ఆస్కార్‌స్థాయికి గుంటూరు పోలీసు హింస ‘విచారణై’

vishran111

చాలా కాలం తర్వాత మరో భారతీయ భాషా చిత్రం ఆస్కార్‌ పోటీలకు అధికార ఎంట్రీగా వెళ్లడం సంతోషమైనా తెలుగు వాళ్లు  ఒకింత విచారించే విషయం వుంది. విశారణై అంటే విచారణ.పోలీసు ఇంటరాగేషన్‌. తమిళనాడు నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన యువకులనుగుంటూరు పోలీసులు తీవ్రంగా హింసించిన తీరే ఈ కథాంశం. ప్రముఖ కథానాయకుడు ధనుష్‌ వెట్రిమారన్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో దినేష్‌, ఆనంది అచ్చి, కిశోర్‌ మురుగదాస్‌ నటించారు. తమిళనాడుకు చెందిన పోలీసు అధికారిగా వచ్చిన సముద్ర ఖని వీరి గురించి తెలుసుకుని ఎలాగో తప్పిస్తాడు.అయితే అక్కడకు వెళ్లాక మళ్లీ తమిళనాడు రాజకీయవేత్తలు వారిని తమ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తారు. ఈ చిత్రంలో పోలీసుల హింసాకాండను చాలా ‘సహజంగా’చూపించారట. ఎంత అంటే చూసి భరించలేనంత. అందుకే మూడు జాతీయ అవార్డులే గాక 2015 వెనిస్‌ చిత్రోత్సవంలో అంతర్జాతీయ పురస్కారంకూడా పొందింది. ఎం.చంద్రకుమార్‌ అనే ఆటో 220916cinidhanush1డ్రైవర్‌ రచయితగా రాసిన లాకప్‌ అన్న నవల ఈ సినిమాకు మూలం.ఈ చిత్రం భారీగా వసూళ్లతో పాటు మంచి పేరు కూడా తెచ్చిపెట్టడం నిర్మాత నటుడు ధనుష్‌కు ఎంతో సంతోషం కలిగించింది.అన్నట్టు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ వేటలోనూ తమిళ కూలీలను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సినిమా వున్నట్టుంది. తప్పదు కదా! అన్నట్టు తమిళ సినిమా ఆస్కార్‌కు వెళ్లడం ఇది ఏడవ సారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *