జండా ఎగరేశాడు..ి ప్రాణాలర్పించాడు…
ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవాన పతాకం ఎగరేసిన వీర డు కొద్ది గంటల్లోనే హతమవడం హృదయాన్ని కలచివేసే ఘటన. జమ్మూ కాశ్మీర్లో సిఆర్పిఎఫ్49 కమాండర్ ప్రమోద్‌కుమార్ త్రివర్ణ పతాకం ఎగరేశారు. ఉత్తేజ కరమైన సందేశం కూడా ఇచ్చారు. తర్వాత గంటసేపటిలోగానే ఒక సాయుధ ఘర్షణలో అతని ప్రాణాలు పోయాయి. కాశ్మీర్లో పరిస్థితికి ఇదొక ప్రతిబింబం మాత్రమే. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పరిష్కరించవలసిన సమస్యను సాయుధ బలగాలకు అప్పగించేసి చేతులు దులుపుకుంటున్నారు పా
లకులు. పైగా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటారు. దీనికి బలయ్యేది మాత్రం అమాయకులైనప్రజలు ముఖ్యంగా యువత మరోవైపున వీర సైనికులు సాయుధ దళాల వారు. అత్యాచారాలు తప్పులు చేసేవారే గాక నిజంగా శత్రువులపై పోరాడుతూ ప్రాణాలర్పించే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా వుంటుంది.భారత సైనిక దళాల ప్రధానాధికారిగా పనిచేసిన జెజెసింగ్ పుస్తకాన్ని అనువదించేప్పుడు నేను ఇలాటి చాలా ఘటనలు చదివాను. పాట్నా జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ తర్వాత జార్ఖండ్‌లో చదువుకుని 90వ దశకంలో సైన్యంలో చేశారు. జెండా ఎగరేసేముందు వాచి చూసుకుంటూ ఈ రోజు చాలా ముఖ్యమైనరోజు అన్నారట. అంతలోనే అతను బలికావడం సహచరులను తీవ్ర విచారానికి లోను చేసింది.