జై జవాన్‌.. నై సాధన్‌!

files-india-pakistan-kashmir-unrest_8fc6fb1a-862a-11e6-92b8-e7f1e026a3c4

ఊరీ ఘాతుకానికి ప్రతిచర్యగా భారత సైన్యం సీమాంతర లక్షిత దాడులు చేయడాన్ని అందరూ హర్షించారు. అంతర్జాతీయ సమాజం కూడా అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌,చైనా, రష్యా, ఇరాన్‌లతో సహా ఈ చర్యల పట్ల సదవగాహనే ప్రకటించారు. టెర్రరిస్టు చర్యలను ప్రోత్సహించడం మంచిది కాదని ఆయా దేశాల నేతలు హితవు పలికారు. పాకిస్తాన్‌ దాడులు జరిగినట్టు ఒప్పుకోక, ఎలా ఎదురు దెబ్బతీయాలో అర్థం కాక తర్జనభర్జన పడుతున్నది. పూర్తిస్థాయి యుద్దం గురించి హడావుడి చేయడం తప్ప అంతటి దుస్సాహసానికి ఇప్పుడు పాల్పడజాలనని దానికి తెలుసు.భారత సైన్యం కూడా ఈ దాడులు నిలిచిపోయాయని చెప్పడంలో సంయమనం ప్రదర్శించింది.
నిజానికి సర్జికల్‌ స్ట్రెక్స్‌, చికిత్సాత్మక దాడులు అనే మాట కొత్తది గాని గతంలోనూ భారత సైన్యం ఇలాటి పనులు చేసింది. 2013లోనూ సీమాంతర దాడులు చేసింది. కాని అవన్నీ పెద్ద ప్రచారం లేకుండా లోలోపల జరిగిపోయాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ సమాచారంతో ప్రచారాత్మకంగా ఈ దాడులు చేసింది.అదే తేడా. నిజానికి పాకిస్తాన్‌ నిరంతరం సాగించే చొరబాట్లు దొంగదెబ్బలు కూడా పాకిస్తాన్‌కూ అలవాటే. వాటికి బాధ్యత నిరాకరిస్తుంటుంది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ ప్రవేశపెడుతూ కూడా బయిటకు ఆ మాట చెప్పదు పాక్‌. అందుకు భిన్నంగా మోడీ అధికారికంగా బెలూచి పోరాటానికి మద్దతు తెలిపారు. అయితే ఉరీ ఘటన చాలా ఘాతుకమైంది గనక ఎవరూ పాక్‌కు మద్దతు పలికే ప్రసక్తి లేకుండా పోయింది.loc-hamirpur_4707130e-8631-11e6-aa25-6de36c266871
ఇవన్నీ బాగానే వున్నాయి గాని ఇంతటి క్లిష్ట పరిస్తితుల్లోనూ భారత సైన్యం సాధన సంపత్తులు సదుపాయాలు అత్యంత అధ్వాన్నంగా వున్నాయంటే ఏం చెప్పాలి? ఉదాహరణకు ఉరీ ఘటనే తీసుకుంటే టెంట్లలో పడుకోవడం, అడ్డుగా పెట్టుకోవడానికి ఇసుక సంచులు కూడా లేకపోవడం వూహకందని విషయం. అధునాతనమైన టెంట్లు, అడ్డుగా ఇసుక సంచీలు వుంటే అనేక సందర్బాల్లో ప్రాణ నష్టం నివారించేందుకు వీలయ్యేది. టెంట్లు, ఇసుక సంచులు సైనికుల జేబు ఖర్చుతో తెచ్చుకునే పరిస్థితి చాలా చోట్ల వుందట. శత్రువు దాడులనుంచి కాపాడే ఆచ్చాదన అవేనన్నది తెలిసిందే
ఇక మరో దారుణం 5.56ఆరెంజ్‌ రైఫిల్స్‌ మార్చవలసిందిగా ఎన్ని దశాబ్దంగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ రంగు గుర్తించడానికి వీలుగా వుంటుంది గనక మన సైనికులు రహస్యంగా దాక్కునిదాడి చేయడం కుదరదు. 2007 నుంచి దీనిపై చర్చలు జరుగుతున్నా యుద్దతుపాకీరంగు రైఫిల్లు సమకూర్చుకోవడం జరగడం లేదని మాజీ సైనికాధికారి బిపిన్‌ జస్వాల్‌ ఆవేదన వెలిబుచ్చారు. ఆ రంగు కారణంగానే శత్రువు మన వారి ఉనికిని గుర్తించి దెబ్బతీసిన ఘటనలున్నాయి.
ఇక సైన్యంలో 9100వేల మంది ఆఫీసర్ల కొరత, 31 వేల మంది సైనికుల కొరత వుంది. దీన్ని భర్తీ చేయడం లేదు. చెప్పాలంటే ఇలాటి సమస్యలు అసంఖ్యాకంగా వున్నాయి. జై జవాన్‌ నినాదం బాగానే వుంది గాని వారి కనీస అవసరాలు కూడా తీర్చకపోతే ఎలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *