బయిటకొస్తున్న పాములు, పావులు

నయీమ్ అనంతర కథనాలపై మీడియా ప్రశ్నలు వేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విసుగు ప్రదర్శించారు. సిట్‌ను అడగాల్సిన ప్రశ్న నన్నడుగుతారేమిటని ఆగ్రహించారు. అతను అంతమైనందుకు అందరూ సంతోషిస్తున్నారని, సిట్ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేయవలసిందిగా తాను సూచించానని వెల్లడించారు. ఈ సంచలన విషయంలో ప్రభుత్వాధినేతను అడగడంలో పొరబాటు లేదు.ఆయన చెప్పానన్నట్టు సిట్ సమాచారం విడుదల చేస్తున్నదీ లేదు. ే మీడియాలో మాత్రం కొందరు పాలక ప్రముఖుల పేర్లు, తెలుగు సినిమా నిర్మాతల పేర్లు కూడా తర్వాత బయిటకు వచ్చాయి.. నల్గండ జిల్లా వ్యాపారిని నయీం ఎలా బెదిరించిందీ క్యాసెట్ సంభాషణతో సహా విడుదలైంది. ఆ కేసులో వినిపించే శాసనమండలి ఉపాద్యక్షుడు నేతి విద్యాసాగర్ పేరు మొదటి నుంచి నానుతున్నదే. దీన్ని టిఆర్ఎస్ ఎంఎల్‌సి ఒకరు బలపరుస్తూ పెద్దల సభ గౌరవం దెబ్బతినే వారు అక్కడ వుంటున్నారని అన్నారు. ఈ సమయంలోనే నిర్మాత నట్టికుమార్ ఎపిమంత్రి కింజారపు అచ్చెం నాయుడుకు నయింతో సంబంధాలున్నాయని వెల్లడించారు. దీనికి ఆధారంగా వూర్లు థియేటర్ల గురించి చెబుతున్నారు. గతంలో భాను హత్య జరిగిన సమయంలోనూ బండ్ల గణేస్, కళ్యాణ్ వంటి వారి పేర్లు వచ్చాయి. టాలివుడ్లో మాఫియా మనీ పెద్ద రహస్యమేమీ కాదు. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావులు కూడా తరచూ సినిమా వేడుకల్లో దర్శనమిస్తుంటారు. అంతమాత్రాన అందరిపై ఆరోపణలు చేయాలని కాదు గాని గతంలో వచ్చాయి. ఇక నల్గొండ జల్లా లో టిఆర్ఎస్ ఎంఎల్‌లు మరికొందరి పేర్లు రాగా వారు ఖండిస్తున్నారు. కాంగ్రెస్‌పై వారి దాడి ఎక్కువగా వుంది. మొదట ఫిర్యాదు చేసిన వ్యక్తిగా తెలియవచ్చిన ఎంఎల్ఎ శేఖరరెడ్డి మాత్రం తను ధైర్యంగా వుంటానన్నారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో నయీం తనను బెదిరించినట్టు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చెప్పారు. కోమలిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడిని చంపేశానని నయీం అనడం బెదిరింపా లేక నిజంగానా అనేది పరిశోధించాల్సిన విషయమే. ఇదేగాక మాతో టీవీ చర్చలలో పాల్గన్న టిఆర్ఎస్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు తన ఇంట్లో పెళ్లి జరగాల్సి వుండగా నయీం బెదిరించితే పోలీసులను ఆశ్రయించిన వైనం చెప్పారు. అతని ఆనుయాయులను అదుపులోకి తీసుకుని ‘రని కూడా ఆయన చెప్పారు. ఏమైనా ఇన్ని పావులు లేదా పాములు కదిలిని తర్వాత కూడా ప్రభుత్వం సిట్ మంత్రం పఠిస్తూ కూచుంటే సరిపోదు. ు
. .
మరోవైపున నయీంను అరెస్టు చేయమని తాను చెప్పినా ఎందుకు జరగలేదో అప్పటి డిజిపి అరవిందరావు చెప్పాలని మాజీ హౌం మంత్రి జానారెడ్డి అంటారు. నయీం అరెస్టుకు తాను ఉత్తర్వులిస్తే అప్పటి ముఖ్యమంత్రి (కిరణ్ కుమార్ రెడ్డి) అడ్డుపడ్డారని దినేష్ రెడ్డి అంటారు. ఒకరిమీద ఒకరు వేసుకోవడం తప్ప ఎవరిని ఎవరూ బయిటపెట్టరు.
బిజెపి గజిబిజి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అమిత్‌షా పై ఆరోపణలున్న సోరాబుద్దిన్ ఎన్కౌంటర్లోనూ హీరేన్పాండ్యా హత్య కేసులోనూ నయీం పేరుంది. అసలు సోరాబుద్దిన్ అప్పగించిందే నయీం అని అనధికారికంగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఉదంతంపై సిబిఐ విచారణ జరపాలని ఇంద్రసేనారెడ్డి కోరారు. ఆయన నయీం స్వస్థలమైన భువనగిరి నాయకుడు గనక అలా అడిగారని ఆ పార్టీకే చెందిన ఒక సీనియర్ అన్నారు. సిబిఐ అయితే అంతా తమ చేతుల్లో వుంటుందనే ఆలోచన అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం బిజెపిలో వున్న మాజీ డిజిపి దినేష్ రెడ్డి సిట్ సరిపోతుందన్నట్టు మాట్లాడటం తెలిసిందే. తను పార్టీ తరపునే మాట్లాడానని తనను ఢిల్లీ నేతలు అభినందించారని ఆయనంటారు..
ఏది ఏమైనా నయీం అనుచరుల అరెస్టులు జరుగుతున్నా వెనకనున్న రాజకీయ హస్తాలు, పోలీసు నేస్తాల పాత్ర గప్చిప్ అయిపోతున్నది. తెలంగాణ ఎపిలలో ఇప్పటి వరకూ బయిటకు వచ్చిన పెద్దల పేర్లకు సంబంధించి వివరణలు లేవు. తెలిసిన విషయాలను రోజూ చెప్పాలని సిట్‌ను ఆదేశించినట్టు కెసిఆర్ చెప్పారు గాని ఇప్పటికి చెప్పింది నామమాత్రం.వాస్తవానికి .అంతర్ రాష్ట్ర ముఠాగా వేళ్లు అల్లుకుపోయిన నయీం ఉదంతాన్ని జాతీయంగానూ దర్యాప్తుచేయాల్సింది. ఆయా నేతల రాజకీయ అనుబంధాలకు అతీతంగా పారదర్శకంగా సమగ్ర విచారణ జరిగితేగాని నిజంగా డొంక కదలదు. బాధితులకు న్యాయమూ జరగదు. . ఇప్పుడు వచ్చే కథనాలలో అత్యధిక భాగం భూ దందాలకు సెటిల్మెంట్లకు సంబంధించినవి. పాలక పక్షంతో సహా పెద్ద పార్టీల నేతలు వ్యవహారాలు ఇప్పటికి కొనసాగిస్తున్న ఉదాహరణలెన్ని లేవు? ఇప్పుడు కొత్త జిల్లాలతో ముడిపెట్టి మరింత పకడ్బందీగా ఈ భూలావాదేవీలు కబ్జాలు ఆర్జనలు సాగుతున్న మాట నిజం. వాటిలోనూ కబ్జాదారులపైనా అనధికార పంచాయితీలపైనా చర్య తీసుకోకపోత అమాయకులు బలైపోతారు. ప్రభుత్వం ఎంత చెప్పినా పత్రాలు తీసుకున్న నయీం ముఠా నేరాలు నిరూపించి ఆస్తులు తిరిగి అప్పగించడం పెద్ద ప్రక్రియ.దానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉపయోగించాల్సి వుంటుంది చూడాలి