భాగం కావడం అనివార్యమని తెలిసినా ద్రానిపై ఏదో పెద్ద పోరాటం చేస్తున్నట్టు ఈ నాయకులంతా మాట్లాడారు. చివరకు విభజన చట్టంలో పదేళ్లు ఉమ్మడిగా వుండాలని, అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి గవర్నర్‌ పాత్రపై 8వ షెడ్యూలు అమలు కావాలని నిర్దేశించారు. ఇప్పటికీ కొనసాగుతున్న ఇఎల్‌ నరసింహన్‌ స్పష్టత కోరినందునే ఆ షెడ్యూలు పొందుపర్చామని జైరాం రమేష్‌రాశారు. తమాషా ఏమంటే ఈ 8వ షెడ్యూలు వ్యవహారం అమలైందనీ కాలేదనీ చెప్పడం కష్టం. నరసింహన్‌ అసలే పట్టించుకోలేదు. నగరం కూడా ప్రశాంతంగానే వుండిపోయింది. ష్ట్ర పదేళ్లు ఇక్కడ వుండి తెలుగుదేశంను అధికారంలోకి తెచ్చాకే వెళతానన్న చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి, సచివాలయం బ్లాకుకూ భారీ మరమ్మతులు చేయించారు. కాని రాజకీయbabu-frn అవినీతిమయమైన ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి అరెస్టు,, తను మాట్లాడిన క్యాసెట్టు విడుదల తర్వాత ఇదంతా మారింది. ఉమ్మడి రాజధాని అంటే అనుభవజ్ఞుదైన తనకూ పట్టు వుంటుందనే ఆయన అంచనా పటాపంచలైపోయింది. రాజకీయ వ్యూహాలకూ లోపాయికారి ఎత్తుగడలకు కూడా భద్రత వుండదని తెలుసుకున్నారు.ఆ వెంటనే ఆఘమేఘాల మీద హైదరాబాదునుంచి మకాం మార్చేశారు. ఈ విషయంలో కేంద్రం మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. శాసనసభ ఎన్నికల్లో హైదరాబాదులో తెలుగుదేశం-బిజెపి కూటమి అత్యధిక స్థానాలు తెచ్చుకున్నది. ు నగరంకోసం అక్కడున్న వివిధ ప్రాంతాల రాష్ట్రాల ప్రజలకోసం చేయవలసింది చాలా వుండింది. కాని తెలంగాణ తెలుగుదేశం ఒక్కసారి పేకమేడలా కూలిపోయి ముగ్గురు తప్ప అందరూ పాలకప162415క్షంలో కలసి పోయారు! విభజన ఉద్యమ సమయంలో ఈ నగరం గురించిన చర్చకూ అనంతరం ఏడాదిలో తలకిందులైన పరిస్థితికీ కూడా పాలకవర్గాలే కారణమైనాయి.జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 98 శాంతి టిఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో ఈ పరిణామ క్రమం పరాకాష్టకు చేరింది. తెలంగాణలో తెలుగుదేశంపై కూడా అధినేత ఆసక్తికోల్పోయి అధికార పార్టీతో సఖ్యతకు పెద్దపీట వేశారు. ఇదో అనుకోని ముగింపు(యాంటీ క్లైమాక్స్‌) ఇందులో తెలంగాణముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిభా సంపత్తుల కన్నా తెలుగుదేశం నేత స్వయం కృతాలే ఎక్కువ. ఆఖరుకు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అపరిష్క్రత సమస్యలపై కూడా స్పష్టంగా మాట్లాడి పరిష్కరించుకోలేని స్థితిలో పడ్డారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సృహృద్ధాబం వున్నా ఉద్యోగులు కూడా స్నేహంగా వీడ్కోలు చెప్పుకున్నా – తేలని సమస్యలు వెన్నాడుతున్నాయి. ప్రజలకు సంబంధం వుండే హైకోర్టు విభజన విషయంలో మాత్రం చంద్రబాబు తేల్చలేదు. తొమ్మిడి పది షెడ్యూళ్ల విషయం ఒక కొలిక్కి రాలేదు. నదీజలాలపై బాగా ఆలస్యంగా జరిగిన ఆపెక్స్‌ సమావేశం కూడా అంతంత మాత్రంగానే ముగిసింది. వీటిలో చాలా భాగం హైదరాబాదులోనే వుంటాయి.
మద్రాసు టు కర్నూలు అనుభవాలు
ఒకప్పుడు మద్రాసు(ఇప్పుడు చెన్నై) నుంచి ఆంధ్ర రాజధాని తరలించుకువచ్చిన భిన్నమైన పరిస్థితులు ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. 1953 జనవరి 15న రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు1న రాష్ట్రం ఏర్పడింది. ఈ మధ్యలో మద్రాసులో తాత్కాలికంగా ఈ కార్యాలయాలు కొనసాగడానికి అనుమతించాలని ముఖ్యమంత్రి రాజాజీకి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌, ప్రధాని నెహ్రూ ఎంతగా చెప్పినా వినిపించుకోలేదు. పైగా ఆంధ్రలో తనపై విషప్రచారాలు చేస్తున్నారని రాజాజీ జవాబు రాశారు. పార్లమెంటు తీర్మానంలో ఆంధ్రకు చెందిన పలుకార్యాలయాలు కొనసాగుతాయి అన్న వున్న భాగాన్ని కొన్ని కార్యాలయాలు అని మార్పు చేసినా రాజాజీ సంతృప్తి చెందలేదు. అప్పుడు ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడను రాజధానిని చేయాలనే బలమైన ఉద్యమం వున్నా ఆనాడు అక్కడ కమ్యూనిస్టుల ఙలంగురించిన భయం కారణంగా కర్నూలును నిర్ణయించారు. హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేశారు.కర్నూలులో మొదట గుడారాల్లో కార్యాలయాలు నడిపించారు. అయితే 1953 నవంబరు 28న ప్రకాశం పంతులు శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత హైదరాబాదు తరలిపోవలసి వుంటుందని స్పష్టంగా ప్రకటించారు. తర్వాతది చరిత్ర…
కేంద్రం ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసుకుందనేది ఒకటైతే ఇప్పుడు రాజధాని నిర్ణయంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక్క అఖిలపక్షసమావేశమైనా జరిపింది లేదు. అయినా అందరూ బలపర్చారు. ఇప్పుడు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం కూడా సమగ్రమైంది కాదు. శాసనసభ, రాజ్‌భవన్‌, హైకోర్టు వంటి కీలక నిర్మాణాలు జరగవలసి వుంది. కోర్‌ కాపిటల్‌, సీడ్‌ కాపిటల్‌, స్టార్టప్‌ క్యాపిటల్‌ అంటూ ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిని అనేక ముక్కలుగా విభజించారు. ఇవన్నీ తేలకపోవడం వల్లనే కేంద్రం నిధులు ఇచ్చిన మేరకైనా అధికారిక నిర్మాణాలు రహదారులు పూర్తి చేయలేదు. అసలు మొత్తం రాజధాని నిర్మాణ క్రమం చాలా విమర్శలతో వివాదాలతో నడుస్తున్నది. ఇందులో సింగపూర్‌ కంపెనీలు, వారితో చేతులు కలిపే ప్రైవేటు కార్పొరేట్లు, పెద్ద పాత్ర వహించబోతున్నారు. ఇందుకు స్విస్‌ చాలెంజి విధానాన్ని అనుసరించడంపై కేసు నడుస్తున్నది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చినా అది ప్రభుత్వం చెప్పిన ప్రజా రాజధానిగా వుండబోదు. గతంలోని కర్నూలు హైదరాబాదు పరిస్థితి వుండబోదు. ఇది రియాల్టీ కన్నా హైటెక్‌ రియాల్లీ షోలకు వాణిజ్యాలకు వేదికగా మారొచ్చు. అధికారిక అమరావతి, అతిశయోక్తుల వాణిజ్య భ్రమరావతి ఎలా వుంటాయో చూడటానికి దీర్ఘకాలమే పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *